లెంటులోని మొదటి దినము - శ్రమలధ్యాన ప్రారంభము

ఆది 18:25;లూకా 18:9 ;కొలస్సి 2:18-23;

సలహా:- తిండి బలమునుబట్టి శరీర బలము. శరీర బలమును బట్టి పని బలము. పని బలమునుబట్టి ఫలితముండును. అట్లే శ్రమకాల ధ్యాన బలమునుబట్టి ఆత్మీయ ఫలితమును ఉండును.


ప్రార్ధన:- దయగల తండ్రీ ! నీ శ్రమలను ధ్యానించుటకై సంఘము నేర్పరచుకొన్నావు. ఈ శ్రమల ప్రారంభదినమున మమ్ములను చేర్చినందులకు వందనములు. మా జీవితకాలమంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును. అయినప్పటికిని సంఘము ప్రత్యేక సమయము నేర్పరచుకున్నాది. రాబోవు వారములలో ఆదివారము, శుక్రవారపు దినములలోనే గాక ప్రతిదినమును నీ సిలువను ధ్యానించిన యెడల మాకెంతో మేలు. మేమెట్లు ఈ దినమునుండి నీ సిలువను ధ్యానింపవలెనో మాకు నేర్పించుటకు, నీ యాత్మ శక్తిననుగ్రహింపుము. నేడు మేము నీ శ్రమ చరిత్ర యొక్క ముఖ ద్వారమున నిలువబడియున్నాము. మాకు గడచిన కాలములో, రాబోవు కాలములో వ్రాయబడిన వ్రాతమూలమున నీ శ్రమ చరిత్ర కనబడుచున్నది. నీ సంగతులను మా అలోచనలతో నింపుకొనునట్లు నీ కృప ననుగ్రహింపుము. ఏదో యొక వర్తమానము నీ దినమున మాకనుగ్రహింపుము. భూలోకములో యెక్కడెక్కడ ఈ పండుగ నాచరించుచున్నారో వారికిని నీ వర్తమానము నందించుము. సంఘము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమలయొక్క ధ్యానశక్తిని మాకనుగ్రహింపుము.


దీవెన:- శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులారా! మీకు శుభము కలునుగాక! భస్మ బుధవార పండుగకు చేరుకొన్న వారలారా! మీకు ధ్యానశక్తి కలుగునుగాక! క్రిస్మసు పండుగ ఒక్క రోజుకే అయిపోవును. క్రొత్త సంవత్సర పండుగ ఒక్క రోజుకే అయిపొవును. ఈస్టరు, పునరుత్ధానము, అడ్వంటు, మట్టలాదివారము మొదలైన పండుగలన్నీ ఒక్క రోజుకే అయిపోవును. ఈ శ్రమకాల పండుగ ఒక్క రోజు పండుగకాదు. ఇది 40 దినముల పండుగ. ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును. ప్రభువు స్వయముగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు. ఇవి చేయండని ఆజ్ఞాపించినారు. అవి మనము చేయవలెను. అయితే ఈ శ్రమకాల ధ్యానము 40 దినములు మీరు చేయండని ప్రభువు ఆజ్ఞాపించలేదు, చెప్పను లేదు. ఇది సంఘమునకు విడిచిపెట్టిరి. ఇన్ని రోజులని, అన్ని రోజులని ఆయన చేప్పలేదు. అందుచేత సంఘము ఏమి చేసినది? మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంఘము ఏర్పరుచుకొన్నది. రెండవసారి అది సంఘమునకు చాలక, మరికొన్ని రోజులు కలుపుకొన్నది. చివరకు 40 దినములు కలుపుకొన్నది. ఆ 40 దినములు ఖాయము చేసికొన్నది. బైబిలులో అయితే 40 దినములు కొన్ని ఉన్నవి. బైబిలులో ఉన్న 40 దినములు సంఘమేర్పర్చుకొన్న 40 దినములు సరిపోయినవి. గనుక ప్రభువు బైబిలులోని ఆ 40 దినములు, సంఘము ఏర్పర్చుకొన్న ఈ 40 దినములు చూచి ఊరుకున్నారు. సంఘము ఆజ్ఞలు నెరవేర్చుట చూచి ఏలాగు సంతోషిస్తున్నాడో, ఆలాగే సంఘము ఈ 40 దినములను ధ్యానమునకు ఏర్పర్చుకొనుట చూచికూడ ప్రభువు సంతోషించుచున్నాడు. అందుచేత ప్రభువు సంఘము చేయునది చూచి మౌనముగా నిశ్శబ్ధముగా ఊరికున్నారు. ఈ దినమునకు భస్మబుధవారమని పేరు. ఈ రోజునుండి లెక్కబెట్టుకొంటూ వేళ్లితే సిలువయొద్దకు వెళ్లే సరికి 40 దినములు పూర్తి అగును.

ఈ ఆరు 40 దినములును ఒక విషయములో సమకూడినవి. అయితే ఈ శ్రమకాల 40 దినములు ధ్యానముకొరకు వాడుదురు.

ఆలాగే ఈ 40 దినములును సంతోషదినములే కాని దుఃఖదినములు కానేకావు. అయితే భస్మ బుధవారము అట్టిదికాదు. భస్మ బుధవారము మొదలు సిలువదినము వరకు రెండు సంగతులున్నవి. ఈ 40 దినములును ఆ రండున్నవి. ఆ రెండును గుర్తించండి. అవేవనగా, దుఃఖమున్నూ, సంతోషమున్నూ. ఈ రెండును కలసి ఉన్నట్లు గుర్తించాలి.


దుఃఖము: ప్రతి ఒక్క మనిషివద్ద ఈ రెండున్నవి. అవి ఏమిటనగా దుఃఖము, సంతోషము.
    • 1) పాపములు ఒప్పుకున్నప్పుడు దుఃఖము వచ్చింది గనుక దుఃఖపడ్డాడు.
    • 2) అయితే, తరువాత నేను మారుమనస్సు పొందితినను సంతోషముండును.
    • 1) పాపము చేసి పొరుగువానికి దుఃఖము కలుగజేసితిని అని దుఃఖపడును
    • 2) అట్టివారియొద్దకు వెళ్లి క్షమాపణ కోరిన తరువాత ఒప్పుకొన్నాననే సంతోషం ఉండును.
    • 1) నా పాపమువల్ల ప్రభువును దుఃఖపరచితినని దుఃఖపడును.
    • 2) ప్రభువు వచ్చి ఆదరించగా సంతోషము కలుగును.
    • 1) ప్రభువా! నా పాపములు, వ్యాధులు, బాధలు, శిక్షలు నీవు మోసికొంటివి అను దుఃఖము కలిగియుండును. నా మీదకు రావల్సినవి, ఆయనమీదికి వెళ్లెనని దుఃఖపడును.
    • 2) నా మీద లేవు ఆయనమీదికి పోయినవను సంతోషముండును.
    • 1) నేను అయోగ్యుడను అని ఎన్నికలేని మనిషిని. నా కొరకు నీవు ఇన్ని శ్రమలు పోందినావనే దుఃఖముండును.
    • 2) అయితే, ప్రభువు యెడల అపారమైన కృతజ్ఞత కలిగి యున్నందువలన సంతోషముండును. అందునుబట్టి దుఃఖము, కన్నీరు కలుగును.
    • ఉదా:- సిలువమోయుచూ వెళ్లుచున్న ప్రభువు యొక్క శ్రమలు చూచుచూ, ఆయనను వెంబడించిన స్త్రీలను చూచి ఆయన ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా! నా కొరకు ఏడ్వకుడి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి అనెను. అనగా వారిని(ఏడ్చుచున్నవారిని) ఓదార్చెను, ఆదరించెను.
    • 1) మనము సిలువమీద ఉన్న ప్రభువును చూచు దుఃఖస్తే.
    • 2) ప్రభువు మనలను ఓదార్చును, ఆదరించును.
(A) యేసుప్రభువు:- (B) యేసు మనిషి:-

ఫలితము:- ఎందరిని గూర్చి చెప్పితినో,ఆ అందరిలోను. ఈ 6 చరిత్రలలనుబట్టి ఈ 40 దినములు ధ్యానముచేస్తే మనము భస్మ బుధవారమును, మండల కాలమును నెరవేర్చిన వారమగుదుము. ఆ రీతిగా ఈ 40 దినములు ఉపవాస ధ్యానము నెరవేర్చు ధన్యత పెండ్లికుమారుడైన సిలువనాధుడు మనకు దయచేయును గాక! ఆమేన్.


కీర్తన:- "యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు - మాసతోను సోదరా = మన దోసంబు నెడబాపు - ఈ సంతాప మరణ - వ్యాసంబు చే సోదరా" ||యేసు||