56. సమర్పణ

రాగం: యదకుల కాంబోజి తాళం: ఆది



    తనువు నాదిదిగో గై - కొనుమీ యో ప్రభువా నీ - పనికి 1ప్రతిష్టింపు మీ
    = దినములు - క్షణములు - దీసికొని యవి నీదు వినుతిన్ ప్రవహింప జే - యను శక్తి నీయుమీ || తనువు ||

  1. ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పని చేయ జేతులివిగో =
    అనయంబు నీ విషయ - మై సొగసుగా చురుకు - దనముతో బరుగెత్త వినయ పాదము లివిగో || తనువు ||

  2. స్వరమిదిగో కొనుమీ - వర రాజ నిను గూర్చి - నిరతమ్ము పాడ
    నిమ్ము = మరియు పెదవులివిగో - మహానీయమైన నీ - పరిశుద్దవార్తతో - పరిపూర్ణముగ నింపు || తనువు ||

  3. వెండి పసిడి యివిగో - వీసమైనను నాకై - యుండవలెనని కోరను
    నిండైన నీయిష్ట = నియమంబు చొప్పున - మెండుగ వాడ బరి - మితియౌ జ్ఞానంబిదిగో || తనువు ||

  4. నా యిష్టమిదిగో యిది - నీ యిష్టముగ జేయ - నా యిష్టమిక కాదది =
    నా యిచ్చ యున్నట్టి - నా హృదయ మిదిగో నీ - కే యిది యె రాజా - కీయ సింహాసనమౌ || తనువు ||

  5. ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానమున నే - నెన్నడు ధారబోయన్ =
    నన్ను నీ వానిగ - నాధా గైకొను మపుడు - చెన్నుగ నీ వశమై స్థిరముగ నుండెద || తనువు ||


1. అభిషేకించు


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


56. samarpaNa

raagaM: yadakula kaaMbOji taaLaM: aadi



    tanuvu naadidigO gai - konumee yO prabhuvaa nee - paniki pratishTaMpu mee
    = dinamulu - kshaNamulu - deesikoni yavi needu vinutin^ pravahiMpa jae - yanu Sakti neeyumee || tanuvu ||

  1. ghanamaina nee praema - kaaraNaMbuna neekai - pani chaeya jaetulivigO =
    anayaMbu nee vishaya - mai sogasugaa churuku - danamutO barugetta vinaya paadamu livigO || tanuvu ||

  2. svaramidigO konumee - vara raaja ninu goorchi - niratammu paaDa
    nimmu = mariyu pedavulivigO - mahaaneeyamaina nee - pariSuddavaartatO - paripoorNamuga niMpu || tanuvu ||

  3. veMDi pasiDi yivigO - veesamainanu naakai - yuMDavalenani kOranu
    niMDaina neeyishTa = niyamaMbu choppuna - meMDuga vaaDa bari - mitiyau j~naanaMbidigO || tanuvu ||

  4. naa yishTamidigO yidi - nee yishTamuga jaeya - naa yishTamika kaadadi =
    naa yichcha yunnaTTi - naa hRdaya midigO nee - kae yidi ye raajaa - keeya siMhaasanamau || tanuvu ||

  5. unna naa praema nee - sannidhaanamuna nae - nennaDu dhaarabOyan^ =
    nannu nee vaaniga - naadhaa gaikonu mapuDu - chennuga nee vaSamai sthiramuga nuMDeda || tanuvu ||