ప్రతి దినము ప్రార్ధించుటకు క్లుప్త ముగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. పూర్తి పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

  1. ఓ దేవా, తండ్రీ నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ, అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండ అందించుచున్న తండ్రీ, నన్ను కలుగజేసిన తండ్రీ, నా ప్రియుడవైన తండ్రీ, నా దేవా, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా నీకనేక నంస్కారములు.

    తండ్రీ సృష్టి మూలముగ మాత్రమే కాక, నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీకనేక వందనములు.

    నీ దానముల మూలముగాను, నీ సహింపు మూలముగాను నీ నడిపింపు మూలముగాను, మా కష్టములు నివారణచేయు నీ క్రియల మూలముగాను, నీవు మాకుచేయు ఉపకారముల మూలముగాను, నాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకొని నిన్ను స్తుతించుచున్నాను.

    గాన నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము. నేను ఏ పనియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై యుండును.

    ఆ స్వల్ప స్తుతులను కూడ నీవు హస్తార్పణముగ అందుకొనుచుచున్నావు గనుక నీకు వందనములు.

    నీవు నన్ను నేటి వరకు కాపాడుచు, నడిపించుచు వృద్ధిలోనికి తీసికొని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు ఇక ముందునకు కూడా నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను.

    నా జీవితాంతమందు నిశ్చయముగ నన్ను పరలోకమునకు చేర్చుకొందువని నిరీక్షించుచున్నాను. నీ కనేక వందనములు.

  2. తండ్రీ పాపము వలననే యిబ్బంది, పేదరికము, అప్పుల పాలగుట సంభవించుచున్నది. ఇట్టిది నాకు కలిగిన యెడల విశ్వాస మూలముగానే తొలగించుకొనుటకు పూనుకొన్నాను.

  3. ఈ అవస్థలు కాక ఇయింకను అనేకమైన అవస్థలు కలుగుచున్నవి. అట్టి సమయములో ప్రార్ధనవలననే తొలగించుకొనుటకు పూనుకొన్నాను.

  4. పాపమును బట్టి మరియొక పాపము, అవిశ్వాసము, అధైర్యము, దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్ధము చేసికొనుట. నీ నిశ్శబ్ధమును గ్రహిపలేకపోవుట, సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డకలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించు వ్యాధులకు, విషపుపురుగులకు, మరణమునకు, నరకమునకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసికొనుట పూనుకొన్నాను.

  5. పాపపరిహారము, వ్యాధి నివారణ, యిబ్బంది నివారణ యింకను కావలసినవన్నియు, మోక్షభాగ్యము దయచేయుదువనియు, నీ వాక్యములో వ్రాయించిన వాగ్ధానములన్నియు నమ్ముటకై పూనుకొన్నాను.

    ముఖ్య ముగా యోహాను 12:14 లో నున్న వాగ్ధానము. ఎఫెసీ 3:21 లో నున్న వాగ్ధానము, మార్కు 11:24 లో నున్న సలహాను నమ్ముటకు పూనుకొన్నాను.

  6. పరిశుద్ధాత్మ దేవా, నేను పరిశుద్ధుడనై యున్నట్లు నీవును పరిశుద్ధుడవై యుండుమని సెలవిచ్చిన దేవా నీకనేక స్తొత్రములు. ప్రతి పాపమునుండి నన్ను దూరపర్చుము శోధనలోనికి నన్ను రానీయకుము.

    నాకు తెలిసిన ప్రతి పాపమునుండి తప్పుకొనుటకు పూనుకొన్నాను. నిన్ను మరచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ యెడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగియుండుట, పెద్దల యెడల అమర్యాదగా నడచుట, కొట్టుట, స్త్రీ పురుషుల యెడల దుర్వాంఛ్ఛ కలిగియుండుట, ఒకరిది ఆశించుట, అపహపరించినది తిరిగి యివ్వకుండుట, ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని ఒకరిరిని గురించి యితరులకు చెప్పి అల్లరిచేసి పేరు చెడగొట్టుట. అబద్దములాడుట, కల్పనలు చేయుట, తప్పు పక్షముగా వాదించుట, అసూయపడుట, తగని రీతిగా కోప పడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరులేని వ్రాతలు వ్రాయుట. యితరుల పాపములలో పాలివారగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకొన్నాను.

  7. దేవా నీ చిత్తమే నా చిత్తము. నా చిత్తము నీ చిత్తమునకు వ్యతిరేకముగా నున్నప్పుడు నా చిత్తమును కొట్టివేసికొందునని యేసు నామమున సమర్పించు కొనుచున్నాను తండ్రీ! ఆమెన్.


తనువు నాదిదిగో గైకొనుమీ అను కీర్తనలోని కొన్ని చరణములు పాడిన తర్వాత దైవాత్మ రమ్ము అను పాటలో కొన్ని చరణములు పాడెదరు.

తే||గీ|| తప్పు చేసిన వెంటనే - తప్పుకొనుము
అప్పుడు దేవుని యెదుట - ఒప్పుకొనుము
అన్ని పాపములకు క్షమ - అందుకొనుము
మంచిగానుండి బ్రతుకు సా - గించుకొనుము

తే||గీ|| దేవ రాజ్య విషములు - దీన మతిని
వరుసగా నేర్చుకొనువారు - వాటి వశము
దానముల్ వారి వశమౌను - గాన గలుగు
సుఖము భువిమీద శ్రమలయందు - శుభము శుభము

ఆ||వె|| క్రీస్తు బోధవిన్న | క్రియకు శుద్ధి
క్రీస్తు బోధవిన్న | కిట్టదు చెడుగన్న
క్రీస్తు బోధవిన్న | కీడు తొలంగును
గాన క్రీస్తు బోధ | గానవలయు

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +