ప్రతి దినము స్తుతించుటకు క్లుప్త ముగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. పూర్తి పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- దేవా! నీవు అనాది వ్యక్తివై యున్నావు. నిన్ను ఎవ్వరూ కలుగజేయలేదు. నీయంతట నీవే యున్నావు గనుక నీకు వందనములు.
- దేవా! నీవు వెలుగైయున్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చావు; జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు.
- దేవా! నీవు జ్ఞానమైయున్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాసులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియుచున్నవి. మా జ్ఞానమునకు నీవు బైలుపడినావు గనుక నీకు స్తుతులు.
- దేవా! నీవు ప్రేమవైయున్నవు. గనుక జీవరాసులు ఒకదాని నొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుష్యులు కూడ ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. గనుక నీకు స్తుతులు.
- దేవా! నీవు న్యాయమైయున్నావు. గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికిని తప్పుచేసిన వారిని శిక్షించి, క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు.
- దేవా! నీవు పరిశుద్ధడవై యున్నావు. అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికిని, పరిశుద్ధత కూడ ఉన్నది. వర్షజలములో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికిని పరిశుద్ధత కూడ ఉన్నది గనుక నీకు నమస్కారములు.
- దేవా! నీకు శక్తివై యున్నావు. కాబట్టి మానవులకు, జీవరాసులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడువగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తొత్రములు.
- దేవా!నీవు సర్వవ్యాపివై యున్నావు. అందుచేతనే, అన్నిచోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్య మంగళ స్తుతులు.
- దేవా! నీవు నిరాకారుడవై యున్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికిని, దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు.
- దేవా! నీవు స్వతంత్రుడవై యున్నావు, స్వేచ్చపరుడవై యున్నావు. నీకు ఎవ్వరునూ సలహానియ్యనక్కరలేదు. అన్నియు నీ యిష్టప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు.
షరా:దేవా! నీ యొక్క దివ్యలక్షణములు, దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలతో ఒక దూత పాపములో పడి, నీ సద్గుణములు లేకుండా చేసికొన్నది. అలాగే మనుష్యులు పాపములో పడి, నీ గుణములు చాలవరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి యెడల దీర్ఘశాంతము కలిగియున్నావు. గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా! నిన్ను అడిగేవారికి నీ శక్తులు దయచేయుదువు గనుక నమస్కారములు. దేవా! నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి, ఆయనలో నీ గుణములు బయలు పర్చినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా! సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి. గనుక నీకు స్తుతులు. మరియు దేవా! నిన్ను నమ్మినవారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి, మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్యలక్షణములను అనుభవిస్తున్నారు. గనుక నీకు మంగళ స్తోత్రములు.
షారోను మైదానముతో సమమైన మైదానంబు అను కీర్తనలోని కొన్ని చరణములు పాడవలెను.
ఆదిలేనప్పుడు ఏదియు లేనప్డు - దేవు డొంటరిగానె తేజరిల్లె బలము పవిత్రత
వెలుగు, జీవము ప్రేమ - ఆద్యంత రహితము ఆయన కళ దేవ దూతలు లేరు దివిలేదు భువిలేదు -
సూర్యచంద్రులులేరుచుక్కలేదు చెట్లు చేమలు లేవు జీవరాసులు లేవు - ద్రాగోను లేడు ఆదాము లేడు
సర్వమును శూన్యముగ నుండె!
చప్పుడన్న మాటయే లేదు దేవుని! మహిమతప్ప
ఊహలోనికి రాగల ! దొకటియైన
లేదు; దీనినే బుధులు అ ! నాది యంద్రు.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +