జ్ఞాతవ్యము 7: Father M. Devadas
అపో.కార్య. 12:4.
- పేతురును రేపు ఉరితీయుమని సన్ హెడ్రీన్ సభలో తీర్మానమైనది.
- పేతురుకు సంకెళ్ళు వేయబడెను.
- పేతురును జైలులో కొట్లులో పెట్టిరి.
- దిట్టమైన కావలివారిని ఏర్పరచిరి.
- తలుపులు మూయబడెను (అవి ఇనుప తలుపులు).
- బ్రతుకవలెననే తలంపులేదు.
షరా:- ఈ 6 సంగతులకే నిరీక్షణ లేనికాలమనిపేరు.
శ్రమ-పరీక్ష-సమర్పణ. శ్రమ ముందా? సమర్పణ ముందా? దేవుని కార్యక్రమములో మొదట సమర్పణ.
- (1) మన ఇష్టపూర్వకముగా మంచేగాని, చెడ్డేగాని, సేవయేగాని, ధనమేగాని, సంతానమేగాని, విద్యేయేగాని, ఉద్యోగము మొదలైనవి అనుభవించిన తరువాత దేవుడు మనకు శ్రమ రప్పించును.
- (2) ఈ శ్రమ వచ్చిన తరువాత మనము మేలుకొని త్వరగా సమర్పణ దగ్గరకు పరుగెత్తుదుము. ఈలాగు చేయుటవల్ల మనకు మేలు కలుగును గాని కష్టములు వచ్చిన తరువాత చేయు ఈ సమర్పణకంటే ముందుగానే నమర్చణ దగ్గరకు వరుగెత్తి నంపవూర్ణముగా సమర్పించుకోవడము గొప్ప మేలు.
1. శ్రమ:- ఇది మన పొరపాటులవల్ల వచ్చును. ఇది గొప్ప గాధ, ఊబి, ఖైదు, మనోవేదన, గుండెమంట. ఈ శ్రమ పాపమునుబట్టి, మంచి చేయకపోవుటనుబట్టి, అజాగ్రత్తనుబట్టి, అజ్ఞానమునుబట్టి, అవిశ్వాసమునుబట్టి వచ్చును.
2. పరీక్ష:- అనగా మనలో ఉన్న మంచితనమును బైటికి తీసుకొని వచ్చేటందుకు దేవుడు శ్రమను రానిచ్చును. ఇది పాపమునుబట్టి రాలేదు గాని దేవుడు మన భక్తినిబట్టి, నీతినిబట్టి, మంచి ఆలోచనలు ఆలోచించుటను బట్టి, అనుభవించుటనుబట్టి, సువార్త ప్రకటించుటను బట్టి, పెండ్లికుమార్తె వరుస కోరుకొనుటనుబట్టి, మనకు వచ్చిన శ్రమ మన దుస్థితి వల్ల వచ్చినదా? లేక మంచిస్థితిని బట్టి వచ్చినదా! అని తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ అందింపునుబట్టి తెలిసికొనగలము. గాని (తీర్పు) ఫలానందుకు వచ్చినది. నీకు శ్రమ అనిగాని, మరొకందుకు వచ్చినది అనిగాని తీర్చు తీర్చకూడదు. ఎందుకంటే తీర్పుతీర్పుట మన వంతుకాదు అది ప్రభువు పనియే.
మన సొంత జ్ఞానమునుబట్టికూడ శ్రమ ఏకారణము వల్ల వచ్చినదో గ్రహింపవచ్చునుగాని పరిశుద్ధాత్మ శక్తివల్ల గ్రహించుట ఉత్తమము. ఎవరు దేవునివల్ల పరీక్షించుటకు ఒప్పుకొందురో, ఎవరు తమ చిత్తమును ఒక మూలనుపెట్టి దేవుని చిత్తాను ప్రకారము సమస్తమును దేవునికి (అప్పగింతురో) సమర్పణ చేసికొందురో వారు అబ్రహామువలె పొట్టేలు భాగ్యము పొందురు.
- (1) పొట్టేలు,
- (2) బుగ్గ,
- (3) పాయ,
- (4) రూప,
- (5) ద్వార.
ఈ ఐదు పాఠములలో దేవుడు ఆపత్మాలములో మనకు సహాయకారుడని ప్రత్యక్షతపర్సగలడు.
పరీక్ష అయితే తండ్రి చేతిలో ఉన్నది. శ్రమ అయితే సాతాను చేతిలో ఉన్నది. శ్రమ పెట్టుటకు సాతానుకు సెలవిచ్చును. వెంటనే అది ఆ భక్తునికి దేవుని ప్రేమ నుండి ఎడబాపు కలుగజేయుటకు తండ్రిపై విసుగుదల పుట్టించును. (తనవైపుకు త్రిప్పుకొనుటకే) ఈలాగు రానిచ్చుట అనగా శ్రమ దండము రానిచ్చుట తమ పొరపాట్లు దిద్దుకొనుటకు పిశాచికి సెలవిచ్చును. పరీక్ష మనిషి పొందవలసినంత పూర్తియైన తరువాత చిట్టచివర తండ్రి ఉపకారము వచ్చును. అబ్రహాము తన కుమారుని విషయములో అవి వీలు కనబర్చెను. స్థిరమైన కత్తి ఎత్తుటయే సంపూర్ణము.
బుగ్గ :- హాగరు మంచినీళ్లు సంపాదించుకొనలేనని తెలుసుకొని తాను బ్రతుకుట నిరాశపడెను. అయితే తండ్రి ఆమెకు నీటిబుగ్గ చూపెను. మనిషి తాను అజ్ఞానినని తెలిసికొన్నతరువాత తండ్రి సహాయము చేయును. నేనెంత భక్తుడనైనను నావలన ఏమగును? నేనెంత వైద్యుడనైనను నావలన ఏమగును? నేనెంత విద్య నేర్చినను వినయ సమర్పణ చేసే వారికి తండ్రి సహాయము చేయును. మనకు పూచీ ఒకటి, విశ్వాసము ఒకటి ఉన్నది. ఆపదలో మన విశ్వాసము ఉపయోగించవలెను. అయితే విశ్వాసము చాలకపోతే విశ్వాసము ఎక్కువ చేసికొనవలెను. కేవలము విశ్వాసము మీద ఉంటే చాలును. గాని చాలకపోతే ఆపద ఎక్కువగును. గనుక పూచీమందులు వాడవలెను. భక్తులు ప్రార్ధనచేయకపోతే అటు తరవాత ముందు ఆలాగు చేయుట తప్పుకాదు. మనము చేయవలసిన విధియే.
ఉదా:- లాజరు సమాధి ప్రభువు రాయి తీయుమని మనిషికి అప్పగించెను. యాయీరు కుమారుని బ్రతికించి బలము కొరకు భోజనము పెట్టండి ఇది వీలైన పని.
పాయ:- ఇశ్రాయేలీయులకు వెనుక శత్రుభయము, ముందు సముద్రము ప్రక్కల కొండలు ఆపదలో మునుగు సమయములో సముద్రము పాయలుచేసి తన ప్రజలను దాటిపోజేసెను.
రూప:- శిష్యులు నీటికాకుల వంటివారు. నీటిమీద పని బాగుగా తెలుసును. బెస్తవారు గనుక ఒకనొకప్పుడు వీరు నావలో యుండగా ఎదురుగాలి వచ్చెను. వీరేమియు చేయలేక తమ మనస్సులో చనిపోవుదుమని దృఢపరచుకొనిరి. ఆ సమయములో ప్రభువుకూడ వారితోలేరు. వీరిట్టి నిరాశస్థితిలో యుండగా ప్రభువు సహాయము చేసెను.
ద్వార:- పేతురును రేపు ఉదయము ఉరి అనికోర్టులో తీర్చబడగా అతనిని సంకెళ్ళతో బంధించి తలుపులువేసి కావలిలో బంధించబడెను. ఆదరువులేదు. ఈలాటి సమయములో తండ్రి దూతద్వారా విడిపించెను.
మనుష్యుడు తాను చేయవలసిన అన్ని పనులు చేసినను తాను ఆపద నుండి రక్షితుడు కాలేడని తనంతట తాను మనస్సును దృఢపర్చుకొని నిరాశ ఆ స్థలమునందున్నప్పుడు దేవుడు సహాయము చెసి అతనిని అపాయము నుండి రక్షించును. ఇది దేవుని పద్ధతి. ఈలాగు చేయుట మనిషి తనయొక్కతెలివి తక్కువను తెలిసికొనవలెనని దేవునియొక్క మహిమ ప్రేమ తనంతట తాను తెలుసుకొనవలెనని.
ఉదా:- కానా పెండ్లి విందు సమయములో నీళ్లను ద్రాక్షారసము చేసెను. కుండ అడుగున ఇంకా ద్రాక్షారసము మిగిలియుండుటనుబట్టి నా సమయమింకను రాలేదని చెప్పెను. మనిషి ఏది చేయలేడో అది దేవుడు చేయగలడు. మరియు మనిషి తనకు ఏమిచేసికొనగలడో అది తాను చేసికొనవలెను.
ఈ పై సందేశమును దైనజనులైన యం. దేవదాసు అయ్యగారు 1939 సం॥ము జూలై 9వ తేదీన ఉపదేశించిరి.