సంఘ పెద్దలను యేర్పర్చునపుడు చేయవలసిన ప్రార్ధన
బో: ప్రియులారా! సంఘముయొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభువు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనిమీద పెద్దలుగా నుండుటకై నేడాయన మిమ్మును పిలుచుచున్నాడు. ఆయన నెవరిని పిలుచునో వారికి తమ విధులను నెరవేర్చుకొను సామర్ధ్యముకూడ ననుగ్రహించును. మీరట్టి సామర్ధ్యమును విశ్వాసమూలముగా సంపాదించుకొనగలరు. దైవాత్మ మిమ్మ్ను నేయేపనులయొద్దకు నడిపించునో ఆయా పనులను దేవుని ముఖముచూచి మహాశ్రద్దతోను, నిరీక్షణతోను, నమ్మకముగా చేయుడని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఈ పనికి వాక్యసేవకు డైన నేను మీకు దైవాశీర్వాదము ప్రకటించుచున్నాను.
మీరు దీవెన పొందినవారై బయలుదేరుడి.మీసత్ప్రవర్తన మూలముగా ప్రభువునకు మహిమ కలుగునట్లు సమస్త మానవుల యెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.సృష్టికర్తయెన దేవుడు మీలో నెప్పటికప్పుడే అగత్యమైన ఆలోచనను సృష్టి చేయునుగాక! రక్షడైన యెసుప్రభువు తాను తెచ్చిన రక్షణను మీకు జ్ఞాపకముచేయునుగాక! పరిశుద్ధాత్మ ప్రభువు తండ్రి! మీ కిచ్చువాటిని పుచ్చుకొనుచూ వాడుకొనునట్లు మిమ్మును దీవించును గాక! ఆమెన్.
అ. కా. 6:5-6, 14:23; 15:6; 21: 18; 1తిమోతి 5:17 తీతు 1:5-6, యాకోబు 5:14; 1పేతురు 5:1.
Please follow and like us: