58. హృదయశుద్ధి కీర్తన

రాగం: పంతువరాళి తాళం: ఆది

(చాయ: అయ్యో! ఇది యెంత దుఃఖము)



    ఏకాంత స్థలము కోరుము - దేవుని ప్రార్ధింప - ఏకాంత స్థలము చేరుము = ఏకాంత స్థలము చేరి - మోకాళ్ళ మీద వుండి లోకాశలను మదికి రాకుండ చూచు కొనుము || ఏకాంత ||

  1. ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రియెదుట = దేహము లోపల కవియె - దిగుచు నిన్ను బాధ పెట్టును || ఏకాంత ||

  2. మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము = ఆట పాటలందు మాట - లాడుటయు నేరంబులగును || ఏకాంత ||

  3. చేయబోయి మాను చెడ్డ - చేతలన్ని ఒప్పుకొనుము = ఈ యత్న పాపంబు లెల్ల - ఎన్నిక లోనికి వచ్చును గాన || ఏకాంత ||

  4. పాప క్రియలు అని దుఃఖముతో - ప్రభుని యెదుట ఒప్పుకొనుము = పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్ చేయవలెను || ఏకాంత ||

  5. ఎవరిని అల్లరి పెట్టినావో - వారి యొద్ద ఒప్పుకొనుము = ఎవరి యొద్ద చెప్పినావో - వారియొద్ద ఒప్పు కొనుము || ఏకాంత ||

  6. తప్పు వినుట సరదా యైన - తప్పే తప్పు ఒప్పు కొనుము = తప్పు తట్టు ఆకర్షించు - తగని ఆట పాట లేల || ఏకాంత ||

  7. కలలో చేసిన తప్పులెల్ల - కర్త యెదుట ఒప్పుకొనుము - తలపులో లేనిది యెట్లు - కల లోనికి వచ్చి యుండును || ఏకాంత ||

  8. నిన్ను మరల సిలువ వేసి - యున్న పాప జీవినయ్యో = నన్ను క్షమియించుమని - యన్న నరులు మారు వారు || ఏకాంత ||

  9. చెడుగు మాని మంచి పనులు - చేయకున్న పాపమగును = పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును || ఏకాంత ||

  10. దుష్టులు వర్ధిల్లుట చూచి - కష్టము పెట్టుకొనరాదు = కష్టము పెట్టుకొన్న నీవు - దుష్టుడవుగా మారినట్టే || ఏకాంత ||

  11. భక్తిపరుల శ్రమలు చూచి - భక్తిహీనులని యనవద్దు = భక్తుల శ్రమలకు ముందు - బహుమానంబు దొరుక గలదు || ఏకాంత ||

  12. బీదల కాహారము బెట్ట - వెనుకదీసి పొమ్మన రాదు = నీ ధనము నీకే కాదు అది - నిను గని దేహి! యను వారికిని || ఏకాంత ||

  13. రోగులను దర్శింప బోవ - రోతయని భావింపవద్దు = బాగుపడు పర్యంతము వరకు - పరిచర్య చేయుట మెప్పు || ఏకాంత ||

  14. ఎట్టి యబద్దాలు పలుకు - నట్టి వారికి నరకమంచు = చిట్ట చివరి పుస్తకంబు - చెప్పునది యోచన చేయుము || ఏకాంత ||

  15. జీవరాసులను బాదుట - జీవహింస నేరమౌను = దేవుడు నిన్నడుగజెప్పు - తెగువ గలుగ గలదా నీకు || ఏకాంత ||

  16. ఒకరి వంక మీద పెట్టి - ఒకరి ననుట పిరికితనము = ముఖము యె దుట అడిగి స్నేహ - మును గలిగించు కొనుట మెరుగు || ఏకాంత ||

  17. గుడిలో కూర్చుని కార్యక్రమము - గుర్తింప కుండుట యశ్రద్ద = చెడగొట్టి వేయు చుండు - పెడచూపు మనో నిదానము || ఏకాంత ||

  18. వాక్యాహారము తినని యెడల - బలమాత్మకు లభించుటెట్లు = వాక్య గ్రంధములోని దేవుని - పలుకు వినక నడచుటెట్లు || ఏకాంత ||

  19. దిన ప్రార్ధనలు చేయని యెడల - దేవుని శ్వాస పొందు టెట్లు = మనసులోని స్వీయ శ్వాస - మలినము పోవుటెట్లు || ఏకాంత ||

  20. పరులకు బోధించు సేవ - జరుప లేక యున్న యెడల = పరమ భక్తి పరులకైన - బహుమానంబు దొరుకుటయెట్లు || ఏకాంత ||

  21. ప్రభువు కొరకు పనిచేసిన - వారికి తాను బాకీ పడడు = సభ నిమిత్తము చేసినది తన - స్వంతము కన్నట్టె యెంచు || ఏకాంత ||

  22. చందా నీది కాదు క్రీస్తు - సంఘాభి వృద్ధికే చెందు = చందా వే యుము ప్రభువు నీకే - చందా వేయును నీకు 1అరోహి || ఏకాంత ||

  23. యేసు నామ మందు మనము - యేది చేసిన సఫలమగును = యేసుక్రీస్తు పేరును చేయు - నేదైన దేవునికి మహిమ || ఏకాంత ||

  24. దేవా! నాకు కనబడు మన్న - దేవదర్శన మగును నీకు = పావనం బగు రూపము చూచి - బహుగా సంతోషించ గలవు || ఏకాంత ||

  25. దేవా! మాటలాడు మన్న - దేవ వాక్కు వినబడు నీకు - నీవు అడిగి న ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు || ఏకాంత ||

  26. తప్పు వివరము చెప్పకుండ - తప్పు మన్నించుమని యన్న = తప్పు తప్పు గానే యుండు - తప్పు దారి వృద్ధి పొందు || ఏకాంత ||

  27. ఏడు తరగతులున్నవి నీది - ఏదో తెలిసి కొనుము యిపుడే = కీడు మాని మంచి చేసిన - క్రింది తరగతి దొరుకునేమో || ఏకాంత ||

  28. నరుల మీద ప్రేమ క్రీస్తు - వరుని మీద ప్రేమయున్న = పరలో కమున వరుడు ఉన్న - పై తరగతిలోనే చేరుదువు || ఏకాంత ||

  29. ఆలోచింపకుండ ప్రశ్న - అడుగ వద్దు నరుడు కాడు = నీ లోని జ్ఞానము వలన - నిరుకు తెలిసిననడుగ నేల || ఏకాంత ||

  30. మోటుమాట - లాడవద్దు - మోటు పనులు చేయ వద్దు = చాటున చేసిన పాపములు - సమయమపుడు బైలుపడును || ఏకాంత ||

  31. ఉత్తర మాలస్యముగా వచ్చిన - ఉత్తరమసలే రాకయున్న - ఉత్తమ విశ్వాసమును ప్రార్ధన - ఉత్తవియై పోవును విచారము || ఏకాంత ||

  32. వ్యర్ధమైన ఊహాలు మాటలు - పనులు నిన్ను వ్యర్ధ పర్చును = తీర్ధము వలెనే పాపము త్రాగిన - తీర్పు శిక్ష సహింప జాలవు || ఏకాంత ||

  33. ఏ పాపమునకైన పరుల - కే శిక్షయును రాకుండెను = నా పాప ములకు శిక్షకలుగు - నా? యన్న అజ్ఞానమగును || ఏకాంత ||

  34. ఉదరమునకు శరీరమునకు - ఉండవలెను శుద్ధి గాని = హృదయ శుద్ధి చేసి ప్రభుని - ఎదుటికి రావలెను సుమ్మీ || ఏకాంత ||

  35. సభకు వేళ రానప్పుడు - ప్రభువే రాత్రి భోజనమిచ్చు = సభకు వేళ వచ్చినప్పుడు - సభతో కలసి పుచ్చు కొనుము || ఏకాంత ||

  36. ఎంత ఎన్ని శ్రమలు రాగా - యేసుని బట్టియైన మేలే = సంతో షించుము అంతము వరకు - సహియించిన ధన్యత కలుగు || ఏకాంత ||

  37. ఇల్లు వాకిలి సామానులు - ఎల్ల శుద్ధిగ నుండవలెను = ఉల్లాసముతో దేవుని సన్నిధి - నూరకె యుండవలెను విసుగక || ఏకాంత ||

  38. కోపము ద్వేషము తప్పుడు భావము - కుట్రాలోచనతో కూర్చుం డుట = శాపారోపణ తిక్క యిట్టి - సకల దుర్గుణములు ముప్పే || ఏకాంత ||

  39. దిద్దుకొనుము నిన్ను నీవె - దిద్దగలవు సభను పిదప = దిద్దు కొనని నీ కంటిలో - పెద్దదూలమందురు కొందరు || ఏకాంత ||

  40. సన్నిధి యందె అన్నియు పరి - ష్కారమగును తెలిసి కొనుము = సన్నిధిలో నీవున్న యెడల - సన్నిధి నీలో వుండును సుమ్మి || ఏకాంత ||

  41. ప్రార్ధన వాలు రానప్పుడు - ప్రార్ధన ఎక్కువ చేయవలెను = ప్రార్ధన యేసునామమందు - అర్ధములతో బైలుదేరును || ఏకాంత ||

  42. ఎక్కువ పనులు వున్న నాడే - ఎక్కువ ప్రార్ధన చేయవలెను = ఎక్కువ పనిలోని సగము - అక్కడపుడే సఫల మగును || ఏకాంత ||

  43. నీవు నా పనిమీద వెళ్ళుము - నేను నీ పనిమీద వెళ్ళుదు = ఈ విచిత్రమైన మాట - యేసుప్రభువు పలుకుచుండు || ఏకాంత ||

  44. జనకునికి తెలియదా? అనుచు - మనవి చేయుట మానరాదు = మనవి విందునన్న తండ్రి - మనవి మానివేయు మనెనా? || ఏకాంత ||

  45. ఎప్పుడు చెడుగు నీలోనికి - ఎరిగి వచ్చునో అప్పుడే = అప్పుడె నరక మార్గమందు - అడుగు బెట్టిన వాడవగుదువు || ఏకాంత ||

  46. ప్రతిదియు నీ మనస్సులోనే - ప్రార్ధనలోనికి పెట్టవలయు = మతికి జవాబిచ్చును తండ్రి - స్తుతులుగ మార్చుము ప్రార్ధన లెల్ల || ఏకాంత ||

  47. చిన్న పాపమైన ఆత్మ - జీవమున్ తగ్గించు చుండు = చిన్న చిల్లి పాత్ర నీటిన్ = చివరకు లేకుండా జేయును || ఏకాంత ||

  48. దేవదూతలు నీ యొద్ద - కావలిగా నుందురు గాని = కావలి లేదను సైతాను - సేవకులు కూడ ఉందురు || ఏకాంత ||

  49. నీకు మోక్షము లేదను మాట - నిత్యము వినబడుచు నుండు = నాకు క్రీస్తుని బట్టి మోక్షము - లేకుండ పోదనుచు నుండుము || ఏకాంత ||

  50. కష్టాల మేఘముల వెనుక - కలడు నీతి సూర్యుడు క్రీస్తు = దృష్టించు చున్నాడు నిన్ను - దిగులు పడకు దిగులు పడకు || ఏకాంత ||

  51. నర లోక పాపాలు చూడు - నరకమునకు నిను దిగలాగు = పర లోకము వైపు చూడు - పైకి నిన్ను ఎత్తుచుండు || ఏకాంత ||

  52. జనక సుతాత్మలకు తగినట్లు - సంస్తుతి చేయలేము మనము = మనకు చేతనైనంత - మట్టునకు చేయుదము లెండి || ఏకాంత ||


1. అరోహి = ఎదుగుదల, సమృద్ధి, ఆరోహణము. పాత పుస్తకములో అరోధి (అనగా భూమియందట విస్తరణ) అని ముద్రించబడినది.


Reading Help

a

A, aa

i

I, ee, ii

u

U, uu, oo

R

Ru

e

E, ea

ai

o

O, oe

ou, au
అం
aM
అః
a@h

k

K, kh

g

gh, G

~m

c, ch

C,Ch

j

J

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

P, f, ph

b

B, bh

m

y

r

l

v, w

S

sh

s

h

L, lh
క్ష
x, ksh

~r

^

M
force combination
&


58. hRdayaSuddhi keertana

raagaM: -- taaLaM: --



    aekaaMta sthalamu kOrumu - daevuni praardhiMpa - aekaaMta sthalamu chaerumu = aekaaMta sthalamu chaeri - mOkaaLLa meeda vuMDi lOkaaSalanu madiki raakuMDa choochu konumu || aekaaMta ||

  1. oohalOni paapamulanu - oppukonumu taMDriyeduTa = daehamu lOpala kaviye - diguchu ninnu baadha peTTunu || aekaaMta ||

  2. maaTalaMdali paapamulanu - manniMchumani vaeDukonumu = aaTa paaTalaMdu maaTa - laaDuTayu naeraMbulagunu || aekaaMta ||

  3. chaeyabOyi maanu cheDDa - chaetalanni oppukonumu = ee yatna paapaMbu lella - ennika lOniki vachchunu gaana || aekaaMta ||

  4. paapa kriyalu ani du@hkhamutO - prabhuni yeduTa oppukonumu = paapamu marala chaeyanaTTi - prayatnaMbul^ chaeyavalenu || aekaaMta ||

  5. evarini allari peTTinaavO - vaari yodda oppukonumu = evari yodda cheppinaavO - vaariyodda oppu konumu || aekaaMta ||

  6. tappu vinuTa saradaa yaina - tappae tappu oppu konumu = tappu taTTu aakarshiMchu - tagani aaTa paaTa laela || aekaaMta ||

  7. kalalO chaesina tappulella - karta yeduTa oppukonumu - talapulO laenidi yeTlu - kala lOniki vachchi yuMDunu || aekaaMta ||

  8. ninnu marala siluva vaesi - yunna paapa jeevinayyO = nannu kshamiyiMchumani - yanna narulu maaru vaaru || aekaaMta ||

  9. cheDugu maani maMchi panulu - chaeyakunna paapamagunu = paDiyu laevakunna goppa - paapamagunu paapamagunu || aekaaMta ||

  10. dushTulu vardhilluTa choochi - kashTamu peTTukonaraadu = kashTamu peTTukonna neevu - dushTuDavugaa maarinaTTae || aekaaMta ||

  11. bhaktiparula Sramalu choochi - bhaktiheenulani yanavaddu = bhaktula Sramalaku muMdu - bahumaanaMbu doruka galadu || aekaaMta ||

  12. beedala kaahaaramu beTTa - venukadeesi pommana raadu = nee dhanamu neekae kaadu adi - ninu gani daehi! yanu vaarikini || aekaaMta ||

  13. rOgulanu darSiMpa bOva - rOtayani bhaaviMpavaddu = baagupaDu paryaMtamu varaku - paricharya chaeyuTa meppu || aekaaMta ||

  14. eTTi yabaddaalu paluku - naTTi vaariki narakamaMchu = chiTTa chivari pustakaMbu - cheppunadi yOchana chaeyumu || aekaaMta ||

  15. jeevaraasulanu baaduTa - jeevahiMsa naeramaunu = daevuDu ninnaDugajeppu - teguva galuga galadaa neeku || aekaaMta ||

  16. okari vaMka meeda peTTi - okari nanuTa pirikitanamu = mukhamu ye duTa aDigi snaeha - munu galigiMchu konuTa merugu || aekaaMta ||

  17. guDilO koorchuni kaaryakramamu - gurtiMpa kuMDuTa yaSradda = cheDagoTTi vaeyu chuMDu - peDachoopu manO nidaanamu || aekaaMta ||

  18. vaakyaahaaramu tinani yeDala - balamaatmaku labhiMchuTeTlu = vaakya graMdhamulOni daevuni - paluku vinaka naDachuTeTlu || aekaaMta ||

  19. dina praardhanalu chaeyani yeDala - daevuni Svaasa poMdu TeTlu = manasulOni sveeya Svaasa - malinamu pOvuTeTlu || aekaaMta ||

  20. parulaku bOdhiMchu saeva - jarupa laeka yunna yeDala = parama bhakti parulakaina - bahumaanaMbu dorukuTayeTlu || aekaaMta ||

  21. prabhuvu koraku panichaesina - vaariki taanu baakee paDaDu = sabha nimittamu chaesinadi tana - svaMtamu kannaTTe yeMchu || aekaaMta ||

  22. chaMdaa needi kaadu kreestu - saMghaabhi vRddhikae cheMdu = chaMdaa vae yumu prabhuvu neekae - chaMdaa vaeyunu neeku 1arOhi || aekaaMta ||

  23. yaesu naama maMdu manamu - yaedi chaesina saphalamagunu = yaesukreestu paerunu chaeyu - naedaina daevuniki mahima || aekaaMta ||

  24. daevaa! naaku kanabaDu manna - daevadarSana magunu neeku = paavanaM bagu roopamu choochi - bahugaa saMtOshiMcha galavu || aekaaMta ||

  25. daevaa! maaTalaaDu manna - daeva vaakku vinabaDu neeku - neevu aDigi na praSnalakella - nijamu teliyanagunu neeku || aekaaMta ||

  26. tappu vivaramu cheppakuMDa - tappu manniMchumani yanna = tappu tappu gaanae yuMDu - tappu daari vRddhi poMdu || aekaaMta ||

  27. aeDu taragatulunnavi needi - aedO telisi konumu yipuDae = keeDu maani maMchi chaesina - kriMdi taragati dorukunaemO || aekaaMta ||

  28. narula meeda praema kreestu - varuni meeda praemayunna = paralO kamuna varuDu unna - pai taragatilOnae chaeruduvu || aekaaMta ||

  29. aalOchiMpakuMDa praSna - aDuga vaddu naruDu kaaDu = nee lOni j~naanamu valana - niruku telisinanaDuga naela || aekaaMta ||

  30. mOTumaaTa - laaDavaddu - mOTu panulu chaeya vaddu = chaaTuna chaesina paapamulu - samayamapuDu bailupaDunu || aekaaMta ||

  31. uttara maalasyamugaa vachchina - uttaramasalae raakayunna - uttama viSvaasamunu praardhana - uttaviyai pOvunu vichaaramu || aekaaMta ||

  32. vyardhamaina oohaalu maaTalu - panulu ninnu vyardha parchunu = teerdhamu valenae paapamu traagina - teerpu Siksha sahiMpa jaalavu || aekaaMta ||

  33. ae paapamunakaina parula - kae Sikshayunu raakuMDenu = naa paapa mulaku Sikshakalugu - naa? yanna aj~naanamagunu || aekaaMta ||

  34. udaramunaku Sareeramunaku - uMDavalenu Suddhi gaani = hRdaya Suddhi chaesi prabhuni - eduTiki raavalenu summee || aekaaMta ||

  35. sabhaku vaeLa raanappuDu - prabhuvae raatri bhOjanamichchu = sabhaku vaeLa vachchinappuDu - sabhatO kalasi puchchu konumu || aekaaMta ||

  36. eMta enni Sramalu raagaa - yaesuni baTTiyaina maelae = saMtO shiMchumu aMtamu varaku - sahiyiMchina dhanyata kalugu || aekaaMta ||

  37. illu vaakili saamaanulu - ella Suddhiga nuMDavalenu = ullaasamutO daevuni sannidhi - noorake yuMDavalenu visugaka || aekaaMta ||

  38. kOpamu dvaeshamu tappuDu bhaavamu - kuTraalOchanatO koorchuM DuTa = SaapaarOpaNa tikka yiTTi - sakala durguNamulu muppae || aekaaMta ||

  39. diddukonumu ninnu neeve - diddagalavu sabhanu pidapa = diddu konani nee kaMTilO - peddadoolamaMduru koMdaru || aekaaMta ||

  40. sannidhi yaMde anniyu pari - shkaaramagunu telisi konumu = sannidhilO neevunna yeDala - sannidhi neelO vuMDunu summi || aekaaMta ||

  41. praardhana vaalu raanappuDu - praardhana ekkuva chaeyavalenu = praardhana yaesunaamamaMdu - ardhamulatO bailudaerunu || aekaaMta ||

  42. ekkuva panulu vunna naaDae - ekkuva praardhana chaeyavalenu = ekkuva panilOni sagamu - akkaDapuDae saphala magunu || aekaaMta ||

  43. neevu naa panimeeda veLLumu - naenu nee panimeeda veLLudu = ee vichitramaina maaTa - yaesuprabhuvu palukuchuMDu || aekaaMta ||

  44. janakuniki teliyadaa? anuchu - manavi chaeyuTa maanaraadu = manavi viMdunanna taMDri - manavi maanivaeyu manenaa? || aekaaMta ||

  45. eppuDu cheDugu neelOniki - erigi vachchunO appuDae = appuDe naraka maargamaMdu - aDugu beTTina vaaDavaguduvu || aekaaMta ||

  46. pratidiyu nee manassulOnae - praardhanalOniki peTTavalayu = matiki javaabichchunu taMDri - stutuluga maarchumu praardhana lella || aekaaMta ||

  47. chinna paapamaina aatma - jeevamun^ taggiMchu chuMDu = chinna chilli paatra neeTin^ = chivaraku laekuMDaa jaeyunu || aekaaMta ||

  48. daevadootalu nee yodda - kaavaligaa nuMduru gaani = kaavali laedanu saitaanu - saevakulu kooDa uMduru || aekaaMta ||

  49. neeku mOkshamu laedanu maaTa - nityamu vinabaDuchu nuMDu = naaku kreestuni baTTi mOkshamu - laekuMDa pOdanuchu nuMDumu || aekaaMta ||

  50. kashTaala maeghamula venuka - kalaDu neeti sooryuDu kreestu = dRshTiMchu chunnaaDu ninnu - digulu paDaku digulu paDaku || aekaaMta ||

  51. nara lOka paapaalu chooDu - narakamunaku ninu digalaagu = para lOkamu vaipu chooDu - paiki ninnu ettuchuMDu || aekaaMta ||

  52. janaka sutaatmalaku taginaTlu - saMstuti chaeyalaemu manamu = manaku chaetanainaMta - maTTunaku chaeyudamu leMDi || aekaaMta ||


1. arOhi = edugudala, samRddhi, aarOhaNamu. paata pustakamulO arOdhi (anagaa bhoomiyaMdaTa vistaraNa) ani mudriMchabaDinadi.