ఆదికాండము 2:1 లో సర్వము లిఖితమైయున్నది. ఆకాశములు, భూమి, వీటిని నడిపించు సమస్త సైన్యసమూహము ఈ వచనములో గలవు.
ఇంగ్లీష్‌లో హోస్ట్ అనే పదమునకు సరైన తెలుగు బిబ్లికల్ పదము దొరకలేదు. బైబిలులో సైన్యము, సమూహము, పట్టుకొమ్మ అను పదములు ఉపయోగింపబడెను. కావలి, రక్షణ, భరించు, మోయు, సహించు అను అర్థము కూడ దాగి ఉన్నది.
ప్రభువు సిలువపై సమస్తమును భరించి, సమాధానపరచి, విశ్వాసులకు సర్వాధికారమునిచ్చెను. విశ్వాస సైన్య సమూహమునకు జన్మనిచ్చు ఏకైక ఆశ్రమము సిలువ.
ప్రభువు సిలువ చెంత ఉన్న శిష్యులు భూదింగంతములవరకు వెళ్ళి భూమిని తలక్రిందులుగా చేసిరి.కొన్ని వేల సంవత్సరములనుండి సతమతమౌతున్న సమస్యలను సువార్తతో సమూలముగా పరిష్కరించిరి. సిలువలోని శక్తి అటువంటిది. సిలువను భరించుట దైవశక్తిని ధరించుట అను అనుభవము ప్రతి విశ్వాసి కలిగియుండును.
ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమును తన సిలువ ద్వారా జయించి మనకు అధికారమిచ్చెనని, సిలువ ధ్యానము సంతోషమును, సమాధానమును కలుగజేయును అను సత్యమును మన అనుభవములోనికి తెచ్చుకొందుము గాక!
కొలస్సీ 1:20 ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను. హెబ్రీ 12:2 మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. |
ప్రభువునకు గల ప్రత్యేకత సిలువ ఘట్టము. ఆ 7 వారములు(పస్కా నుండి ఆరోహణమువరకు) సమస్త సైన్య సమూహము (సృష్టి, దేవదూతలు, పరలోకము, నరలోకము, పాతాళలోకము) స్పందించిన విధము ఒక ప్రత్యేకమైనది. మరణము, కావలిగల సమాధి, పునరుత్ధానము, ఆరోహణము ఎంత ఏకైక ఘట్టములో రాకడ కూడ మన ఊహకు అందని రక్షణ ప్రక్రియ.
సైన్యములకు అధిపతియైన దేవుని సమూహములో ఇమిడి యుండుటకు సుళువైన సిలువను భరించు హృదయమును దేవుడు మనకు దయచేయునుగాక!
ఫిబ్రవరి 26, భస్మ బుధవారము నుండి సిలువధ్యానములు ప్రారంభము. ఏప్రిల్ 10, మంచి శుక్రవారము. ఏప్రిల్ 12, పునరుత్ధాన పండుగ. మే 21, ఆరోహణ పండుగ. మే 31, పెంతెకోస్తు పండుగ.
ఆత్మీయ స్వస్తత Seven steps to increase the faith 1. Read the promises in bible: Bible…
ఆదికాండము 2:1. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఒక్కొక్కరి అధికారమును బట్టి, జ్ఞాన పరిధిని బట్టి విషయపరిజ్ఞానముండును.…
మొట్టమొదటి రాజధాని ఏదేనును మానవుడు కోల్పోయిన తర్వాత దేవుడు బేతేలును రాజధానిగా బైలుపర్చి ఇశ్రాయేలును దర్శించెను. బేతేలు పాడైపోయినపుడు, దేవుడే…
పరిచయం:ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జనవరి 27, 28, 29వ తేదీలలో ప్రతీ బైబిలుమిషను విశ్వాసి మనసు మీటింగ్స్ మీదనే ఉంటాయి.…
2019 is a year of fruitful life. Every Christian supposed to exhibit the spiritual fruits.
This website uses cookies.