క్లుప్త ముగా క్రింద కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి. సాతానునెదిరించు ప్రార్ధనలు పూర్తి పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రారంభ ప్రార్ధన:

ఓ త్రియేక దేవుడవైన తండ్రీ! సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంధములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. దయగల తండ్రీ! సర్వశక్తిగల తండ్రీ! మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయుము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారమిచ్చియున్నానని లూక 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రీ! ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయుమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము.

సర్వలోకమును రక్షించిన రక్షణకర్తయైన యేసుప్రభువు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రియొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకములో యున్న ఓ సాతానా! సాతాను అనుచరులారా! దురాత్మలారా! మేము మిమ్మును ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము.

  1. ఓ యేసుప్రభువా! నీవు అరణ్యములో సైతానుతో, 'సాతానా! పొమ్మని' చెప్పియున్నావు(మత్తయి 4:10). వాడు ఒక్కనిమిషమైన ఉన్నాడా! ఏలాగు ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకొనేటట్లు నీ కృప దయచేయుము నీవు వాడిన ఆమాటలు, మేము వాడినా సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్ధన ఆలకించుమని వేడుకొనుచున్నాము.

  2. ఓదేవా! మేము రక్షింపబడినవారము, సాతాను రక్షింపబడలేదు. రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా? రక్షింపబడనివారికి ఎక్కువ బలమా? గనుక వాడి మాటలు బలము లేనివని, మేము ఎదిరించుటకు మాకు సాహసము దయచేయుము.

  3. ఓ సృష్టికర్తవైన తండ్రీ! టోబియా, సన్బల్లటుల మాటలు మాటలు తుదకు నెరవేరలేదు కదా! ఎజ్రా, నెహెమ్యాల యొక్క మాటలు నెరవేరినవి గదా! నీవు మా దగ్గర ఉన్నావు గనుక సాతాను మాటలు ఎలాగు నెరవేరును? ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు గదా! అలాగే చివర వరకు నెరవేరదు. నెరవేరకుండ చేయువాడవు నీవే. సైతాను మాటలన్నియు బెదిరింపు మాటలే గాని నిజమైన పలుకులు కావని వారును, భూతములును గ్రహించునట్లు చేయుము.

  4. సాతాను నెదిరించు ప్రార్ధనలు :
  5. ఓ సాతానా! మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవుచున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదలుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీక్రియలు చూచి భయపడరు. నీలో బలములేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా! ఆ జయము మా పక్షముగా నున్న జయము గనుక నిన్ను జయించినట్లే.

  6. ఓ సాతానా! 'అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును'(యాకోబు 4:7) అని వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్ధానమే నాకాధారము. అయితే ఇదివరకు నేనాలాగు చేయలేదు. గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరియైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు.

  7. ఓ సైతానా! ప్రభువుయొక్క మహాశక్తిని బట్టి, ఆయనయందు బలవంతులైయుండుడి (ఎఫెసీ 6:10) అని వ్రాయబడియున్నది. గనుక మేము నిన్ను గద్దించినా, చివాట్లు పెట్టినా, నీ ప్రయత్నములు చిన్నాభిన్నములు చేసినా, మా ప్రభువు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది. నీ కోరిక శూన్యమౌతుంది.


జయము జయము యేసు రాజ లేదా పోపోవె ఓ సాతానా అను కీర్తనలోని కొన్ని చరణములు పాడవలెను.

సీ|| సాతాను సర్పమా! సర్వ కార్యములందు
శ్రమలతో కూడిన | చావు నీకు
నరులను బాధించు | నపుడెల్ల వ్రాతలో
పడిన శిక్షలు పయి | బడును నీకు
యూఫ్రటీస్ నది వద్ద | ఉన్న భూతాలకు
కలిగిన దుర్గతి - కలుగు నీకు
విజ్ఞప్తి పత్రిక | వెల్లడించకముందె
కంపము భీతియు | కలుగు నీకు

తే||గీ|| హేడస్సను మాట తలనొప్పి | హింస నీకు
హర్మ గెద్దోను యుద్దము | హడలు నీకు
కడతరుగని గొయ్యియె మొట్టి | కాయ నీకు
అగ్నిగుండ మనంత ని | రాశ నీకు

Click here to Like this page Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +