अनुवाद
Close
మన కోరికను బట్టి, మనకున్న అత్యవసర పరిస్థితులను బట్టి దేవుడు ఎప్పుడైనా, ఏదో ఒకరీతిని దర్శనమిచ్చి మాట్లాడును. దైవ సహవాసము అవసరమని తెలిసినపుడు అత్యవసర పరిస్థితి వరకు ఎందుకు ఎదురు చూడాలి?
Close
ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తే ఉపకారం పొందుతారు
Close
దైవ చిత్తానుసారమైన జీవితానికి మనం తీసికొనే నిర్ణయం ముఖ్యం
Close
బైబిలు మిషను సేవకుడు నింపబడాలి, సంఘాన్ని నింపాలి
Close
భయం లేని భక్తి పంట లేని భూమితో సమానం
Close
మనిషి చనిపొతే అరిగిపోయిన చెప్పుతో సమానం
Close
సందేహముల చేత విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోతున్నారు
Close
క్రైస్తవుడు వీపు చూపకూడదు, చూపినట్లయితే పిరికి వారి క్రింద లెక్క
Close
బోధ బహు ఇంపు, బ్రతుకు బహు కంపు
Close
దినదినము మనము ప్రార్థనలో చల్లారితే, నిమిష నిమిషానికి మనము సైతానుకు వశమౌతాము
Close
అర్థం లేని బోధ వ్యర్ధం
Close
భర్తకు జాడింపు, భక్తునుకి పొడిగింపు, కూరకు తాళింపు ఉండాలి
Close
నలిగిన ఎద్దు ఎగరదు, వంగదు, పండుకొనదు, ఆగదు
Close
నదిలో మునగాలి, గదిలో ఎదగాలి
Close
ప్రభువు మనకు హక్కులు ఇస్తే పాపము చేసి చిక్కులు తెచ్చుకొన్నాము
Close
శ్రమలో ఆడుకోవాలి, పాడుకోవాలి, వేడుకోవాలి
Close
వేదన వచ్చినప్పుడు జవాబు వస్తుంది
Close
బహుమానం ఆయన ఇవ్వాలి అనుకొన్నప్పుడు ఇస్తారు. ఉ. మొర్ధుకై
Close
అనుభవాలు అంతస్థును పెంచుతాయి
Close
నారుమడికి నీరుకావాలి
Close
మనం చదివేది బైబిలు, అన్యులు చదివేది మనలను
Close
లోకం తెలియ పాపం చేస్తుంది, క్రైస్తవులు తెలిసి పాపం చేస్తున్నారు
Close
పాపం చేస్తూ ఉపవాసం ఉన్నా ఫలితం ఉండదు
Close
పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని జయించినపుడే ఎత్తబడగలము
Close
అగ్నికి ఈగలు ముసరవు
Close
బైబిలు మిషను సేవకులు కూలివాని వలే పనిచేయాలి
Close
అదును, పదును చూసి విత్తనం విత్తాలి
Close
ఏదో ఒక రోజున ప్రభువు ఫలాల కొరకు నీవైపు చూస్తారు
Close
సణుగుడు, గొణుగుడు, మణుగుడు
Close
గురువును వెంబడిస్తే గురువులవుతారు
Close
గురువును వెంబడిస్తే గుణవంతులవుతారు
Close
భక్తులు స్తుతి చేస్తారు, నామకార్ధ భక్తులు ప్రార్థన చేస్తారు
Close
దైవభక్తి వలన కలిమి కలుగదు, శత్రువు వలన ధనము తొలగదు
Close
అన్నికూటాలకు సాతను రాగలడు గాని శిలువకూటానికి రాడు, ఎందుకనగా వాని తల చితుకకొట్టబడింది శిలువ దగ్గరే
Close
భూమి, సూర్యచంద్రులు నశించినా పరవాలేదు, నీవు పోతే నాకు వేదన అన్నారు
Close
సువార్తికుడు సువార్త చేయాలికాని దుర్వార్త చేయకూడదు. మన బలహీనతలు సంఘానికి తెలియనవసరము లేదు
Close
నీ ధనాన్ని నీవు పరలోకానికి తీసికొని వెళ్ళలేవు గాని నీకంటే ముందుగా అక్కడకు పంపవచ్చును
Close
పొదుపులో ధనము పొదుగుతుంది, కానుకలో అది కలిమిగా ప్రత్యక్షమవుతుంది
Close
కూడబెట్టుటయే కలిమి కాదని, కానుక రూపము దాల్చని కనకము కలిసిరాదనియు తెలిసికొవాలి
Close
దేవునికిచ్చుటకై చాపిన చేతిని దేవుడు రిక్తముగా తిరిగి పంపడు
Close
తప్పటడుగు వేసారు తెప్పలాగ తేలారు
Close
బోధ విన్నారు కాని మనసు మార్చుకోలేదు
Close
శ్రమలు పోయిన భోగం వస్తాది, భోగం వెనుక రోగం వస్తాది
Close
రహస్య ప్రార్థన బహిరంగ బలము నిస్తుంది
Close
దేవుడు కట్టుకున్న ఆలయంలో దేవుడుండాలి, మానవుడు కట్టకున్న ఆలయంలో మానవుడు వుండాలి
Close
పాడుచేసేవారికి పాడికట్టే రాకడ
Close
పారిపోయిన పారిపోతాను గాని మారిపోను
Close
చెప్పే వాలు వుంది దాని వినే వీలులేదు
Close
ఎదగడం ఆగిపోతే ఎండిపోవడం ప్రారంభమవుతుంది
Close
గురిలేని బ్రతుకు దరిచేరని నావలాంటిది
Close
భయం లేని భక్తి అక్కరకు రాదు, అక్కరకు వచ్చినా చక్కాగా నడవదు, చక్కగా నడిచినా మేఘమెక్కదు
Close
పట్టించుకోలేదని అనుకోవద్దు సమయము వచ్చినపుడు పట్టించుకొంటారు
Close
విశ్వాసి ప్రార్థనలో ఎదిగితే లోకం రాలి పోతాది
Close
అపవాది ఏదోవక దీపాన్ని ఆపాలని చూస్తాడు
Close
ఆయుధాలు వున్నవారిని చూసి ఆయుధాలు లేనివారు భయపడతారు
Close
శరీర నేత్రాలకు భూలోకం కనబడుతుంది, మనోనేత్రాలకు పరలోకం కనబడుతుంది
Close
పైకి ఎదగాలంటె శ్రమలు అనుభవించాలి
Close
రాకడకు ముందు క్రైస్తవులకు తిక్కపుట్టించే శ్రమలు వస్తాయి
Close
తప్పుచేస్తే శిక్ష తప్పదు, పశ్చత్తాప పడితే క్షమాపణ తప్పదు
Close
సాతాను తలంపులో శోధించి పాపంలో పడేస్తాడు
Close
తనను ఎన్ని అన్నా దేవుడు సహిస్తాడు గాని అభిషేకించు దైవజనుని అంటే ఆయన సహింపలేరు
Close
ఇత్తడికి తుప్పు పట్టదు, యేసులో తప్పులేదు
Close
ఏశావు ఏడ్చాడు గాని పశ్చాత్తాపంతో కాదు, లేదు అని ఏడ్చాడు
Close
పశ్చాత్తాపం పాపిని దేవుని వద్దకు నడిపించే ప్రక్రియ
Close
చెల్లులుగా ఉన్నా పర్వాలేదుగాని చిన్న చెల్లిగా ఉండరాదు
Close
మంచి సలహాను ఎవ్వరూ తీసికోరు అలాగని ఇవ్వడం మానుకోకూడదు
Close
అవకాశానికి ప్రయత్నం తోడైనప్పుడు అదృష్టం కలిసి వస్తుంది
Close
నిజ క్రైస్తవుడు అప్పుచేయడు, అచ్చివుండడు
Close
దేవుని భయము ఏ వ్యక్తికి ఉంటుందో ఆవ్యక్తి జీవితం వర్ధిల్లుతుంది
Close
నిజమైన బలం, సంతోషం ప్రభువు పనిచేయుటలోనే ఉన్నది
Close
వెట్టిపనులు చేసినప్పుడే మన అహం అణిగిపోతుంది
Close
పాపము ఒప్పుకుంటే దొరికేది క్షమాపణ, ఒప్పుకోకపోతే కలిగేది శిక్ష
Close
విశ్వాసము లేనివాడే విగ్రహాలు చేసికుంటాడు
Close
కలహాలకు ముఖ్యకారణము గర్వము
Close
దైవసేవకుని విలువ దేవుని నెరిగిన వారికి మాత్రమే తెలుసు
Close
భక్తి బయటనుండి వచ్చేది కాదు గాని లోపలి నుండి బయటకు రావలసినది
Close
తొందరపాటు వలన అనేక పొరపాట్లు జరుగుతాయి గనుక తొందరపడకు
Close
ఊరక వచ్చేవాటికి ఎప్పుడు కక్కుర్తి పడకు, కష్టపడి సంపాదించుట నేర్చుకోవాలి
Close
శోధింపబడుట పాపము కాదు, శోధనకు లొంగుట పాపము
Close
సాతాను శోధించును - దేవుడు పరిశోధించును
Close
సాతానుది దురిద్ధేశము - దేవునిది సదుద్ధేశము
Close
నీ చెడుతనము నెప్పుడును తర్కించు చుండుము
Close
పగను సాధించుటకు ప్రయత్నించకు
Close
ప్రతి పనికి ఒక కాలము నిర్ణయించుకొనుము
Close
నీవు తలంచునది, చేయునది దేవుని కంటికి మరుగైయుండ నేరదని గ్రహించుము
Close
క్రమము తప్పక పనిచేయుము
Close
ప్రతిదియు క్రమమైన రీతిలోనే ఉపయోగించుము
Close
నీకవసరము లేని వస్తువులను చౌకగా వచ్చినను కొనకుము
Close
సమస్తమును మర్యాదగను, క్రమముగాను జరగనిమ్ము
Close
ప్రతిపనియు దాని కనుకూల కాలమందే చేయుము
Close
ఈ దినమున చేయవలసిన పని రేపటికివరకు మిగిల్చి పెట్టవద్దు
Close
ప్రతి విషయమును దీర్ఘముగా ఆలోచించి చేయుము
Close
ప్రతి వస్తువును దాని స్తలమందే ఉంచుము
Close
నీదిగాని వస్తువును తృణమైనను అంటుకొనకూడదు
Close
విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుటకై నిర్థారణ చేసికొనుము
Close
నిత్యము కృషి చేయువాడవై యుండుము
Close
కొండెగానిని ఎన్నడును నీ చెంతకు చేరనీయకుము
Close
కొండెములు చెప్పువాడవుగా ఉండకుము
Close
సోమరివారి తల సైతాను నివాస గృహము
Close
సొమరి చీమలయొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకొనుము
Close
వంచగాని చెంత చేరకుము
Close
సత్యము చెప్పవలసి వచ్చినప్పుడు ఎన్నడును జడియకుము
Close
ఆడిన మాట తప్పేవాడవై యుండకుము
Close
పరిశుద్ధత అనగా లోపల శుద్ధి యుండుటయే
Close
మంచి అదృష్టవంతునికి పాటుపడుటయే స్వంత జనం
Close
మంచి పుస్తకములే మన మంచి స్నేహితులు
Close
మంచి మాటను ఎవరు చెప్పినను అనుసరింపుము
Close
ఒకని కొరకు ఉపకారులును, కరుణా హృదయులునై యుండుడి
Close
కోపమును రేపు వట్టి మాటలు వచింపకుము
Close
మాట్లాడుట వెండివంటిది, మాట్లాడకుండుట బంగారము వంటిది
Close
అందరితో మాట్లాడు, కొందరినే స్నేహించుము
Close
అందరితో మర్యాదగా ప్రవర్తించుము
Close
ఇవ్వడం నేర్చుకో - తీసికోవడం కాదు
Close
ఇతరులు నీకేమి చేయవలెనని కోరుదువో అదేవారికి చేయుము
Close
ఇతరుల నేరములెన్నడును ఎన్నకుము
Close
పొరుగు మంచి ఎప్పుడును బయలు పరచు చుండుము
Close
తప్పుచేసి లేదని బొంకుట పాపము నేర్చుకొనుటే
Close
నీ స్వంత కష్టముల యందు ఓర్పు కలిగియుండుము
Close
నీకు కలిగిన తొందరలు ఇతరుల మీద పెట్టకుము
Close
నీవల్ల ప్రత్యుత్తరము కోరు వారికి మాత్రమే జవాబిమ్ము
Close
పవిత్ర బ్రతుకును మించిన గొప్ప ప్రసంగమింకొకటి లేదు
Close
వెలగల వస్త్రము కాదుగాని నీతి వస్త్రము ధరించుకొనుము
Close
నమ్మకమైన మనుష్యుడే దేవుని పరిశుద్ధ సృష్టి
Close
నమ్మకమైన పనివాడు తన యజమానికి స్నేహితుడు
Close
ప్రాణ స్నేహితుడైన వాడు ఒకడున్నను చాలు
Close
గర్వము చలి కంటే భరించరానిది
Close
వదరబోతు అవమానమును పొందకపోడు
Close
వచ్చిన వాటి కంటే వచ్చునని అనుకొను కష్టములే గొప్పవి
Close
విచారము, అప్పులు ఆరోగ్యమునకు శత్రువులు
Close
బ్రతుకుటకు తినుము గాని తినుటకు బ్రతకవద్దు
Close
తప్పు చేయని వాడు ఎవరును లేరు, జ్ఞాని చేసిన తప్పు మరల చేయడు
Close
ఆదాయముకంటే అధికముగా ఖర్చుచేయువాడు దరిద్రుడే
Close
ఇతరులకు నీ దుఃఖమును దాచి సంతోషమునే బయలుపరచుము
Close
కత్తి మెడను వంచగలదు గాని హృదయమును వంచలేదు
Close
హృదయమును వంచగలిగినది హృదయమే
Close
నీ సంపాదనలో పదియవ వంతు దేవునిదని మరువకుము
Close
అభ్యుదయము దైవ కాలమని మరువవద్దు
Close
దేవుని యొద్దనుండి గొప్పసంగతులను కనిపెట్టుము
Close
దేవుని కొరకు గొప్ప సంగతులను చేయుటకు ప్రయత్నించుము
Close
జ్ఞానార్జితానుభవము కంటే విశ్వాసార్జితానుభవము గొప్పది
Close
అనుదినము ధ్యానములో ఉన్న జ్ఞానము వచ్చును
Close
దిద్దుకొనినవారే దీర్ఘాయుష్మంతులగుదురు, దిద్దుకొనని వారు దీర్ఘకాల చింతలో నుందురు
Close
మహాత్ములు చెప్పుచున్న మాటలు మౌనముగా ఆలకించుము
Close
నీవు చేసిన పాపము గాక నిన్ను దహనము చేయగలిగిన భయంకరమైన అగ్ని ఇంకొకటి గలదా?
Close
క్రీస్తు ప్రభువును విడిచి పెట్టుట కూడ దారుణమైన నరకము
Close
నీకుకలిగిన జ్ఞానము నీకు మరింత అణకువను గలిగించి నిన్ను జాగ్రత్తగా నడిపింపనిమ్ము
Close
నీవు నవ్వితే లోకమంతా నవ్వుతుంది, నీవు ఏడిస్తే మాత్రం ఒంటరిగానే ఏడ్వాల్సి ఉంటుంది
Close
సణుగుడు, గొణుగుడు అనేవి స్తుతికి విరుద్దమైనవి
Close
చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సంఘటనలకు దారి తీస్తాయి
Close
తప్పుపట్టడం అనేది నమ్మిక అనేదానికి విరుద్దమైనది
Close
ఆటంకాలు అనుభవాన్ని నేర్పుతాయి
Close
వృద్ధాప్యము శాపగ్రస్తమైనది
Close
గాఢమైన లోకజ్ఞానం కంటే నిన్ను నీవు తెలిసికొనియున్న స్వల్ప జ్ఞానం దేవుని దగ్గరకు తీసికొని వళ్ళగలదు
Close
మోకాళ్ళు నలుపెక్కితే ముఖము తెలుపెక్కును
Close
గురువు మాటవింటే గుణవంతులవుతారు, ప్రవక్త మాటవింటే ఫలిస్తారు
Close
దైవ భక్తి కలిమి వల్ల కలుగదు, శ్రమలవల్ల తొలగదు
Close
బేధములు కనబడినను ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని తుంచనాడ కూడదు
Close
సన్నిధిలో నీవున్న యెడల సన్నిధి నీలో ఉండును
Close
దశమ భాగము ఇవ్వడం ప్రారంభిస్తే మీ దశ ఎత్తుకుంటుంది
Close
పని అలవర్చుకో - పెత్తనం కాదు
Close
నీవు గొప్ప స్థితిలోనికి వచ్చినా దేవుని మరువవద్దు
Close
నీవు అధోఃలోకానికి వచ్చినా దేవుని మరువవద్దు
Close
చాడీలు చెప్పేవారి దగ్గర భక్తి ఉండదు, చాడీలు వినేవారి దగ్గర శక్తివుండదు
Close
ఎన్ని స్థితులు వచ్చిన ఆయన మాట వినకపోతే చివరికి చావు స్థితి లభించును
Close
ఏమాత్రము కొంచెము ద్వేషము ఉన్న కొన్ని కొన్ని సం|| జీవితమును పాడు చేయును
Close
స్వల్పమైన అనాలోచన, నిముషమాత్రము ఆగ్రహము అనునవి జీవితములోని కుటుంబ సమాధానము, ఆనందమును తొలగించును
Close
అణచుకొనలేని కోపము వలన ఇతరుల మనస్సులను గాయపరచి మాన్పుటకు వీలులేనంత నష్టము కలిగించును
Close
విశాలహృదయము, నిర్మల మనస్సు, నిదానమైన సంభాషణ,మృదువైన మాటల వలన జీవితములో ఆనందము, సమాధానము కలుగును
Close
నవనాడులు కృంగుతేనే గాని కన్నీరు రాదు
Close
రోగి వైద్యుని కిచ్చు సమయము దేవునికిచ్చిన యెడల మందు లేకుండా జబ్బు మాన్పివేయగలడు
Close
అపవాది ఏదో ఒక దీపమును ఆర్పాలని చూస్తాడు
Close
దీనుడుగా వస్తే దీవించుతాడు, కన్నీటితో వస్తే కరిగిపోతాడు
Close
కుటుంబ ప్రార్థన చేయకపోతే కుమ్మరాలు వస్తాయి
Close
కుటుంబ ప్రార్థన చేయకపోతే కుటుంబము వర్ధిల్లదు
Close
పాపం పెరిగిపోయింది, పరిశుద్ధత తగ్గింది
Close
ఆదివారం ఆరాధనలో పాల్గొనని వారు నిత్యారాధనలో పాల్గొనలేరు
Close
దేవుని కన్ను వెళ్ళే చోటికి మానవుని కన్ను వెళ్ళలేదు
Close
కష్టకాలంలో కుదురుగా కూర్చోవాలి
Close
దైవ సన్నిధిలో కూర్చొనుట దేవునికి పనిపెట్టుట అని గ్రహించాలి
Close
యోహానుకు మరియొక పేరు పక్షినేత్రము గలవాడు
Close
ప్రవక్తను గుర్తించే ప్రవర్తన గలిగియుండవలెను
Close
దైవజనుని ఆజ్ఞాపించకూడదు, అవమానపరచ కూడదు
Close
పెందలకడ ఆలయానికి వస్తే ఆయన ప్రక్కన కూర్చునే అర్హత దొరకును
Close
నా పని భూలోకంలో, నా గురి పరలోకంలో
Close
పువ్వులు లేని తోటలో సవాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందం ఉండదు
Close
పని నేర్చుకోవాలి, ప్రయాణమవ్వాలి, ప్రయాసపడాలి
Close
మోకాళ్ళు నలుపెక్కితే, పరలోకపు చెక్కులు స్వతంత్రించుకోగలము
Close
తప్పుచేస్తే శిక్ష తప్పదు, నిప్పు పట్టుకుంటే కాలక మానదు
Close
ఏ స్థలములో కొట్టబడితే అదే స్థలంలో బోధింపవలెను
Close
రక్షణకు దూరంగా జీవిస్తున్న వారిని రక్షణ లోనికి నడిపించాలి
Close
పాపి చెయ్యి పరిశుద్ధతలో పెట్టి ప్రేమ బలియైనది
Close
దైవసన్నిధిలో ఉండేవారికి దైవ రూపం వస్తుంది
Close
దశమ భాగం ఇచ్చే ధనవంతులు తక్కువమంది ఉన్నారు, దశమ భాగము ఇవ్వని దరిద్రులు ఎందరో ఉన్నారు
Close
సత్తుగిన్నెను సుత్తితో ఎలాగు సరిచేస్తారో అలాగే వాక్యమనే సుత్తి ద్వారా మనలను సరిచేస్తారు
Close
కనిపెట్టు పట్టుగలవారు కలవర పడరు, కంగారు పడరు
Close
నీ జ్ఞానమునకు ఏది అడ్డు వస్తుందో దానికి "స్వస్థి" చెప్పాలి
Close
కనిపెట్టు పట్టు గలవారు భాగ్యవంతులు
Close
వ్యాధి వచ్చినంత మాత్ర్రాన వరములు అంతరించవు
Close
ప్రభువు తన శక్తిని మానవ శక్తికి అందినప్పుడు వాడలేరు
Close
మానవ శక్తి చేయలేని పనిని దైవశక్తి చేస్తుంది
Close
బ్రతుకు వేరుగా, బోధ వేరుగా ఉండకూడదు
Close
తెలిసినవికూడ తెలియనట్టుగా వినాలి
Close
నామకార్థ భక్తి మోక్షమునకు చేర్చదు
Close
శ్రమకు బహుమానం మహిమయే
Close
అపవిత్రతను విడిచి పవిత్రుడవు కావడానికి రమ్మని ప్రభువు పిలుస్తున్నారు
Close
నలుగుపెట్టి రుద్ధకపోతే రూపం రాదు
Close
నలుగు వద్దు అంటే రాకడకు వెళ్ళవు అని అర్థం
Close
శ్రమ జీవితానికి కావలసిన ఓర్పు
Close
సద్భక్తి వల్ల హింస, హింసను బట్టి మహిమ, మహిమను బట్టి అంతస్థు
Close
చింతాకంత చిరాకు ఉంటే పరలోకం వెళ్ళలేరు
Close
రాకడను ధ్యానిస్తే రాకడ జ్యోతి మన హృదయంలో నిత్యం ప్రకాశిస్తుంది
Close
చెప్పిన పని చేసే వారికి చెప్పబుద్ధి పుడుతుంది
Close
చింతను మాని చెంతకు జేరితే చిరంజీవులవుతారు
Close
పియానో మీద "నల్లని" "తెల్లని" మీటలు నొక్కినపుడు ఒక విధమైన శబ్ధము వస్తుంది. గాని రెండింటిని నొక్కితే కమ్మని సంగీతము వస్తుంది. అట్లే భయ, భక్తులు గలవారు దేవునిచే శాస్వత ఆశీర్వాదములు పొందగలరు
Close
ప్రభువు స్నేహితుడుగా ఉండాలంటే నీ పాపం శత్రువు అని ఎరిగి విడిచి పెట్టాలి
Close
నిరాశ పాపములో ప్రవేశించుటకు ద్వారము
Close
నిరాశ చెందుటకు ఏ కారణమున్నను సరే నిరాశ పడకు, చింత చెందకు
Close
ప్రభువును ఎరిగి ఇంకను పాపములోనే ఉన్నయెడల కృపను లోకువ గట్టుటయే
Close
దేనిచేతనైనను, ఎంత ఆపద యున్నను దిగులు పడకు, వెరవకు, భయపడకు, కృంగవద్దు
Close
ప్రభువు బలమును చూచి నడచిన యెడల మన బలహీనత కనిపించదు