వాక్యపఠనము
మత్తయి 28:19; మార్కు16:16-17; రోమా 6:3, 4:6; 1కొరింథీ 12:13.
కీర్తన "ఘనపర్చుడీ దేవుని" అను కీర్తన పాడవలెను
బోధకుడు
తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున-ఆమెన్.
ప్రియులారా! మనుష్యులందరు పాపజన్మము,పాపజీవితము గలవారు గనుక వాక్యప్రకారము మారుమనస్సు పొంది ప్రభువునొద్దకు నిత్యరక్షణార్ధమై రావలసియున్నది. రక్షణ కావలయునని కోరు విశ్వాసికి రక్షణ అనుగ్రహింపబడినదని తెలియగలందులకును విశ్వాసిని భూలోకసంఘములో బాహాటముగా ప్రభువు చేర్చుకొనుచున్నాడను సంగతి నిశ్చయముగా తెలియగలందులకును బాప్తీస్మ క్రమము మనము గైకొనుచున్నాము.
బాప్తిస్మము కొరకు మీరిక్కడికి వచ్చియున్నారు కాబట్టి బైబిలు మిషను బోధకుడనైన నేనిప్పుడు మిమ్మును అడుగు ప్రశ్నలకు మీరు త్రిత్వ దేవుని యెదుటను ఆయన పరిశుద్ధులందరి యెదుటను ప్రమాణము చేయవలెను.
- ప్రశ్న : నీవు సాతానును, వాని సర్వకార్యములను విడిచిపెట్టుచున్నావా? జవాబు: ఔను, విడిచిపెట్టుచున్నాను.
- ప్రశ్న: బైబిలను గ్రంధమునందు వ్రాయబడిన సంగతులన్నియు నిజమని నీవు నమ్ముచున్నావా? జవాబు : ఔను, నిజమని నమ్ముచున్నాను.
- ప్రశ్న : బైబిలు బోధించునట్టి ధర్మములన్నిటి ప్రకారము నడుచుకొందువా? జవాబు : ఔను, నడుచుకొందును.
- ప్రశ్న : బైబిలు మిషను ఒప్పుకొనునట్టియు నీవు నేర్చుకొన్నట్టియునైన ఒప్పుదలను ఒప్పుకొనుచున్నావా? జవాబు : ఔను, ఒప్పుకొనుచున్నాను.
- ప్రశ్న : రక్షణకు నీళ్ళ బాప్తీస్మమెంత అవసరమో ఆత్మీయ జీవనము యొక్క వృద్ధికి పరిశుద్ధాత్మ బాప్తీస్మమంత అవసరమని నమ్ముచున్నవా? జవాబు : ఔను, నమ్ముచున్నాను.
- ప్రశ్న : విశ్వాసులకు బైబిలు గ్రంధకర్తయైన దేవుడు కాలమును, అవసరమును బట్టి క్రొత్త సంగతులను తెలియపరచునని నమ్ముచున్నావా? జవాబు : ఔను, నమ్ముచున్నాను.
- ప్రశ్న : లోకములో అన్ని మిషనులవారును భేదాభేదములైన సిద్ధాంతములు కలిగిన వారైనప్పటికిని, ప్రభుయేసు యెడల గల భక్తి మార్గమును ఉపదేశించుచున్నారని నమ్ముచున్నావా? జవాబు : ఔను, నమ్ముచున్నాను.
- ప్రశ్న : కష్టస్థితులలోను, నిరాశ సమయములలోను, దేవుని వాగ్ధానములు చదువుకొని, ప్రార్ధించి , స్తుతించి కనిపెట్టుటవల్ల నూతనమైన ఆదరణ పొంద ప్రయత్నించెదవా? జవాబు : ఔను, ప్రయత్నించెదను.
- ప్రశ్న : పెండ్లికుమార్తె ఎత్తబడు రెండవ రాకడ మిక్కిలి సమీపమైయున్నదని నిరభ్యంతరముగా నమ్మి అందు విషయమై సిద్ధపడుదువా? జవాబు : ఔను, సిద్ధపడుదును.
- ప్రశ్న : ఏ విశ్వాసములోనికి బాప్తిస్మము పొందవలెనో ఆ విశ్వాస ప్రమాణము చెప్పుము? జవాబు : (విశ్వాస ప్రమాణము చెప్పవవలెను లేక చెప్పించవలెను)
విశ్వాసప్రమాణము
దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను మానవ రక్షణార్ధమై బైలుపడినాడనియు, పనులను బట్టి వారు ముగ్గురుగా కనబడినను ఒక్కరైయున్నారనియు (త్రియేకత్వము)
ఆయన సమస్త మానవులకు తండ్రియు, దేవుడును, సర్వమునైయున్నాడని నమ్ముచున్నాను.
దేవుడే నరావతారధారియై యేసుక్రీస్తను పేరున భూలోకమునకు వచ్చి మానవులకు అవసరమైన సంగతులు ఉపదేశించి అద్భుతములగు ఉపకారముల మూలముగా మానవుల నాదరించి చివరగా సిలువ వేయబడి,
చనిపోయి, తిరిగి లేచి, పరలోకమునకు వెళ్ళి త్వరగా రానైయున్నాడనియు, తన రాకడలో ఎత్తబడక, మిగిలిన వారికి యేడు సంవత్సరములు శ్రమలు వచ్చుననియు,
ఆ మీదట ఆయనే భూమిమీదికి వచ్చి వెయ్యి సంవత్సరములు నీతి పరిపాలన చేయుననియు ఆ మీదట అంత్యతీర్పనియు నమ్ముచున్నాను.
నీళ్ళతో యిచ్చిన పరిశుద్ధ బాప్తీస్మము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ద్వారమని నమ్ముచున్నాను. భూలోక క్రైస్తవ సంఘములో ప్రవేశింపగోరు వారు యీ బాప్తీస్మము లేనిదే సభ్యులుగా నుండనేరరని నమ్ముచున్నాను.
ప్రభుభోజన సంస్కారము నందు విశ్వాసికి అంతరంగముగ క్రీస్తు యొక్క శరీర రక్తములు అందునని నమ్ముచున్నాను. ప్రభు భోజనము పుచ్చుకొన్న కొందరు రోగులు బాగుపడుదురని నమ్ముచున్నాను.
క్రైస్తవులందరు యేసుప్రభువు యిచ్చు పరిశుద్ధాత్మ బాప్తీస్మము పొంది ఆ ఆత్మయిచ్చు కృపావరములను ఆయన చిత్తానుసారముగా వాడుకొనుటకు పరిశుద్ధాత్మ బాప్తీస్మము పరలోక సభ్యత్వమునకు గుర్తని నమ్ముచున్నాను.
యేసుక్రీస్తుగా వచ్చిన దేవుడుగాక మరెవ్వరు లోక రక్షకులు కారనియు, యే మతస్థులైనను యెక్కడో యొకచోట ఆయననుగూర్చి విందురనియు దేవుని తట్టు తిరుగుటకు కావలసినంత గడువు అందరకు దొరుకుననియు
అంత వరకు యెవరికి మోక్ష నరకముల నిర్ణయము కలుగదనియు నమ్ముచున్నాను. సర్వజన రక్షణార్ధమై యేర్పడిన మతము క్రైస్తవ మతమనియు, గ్రంధమును బట్టి కాక,
అభిప్రాయ బేధములను బట్టి అవి యెన్నో మిషనులుగా చీలిపోయినను ఏకదేవుని, ఏక రక్షకుని, ఏక మోక్షమును, యేక గ్రంధమును సూచించుచున్నవని నమ్ముచున్నాను.
దేవుని చర్యలు మానవ జ్ఞానమునకు గ్రాహ్యము కానప్పుడు తర్కములోనికి వెళ్ళక ఆయనచేయు సమస్తమును, ధర్మయుకమైనదని నిశ్శబ్ధముగా ఊరకుండుటయే క్షేమమని నమ్ముచున్నాను. ఆమెన్.
బాప్తీస్మము
బోధకుడు:బాప్తీస్మము పొందువారిని పేరుతో................................పిలిచి ప్రభువైన యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించుచున్నావా? జ : అవును, అంగీకరించుచున్నాను.
బాప్తీస్మము పొందవచ్చినవారు మోకరించియుండగా గురువు ముమ్మారు నీళ్ళలో ముంచుచు (లేక నీళ్ళుపోయుచు) ఈలాగున చెప్పవలెను.
బో: నీ వాయనను నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించితివని వాగ్దానము చేసియున్నావు. కాబట్టి వాక్య సేవకుడనైన నేను - నిన్ను కలుగజేసిన తండ్రి యొక్కయు, నిన్ను రక్షించిన కుమారుడైన తండ్రియొక్కయు, నిన్ను ప్రొత్సాహపరచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయు మహా పరిశుద్ధ నామమున నీకు బాప్తీస్మమిచ్చుచున్నాను. (బోధకుడు బాప్తీస్మము పొందినవారి నొసటమీద సిలువగుర్తు వేయవలెను)
బాప్తీస్మపు - దీవెనలు
నీకు బాప్తీస్మమువల్ల కలుగవలసిన మేళ్ళన్నియు కలుగునుగాక!- ప్రార్ధనలు
- ఓ ప్రభువా! వీరిని నీవు యేపని మీద పిలిచినావో ఆ పనియావత్తు పూర్తియగువరకు వీరికి తోడ్పడుమని నిన్ను వేడుకొనుచున్నాను.
- తప్పిపోయిన కుమారులను చేర్చుకొను తండ్రీ! ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారలారా! నా యొద్దకు రండని పిలుచుచున్న తండ్రీ! సువార్త వర్తమానము ద్వారా యీ నీ బిడ్డలను తీసికొని వచ్చిన తండ్రీ! యీ నీ పనుల నిమిత్తము యీయనను నీ సన్నిధిలో కాపాడుచు, నడిపించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్. నీకు సమాధానము కలుగును గాక!
కానుక
(అందరు) ప్రభువు నేర్పిన ప్రార్ధన చెప్పవలెను.
ముగింపు ప్రార్ధన, దీవెన.
మరనాత!
- సంబంధిత వాక్యములు:
- మత్తయి 3:11; మార్కు 1:5,8; లూక 3:16; యోహాను 1:31,33;
- లూక 7: 29-30; మత్తయి 28:19; మార్కు 16:15,16; అపో.కార్య 1:5, 8:16, 10:48, 19:5, 22:16, 2:38;
- 1 కొరింథీ 12:13, 10:2; ఎఫెసీ 4:15; యోహాను 3:1-8; రోమా 6:3;
- గలతీ 3:27; కొలస్స 2:12; తీతు 3:5,6; 1 పేతురు 3:21.
వివిధ వర్ణములుగల విశ్వాసులను పుష్ఫాలు
భువిమీద మొల్చునట్టి పుష్ప సంఘంబు ||షారోను||
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +