60. యేసే విశ్వాసికి అధారము
రాగం: మోహన తాళం: మిశ్రాచాపు
- నీవే యని నమ్మిక - యేసు నాకు - నీవే యని నమ్మిక = నీవే
మార్గంబు నీవే సత్యంబు - నీవే జీవంబు - నీవే సర్వంబు || నీవే ||
- పెడదారిని బోవగా - నా మీదికి - యిడుమలెన్నియో రాగ = అడవిలో బడి నేను - అడలుచు నుండగ - తడవకుండ దొరుకు - ధన్యమౌ మార్గంబు || నీవే ||
- తడవని దారిదొరుక - దానింబడి నే - నడచు టెట్లో తెలియక జడియు చుండగ నన్ను - జాగ్రత్తగా కడకు - నడిపించు కొని వెళ్ళు - న య మార్గ దర్శివి || నీవే ||
- కారు మేఘము పట్టగ - నా మనస్సులో - కటిక చీకటి పుట్టగా = ఘోరా పదల జేరి - దారియని భ్రమ పడగ - తేరి చూడగల్గు - తేజోమయ మార్గంబు || నీవే ||
- లేనిపోని మార్గంబు - లెన్నోయుండ - జ్ఞానోపదేశంబు = మానుగ జేయుచు - వానిని ఖండించి - నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు || నీవే ||
- ఎటు జూచిన మార్గములే - మోసము చేయు - హీన శత్రు వర్గములే = ఎటు బోవ వలయునో నే - నెరుగని వాడనై - కట కటయని యేడ్వ - ఘన మోక్ష మార్గంబు || నీవే ||
- జబ్బు మరల ముదరగ - కల దైర్యంబు - జారి గుండె లదరగా - నిబ్బరముగా మనసు నిలువక యున్నపుడు - దబ్బున నను జేర్చు దయగల వైద్యుడవు || నీవే ||
- నరలోకము నుండి - పరలోకంబు - వరకు నిచ్చెనగా నుండి = నరులకు ముందుగా - నడచుచు ముక్తికి - సరిగాకొనిపోవు సు - స్థిరమైన మార్గంబు || నీవే ||
- ధైర్యంబుగా నుండుము - ఓ విశ్వాసీ - ధైర్యంబుగా నుండుము = ధైర్యంబుతో దేవుని - ఆత్మతో స్తుతియించి - వచ్చిన శ్రమలలో ఆనందించుము || నీవే ||
- నీకు తోడై యుంటిని - నీ మనవిని ఆలించి యుంటిని = అన్నిటి నుండి నిన్ ఆదరించిన తండ్రిన్ - ఆనందముతో - స్తోత్రించు చుండుము || నీవే ||
Reading Help
అ a |
ఆ A, aa |
ఇ i |
ఈ I, ee, ii |
ఉ u |
ఊ U, uu, oo |
ఋ R |
ౠ Ru |
ఎ e |
ఏ E, ea |
ఐ ai |
|
ఒ o |
ఓ O, oe |
ఔ ou, au |
అం aM |
అః a@h |
|
క k |
ఖ K, kh |
గ g |
ఘ gh, G |
ఙ ~m |
|
చ c, ch |
ఛ C,Ch |
జ j |
ఝ J |
ఞ ~n |
|
ట T |
ఠ Th |
డ D |
ఢ Dh |
ణ N |
|
త t |
థ th |
ద d |
ధ dh |
న n |
|
ప p |
ఫ P, f, ph |
బ b |
భ B, bh |
మ m |
|
య y |
ర r |
ల l |
వ v, w |
శ S |
ష sh |
స s |
హ h |
ళ L, lh |
క్ష x, ksh |
ఱ ~r |
|
్ ^ |
ం M |
force combination & |
60. yaesae viSvaasiki adhaaramu
raagaM: mOhana taaLaM: miSraachaapu
- neevae yani nammika - yaesu naaku - neevae yani nammika = neevae
maargaMbu neevae satyaMbu - neevae jeevaMbu - neevae sarvaMbu || neevae ||
- peDadaarini bOvagaa - naa meediki - yiDumalenniyO raaga = aDavilO baDi naenu - aDaluchu nuMDaga - taDavakuMDa doruku - dhanyamau maargaMbu || neevae ||
- taDavani daaridoruka - daaniMbaDi nae - naDachu TeTlO teliyaka jaDiyu chuMDaga nannu - jaagrattagaa kaDaku - naDipiMchu koni veLLu - na ya maarga darSivi || neevae ||
- kaaru maeghamu paTTaga - naa manassulO - kaTika cheekaTi puTTagaa = ghOraa padala jaeri - daariyani bhrama paDaga - taeri chooDagalgu - taejOmaya maargaMbu || neevae ||
- laenipOni maargaMbu - lennOyuMDa - j~naanOpadaeSaMbu = maanuga jaeyuchu - vaanini khaMDiMchi - naenae maargaMbanna - nijamaina maargaMbu || neevae ||
- eTu joochina maargamulae - mOsamu chaeyu - heena Satru vargamulae = eTu bOva valayunO nae - nerugani vaaDanai - kaTa kaTayani yaeDva - ghana mOksha maargaMbu || neevae ||
- jabbu marala mudaraga - kala dairyaMbu - jaari guMDe ladaragaa - nibbaramugaa manasu niluvaka yunnapuDu - dabbuna nanu jaerchu dayagala vaidyuDavu || neevae ||
- naralOkamu nuMDi - paralOkaMbu - varaku nichchenagaa nuMDi = narulaku muMdugaa - naDachuchu muktiki - sarigaakonipOvu su - sthiramaina maargaMbu || neevae ||
- dhairyaMbugaa nuMDumu - O viSvaasee - dhairyaMbugaa nuMDumu = dhairyaMbutO daevuni - aatmatO stutiyiMchi - vachchina SramalalO aanaMdiMchumu || neevae ||
- neeku tODai yuMTini - nee manavini aaliMchi yuMTini = anniTi nuMDi nin^ aadariMchina taMDrin^ - aanaMdamutO - stOtriMchu chuMDumu || neevae ||