సంఘారాధనలు

⌘K
  1. Home
  2. Docs
  3. సంఘారాధనలు...
  4. 15. ఉపకార, అపకార నివారణ స...
  5. విజ్ఞాపనాంశములు

విజ్ఞాపనాంశములు

చదువరీ! మిత్రుడా! నీవు నిన్ను గురించి దేవుని ప్రార్ధించుకొనుట చాలదు. ఇతరులను గురించి ప్రార్ధింప వలెను. నీకు తీరిక ఉన్నప్పుడు దేవుని యెదుట ఈ అంశములెత్తి ప్రార్ధించుము. లేదా చదివివేయుము. ఈ దిగువనున్న మాటలను గురించి అనిగాని, కొరకు అని గాని చేర్చిచదువుము. దీనికి నీ జాబితా చేర్చుకొనవచ్చును.

ప్రార్ధనాంశములు: దేవుడు కలడని నమ్మినవారు, కలడని నమ్మియు ఆయన తలంపే లేనివారు, దుష్ట బుద్ధిగలవారు, మాంత్రికులు, మెస్మరిజమువలన హాని చేయువారు, భూతపీడితులు, దుష్ట స్వప్నములు గలవారు, తప్పుడు దర్శనములు గలవారు, శక్తిపూజ చేయువారు,అజ్ఞానులు, నరహంతకులు, నరమాంస భక్షకులు, స్వహత్య చేసికొనువారు, అబద్ధికులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, కుటుంబ కలహములు, గవర్నమెంటువారు తక్కిన అధికారులందరు, వారి విరోధులు. కలహ నివారణలు, యుద్ధనివారణలు, దొంగతనము చేయువారు, జీవ హింసకులు, మతదూషకులు, అసూయ, పగ, ద్వేషము, కోపము గలవారు,చింతా క్రాంతులు, సోమరులు, నేరములు కల్పించువారు, మనస్పర్ధలు గలవారు, కృత్జతలేనివారు, అన్యాయము పొందువారు. పెట్టు మందు కారకులు, బాకీలు తీర్చనివారు, వడ్డీలు యెక్కువ కట్టువారు, యెక్కువ లాభమునకు సరుకు అమ్మువారు, అన్ని విధములైన వృత్తులుగలవారు, పిరికివారు, ఊరకనే అనుమానపడువారు, తెలియని పాపములు చేయువారు, అశుభ్రత, అజాగ్రత్త; అనాగరికత, అనాచారము, దురాచారము గలవారు, ఆయా వ్యాధులు గలవారు, వైధ్యశాలలలోని వారు, చేతి పనుల శాలలోనివారు, గుడ్డివాండ్ర పాఠ శాలలోనివారు, బీదవారు, భిక్షకులు, పనులు అ, ఊరూరు తిరుగు దొమ్మరులు, మొదలగువారు, అనాధశాలలు, పాఠశాలలు, నీటిమీదను, మెరక మీదను, అడవులలోను, బండ్లమీదను, విమానములమీదను, ఎండలోను, వానలోను, చీకటిలోను ప్రయాణముచేయువారు, మరల యొద్దను, గనులలోను, నీటిలో పనిచేయువారు, అన్ని మతములవారు. అన్ని దేశములవారు, సత్ప్రవర్తన గలవారు, ఉపకారులు, సరియైన వివాహములు. ప్రసవవేదనలు, సంతాన విహీనత, పంటలు, కరవులు, యితరుల భూములను ఆచరించుకొనువారు, పక్షులు, పశ్వాదులు, మృగాదులు, వృక్షాదులు, పురుగుల వలన తక్కిన జీవులవలన, మనుష్యుల వలన, ముండ్లవలన, రాళ్ళవలన, శీతోష్దాది భేదమువలన, కలుగుహాని, ఆకస్మికపాయము, పిడుగు, భూకంపము, వరద, వానలేమి, అన్నదాన సమాజములు మొదలగు పరోపకార సమాజములు, మత సంబంధమైన సమాజములు మత సంబంధమైన సభలు. నూతన విషయములు కనిపెట్టువారు, ఈ జీవాంతమందు కలుగనైయున్న జీవితమును గూర్చిన తలంపులేనివారు, పాపఫలితము అనుభవించుచున్నవారు, మనస్సాక్షి యొక్క మాట నిర్లక్ష్య పెట్టువారు, ఆపత్కాలమందు ఏమిచేయవలెనో తోచనివారు.

Please follow and like us:

How can we help?