దేవ త్రియేకుడా
దేవ త్రియేకుడా -ప్రభు దేవ త్రియేకుడా -కావుము దేవాకార్యక్రమమున్ - జయముగ నడుపుము జయస్తోత్రార్హుడా ||దేవ||
-
దేవ వాక్కు నందించి - దేవదాసునకు నీవు
బయలుపరచితివి -బైబిలు మిషనును ||దేవ|| - తండ్రివైన మాదేవా - తనువుతో కాయుము సభన్
తగు స్తుతులొందుము - త్రియేకుండా ||దేవ|| - కుమారుడవైన కర్తా - కాపాడుము ఈ సభన్
కరములెత్తి నిను - కొనియాడెదమిల ||దేవ|| - పరిశుదాత్మ ప్రభో - పెండ్లి కుమార్తెను గాచి
ప్రజల క్షేమము కొరకిది - నడుపుము ||దేవ|| - ఆత్మ రూపిగా నుండి - అందించు వర్తమానం
ఇహపరములలో - ధన్యత నొసగుము ||దేవ||
బైబిలు మిషను నాయకుడు
బైబిలు మిషను నాయకుడు - కలువరి నాధుని ప్రియసుతుడు ఫాధరు దేవదాసు-
బైబిలు మిషను పాఠశాలలో - సన్నిధి కూటపు
సముదాయములో - సరిపడుము మది స్ఠిరపడుము|| బైబిలు || -
ఆది ప్రవక్తలు అనుభవించని అద్భుతము - మహా
అద్భుతము - కనుగొనుము మది త్వరపడుము || బైబిలు || -
ఎఫ్రాయీము మన్యములో - యేసు ప్రభువు తన
శిష్యులతో మాట్లాడిన ఆ మర్మమిదే || బైబిలు || -
ముద్రించుకొను భద్రము చేయు - ముద్రాక్షరశాల
యిదేగా - ముద్రల వివరము తెలుపునుగా || బైబిలు || -
మేఘములోనే వేగము తెలిసి - మేఘనాధుని
రాకడకొరకై - సిద్ధము చేయు సంఘమిదే || బైబిలు || -
ఎన్నో మిషనులు ఉన్నవి - భువిలో సన్నిధి నేర్పిన
సద్గురు వెవరు - సన్నిధి పరుడగు ఈ గురువే || బైబిలు || -
ఆరోహణ బలమిచ్చుట కొరకు - మరుగైన శరీర
రక్తములు - ప్రభువే స్వయముగా అందించున్ || బైబిలు ||
వ్రాయబడెన్ గాలిలో
వ్రాయబడెన్ గాలిలో బైబిలు మిషననునామమును వ్రాసిన ఆత్మకు స్తోత్రములు|| వ్రాయ ||
-
ఆది వ్రాతగల ధర్మశాస్త్రమును - వ్రాసెను మన తండ్రి
యెహోవా - నాటి ప్రవక్త మోషే ద్వారా బైలు పర్చె నిశ్రాయేలీయులకు || వ్రాయ || -
మన తండ్రి యెహోవా నాడు - జన్మించెను క్రీస్తు
బాలునిగ - బహు ప్రేమతో ఆ ధర్మశాస్త్రమును - వ్రాసె నేలపై బయలు పర్చెను || వ్రాయ || -
పరిశుద్ధాత్ముని హస్తమే గాలిలో - వ్రాసెను బైబిలు
మిషనను పేరును - బయలు పర్చెను ప్రవక్తద్వారా
నమ్మిన వారికి ధన్యకరముగ || వ్రాయ || -
స్థాపించెను ప్రభు - బైబిలు మిషనును - స్థాపించెన్
ప్రభు ప్రవక్త ద్వారా - స్థాపన వెంబడి వ్యాప్తి చేయున్
జూపెను గాలిలో దాసయ్యకు || వ్రాయ || -
క్రైస్తవులలో కొందరీ మిషను - కట్టుకొనిరి ప్రభు
వ్రాతను బట్టి - కనికరించిన తండ్రి ప్రేమను - తలచి
స్తుతించుచు బ్రతుకుట కొరకు || వ్రాయ || -
అందెను మన జ్ఞానమునకు ప్రభువు - ఆశ్చర్యకరమైన రీతిగ
ఆనంద దేశం చేర్చెడి మహిమ - మేఘము నెక్కించెడి కృపకొరకె || వ్రాయ || -
బైలుపడిన నీ వాకే సృష్టి - బైలుపడిన నీ వాక్కే బైబిలు
బైలు పడిన నీ వాక్కే సంఘము - బైలుపడెను బైబిలు ప్రవక్తకు || వ్రాయ ||
నీ సన్నిధి నిలుపు
నీ సన్నిధి నిలుపు-నాలో నీ సన్నిధి నిలుపునీ ఆజ్ఞలన్నియు అనుసరించు అత్మను నాకిమ్మయ్యా ||నీ|
-
విశ్వాస నేత్రములు - వీక్షించుచున్నవి నిన్ను
వున్నది వున్నట్లు చూచి - సన్నుతించునట్లు ||నీ|| -
దీనులను హెచ్చించి - అనాధలను దీవించి
దీన హృదయ నాదములు విన వీనులనొగ్గుము దేవా ||నీ|| -
ఆపదలే యేవేళ నన్నావరించుచుండ -నీ సన్నిధి
నా దాగు చోటని - ఆతుర పడుచునుండు ||నీ || -
మానవ జన్మమె చిత్రం - నీ కార్యములే విచిత్రం
నీ జీవమును నా జీవమునకై - దారబోసిన దేవా ||నీ|| -
నీ రొమ్మున ఆనుకొనుటే - నాకున్నవి మరచి చనుట
వెనుకున్న వాటిని లక్ష్యపెట్టక ముందునకు నడిపించు ||నీ|| -
రాకడ ద్వనులే భువిలో - ఎటు చూచిన వినబడుచుండు
నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా ||నీ|| -
లోకములో నేనుంటి - బలహీనపు ఘటమై యుంటి
నన్ను నేనే నమ్మనట్టి - దేహములో నేనుంటి ||నీ|| -
నీ ఆజ్ఞలను పాటించి - బైబిలు మిషనును స్థాపించి
బైబిలు మర్మములన్ని - మాకు విపులముగా బోధించు
యం. దేవదాసు అయ్యను మాకు బహుమతిగా నిచ్చితివి ||నీ|| -
వృద్దాప్యములో తానుండి - మా బాధలలో పాలొంది
మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధి నేర్పిచి - మా తండ్రి
ఆత్మను మాతో నుంచి మము నడిపించుము దేవా ||నీ||
పెండ్లి కుమారుని రాకకు
పెండ్లి కుమారుని రాకకు -పెండ్లి కుమార్తె మేలుకోపెండ్లి పిలుపు నందుకో -పెండ్లి విందులో చేరుకో
పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో ||పెండ్లి||
-
బైబిలు సిద్ధాంతము అభివృద్దికి తెచ్చిన
బైబిలు మిషనుకు - యం. దేవదాసు ముఖ్యులు ||పెండ్లి|| -
సన్నిధి కూటంబులు - ఎన్నికగా స్థాపించెను
అన్ని మిషనుల వారికి - కన్నుగ నెలకొల్పెను ||పెండ్లి| -
అంత్య దినములందున - అంతులేని ఆత్మను
అందించిన తండ్రికి -వందనములర్పించుము ||పెండ్లి|| -
శుద్ది చేయుచు వధువును -సిద్ధపరచు - సన్నిధి
వృద్ధిలో నడిపించును -దిద్దును సరిచేయును ||పెండ్లి|| -
వరుడు తానే స్వయముగా -వరములిచ్చును వధువుకు
కొలతలేని ఆత్మతో - కొరతలన్నియు తీర్చును ||పెండ్లి|| -
సృష్టిని లోపరచును - దుష్టుని జయించును
నష్టమేమియు లేకను - జ్యేష్టులనుగా జేయును ||పెండ్లి|| -
గతవత్సరములలో - అదుపులో మమ్ముంచెను
పిదప జరుగు కాలము-విజయమేమరి విజయము ||పెండ్లి||
రాకడ సంఘమా
రాకడ సంఘమా - మేల్కొనుమాక్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా
రక్షణ కలదని - గ్రంథములు - వ్రాసిరి
పోపులు పూర్వమున పాప పరిహార పత్రికలమ్మి
సంపాదించిరి ద్రవ్యమును || రాకడ ||
-
పత్రము వలననే రక్షణయు - లేదని
లూధరు కనుగొనెను వేషధారణ బైలుపరచి
ఈ - సంఘము నాయన సరిదిద్దెన్|| రాకడ || -
నేటి సమయమున సంఘములు - పేరుకు మాత్రమే
సంఘములు సంఘమునకు తగు తర్ఫీదు నీయను
అవతరించెనొక సజ్జనుడు || రాకడ || -
బైబిలు మిషనను నామమున - రాకడ సంఘము
వెలసెను సంఘనాయకుడు దేవదాసుడు
భువియందు ఆత్మ స్వరూపుడు || రాకడ || -
సన్నిధి కూటము స్థాపించి - దైవ సన్నిధికి
నడిపించి సిద్ధము చేసెను దాసుడు మనలను
రెండవ రాకడ కొరకు సుమా || రాకడ ||
గాలిలో పయనించె
గాలిలో పయనించె - బైబిలు మిషను కన్నెకాగాలిలో పుట్టి రాజమండ్రిలో దాసుని హస్తము చేరి
మారితివా గుంటూరునకు బేతేలు గృహమునకు ఏర్పరిచితివా
కాకానిలో రోగులకై స్వస్థశాల బాగుపడిన రోగులజూచి
నాస్తికులే నిను నమ్మును ||| గాలిలో ||
-
పరమపురి సన్నిధి ఆస్తి దస్తావేజులో యేసు వ్రాసిచ్చెను
'బైబిలు మిషనుకు' దాసుకు కవచంబుగా సాతానుని శ్రమల
విముక్తికి రాకడకెగురుట కొఱకు సాధనమిదియె -
కనబడి మాట్లాడేది తండ్రిన్ కలవన్ ||| గాలిలో || -
ఒరిస్సాలో యేసు ద్వారా దైవజనుడు రాజన్ అడవిమనిషి
అడవికి పొమ్ము అని పలికెనుగా దాసు మాటమూటను
కరము ధరించి తిరిగే రాజు అరణ్యం కొండ కోనలలోన
రాకడ కెకవేసి పిలిచె||| గాలిలో || -
పరుగులు తీసిరి పరవశంతో పిలుపుదరికి జనులు ప్రకటించెను
యేసయ్యను - ఎంతో వింతగ రాజు ప్రచార బాబుగా మారి
తండ్రి మహిమ వెల్లడించె రాజున్ స్థాపించెన్ బాగ్
లౌవుడులో బైబిలు మిషనును సన్నిధిన్ ||| గాలిలో || -
ఈ మిషను సభ్యులెందరు గలరు అదియు నింత లక్షలకొలది
ఋషులేగాక - 'కైలాషఋషి' యును సుందరసింగు
లౌడులో బైబిలు మిషనును సన్నిధిన్
సుదర్శనులు ఆత్మ సంచార భక్తుల్ అంతికేన గాక
ఆది ప్రవక్తలు అపోస్తలలీ మిషనే||| గాలిలో || -
లెక్కకు మించి లోకములోన మిషనులెన్నో వుండగన్
ఏక దేవుడు 'రాకడ' వధువున్ బైబిలు మిషను గదిలో
శిక్షణ జరిపి అక్షయుడేసున్ పై అంతస్తులో కలువన్
మొదటి తరగతి బోగీ యిదియే వేగముగా నెక్కండి ||| గాలిలో || -
అనవరతము నీ సన్నిధి పరుడు అస్కలిత బ్రహ్మచారి
రాగరంజిత రబ్బీ యేసుని రొమ్మున ఆనినవాడు
యోహానువలెనే యేసుని ఎదలో తపముతో ఎదిగినవాడు
మరిపెమునకు ముద్దుబిడ్డగు దేవదాసుని దరికి ||| గాలిలో ||
విజయ గీతం పాడుడి
విజయ గీతం పాడుడి - దేవుని బైబిలు సంఘమునకు77 యేండ్లగల - యౌవన దశలో నున్నది ||| విజయ ||
-
ఆకాశమున మాటలతో - ఈ సంఘంబు వెలసినది
దివినున్న దేవుడు భువికి వార్త పంపెను||| విజయ || -
ఈ సంఘమునకు స్థాపకుడు - దేవునికి ప్రియదాసుండు
ఆ దాసుండే మన దాసుండు - ఫాదర్ దేవదాసండి ||| విజయ || -
గురుతుల కాలము వచ్చినది - రాకడ సమీపించినది
పెండ్లికుమారుడు దివినుండి - భువికి పయనంబాయెను||| విజయ || -
సన్నిధి కూటములలో తానే - స్వయముగ దర్శనమిచ్చెను
పెండ్లికుమార్తె సంఘమా - వేగముగా ఇక మేల్కొనుమా ||| విజయ ||
నీ సన్నిధి కోరునట్టి
నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కల్గియున్న ఆ నరుడే ధన్యుడు ||నీ||-
పాపములను పడగొట్టును - నీ పాద సన్నిధి
శాపములను హరించును - శక్తిగల్గిన సన్నిధి ||నీ|| -
చిక్కులను విడగొట్టును - నీ పాద సన్నిధి
చింతలను దీర్చునది చిత్రమైన సన్నిధి ||నీ|| -
వ్యాధులను పోగొట్టును - నీ పాద సన్నిధి
బాధలను బాపితుదకు - మోదమిచ్చు సన్నిధి ||నీ|| -
రుణములను రద్ధుపరచు - నీపాద సన్నిధి
రణములను మానుపునది - రమ్యమైన సన్నిధి ||నీ|| -
పడకుండా చేయునది -నీపాద సన్నిధి
నిరతము నడిపించునది - దివ్యమైన సన్నిధి ||నీ|| -
మచ్చలను మానుపునది - నీ పాద సన్నిధి
ముడుతలను సరిచేయును - ముచ్చటైన సన్నిధి ||నీ||
ఓహొ పావురమా
ఓహొ పావురమా - పరమ పావురంబు తోడకూడి - ఎగురవే ||ఓహొ||-
పావురమా పరమ - పావురమే క్రీస్తు - పావురమా
వరుని వదలకుండ - వధువువైతివి - ఎగురవే ||ఓహొ|| -
బండసందులలో - కొండ బేటలలో - అండయౌ
జీవ జలము - నందు జలకమాడి లేచి ఎగురవే ||ఓహొ|| -
మధురంబు నీ స్వరము - మనోహరము ముఖము
ముదమారచూడ ముద్దు - మోము చూపి దిగులుపడక ఎగురవే ||ఓహొ|| -
కష్టంబు లొదలినను -కరువులే వచ్చినను
నష్టంబే కలిగినను - నలిగి అలిగి కలతపడక ఎగురవే ||ఓహొ|| -
పరమ పావన స్వరము - నిరతంబు వినిపింపు
మరి ప్రార్ధనా స్తొత్ర మహిమ బోధ - స్వరములతో ఎగురవే ||ఓహొ|| -
ప్రభువైన యేసు త్వరగా - రమ్ము రారమ్మటంచు
ప్రబలంబుగా స్వతంత్ర-ప్రార్ధనా స్వరంబు తోడ ఎగురవే ||ఓహొ|| -
ఇదిగో ప్రభువైన యేసు-ఎగిరి వచ్చు నటంచు
ముదముగ నెల్లవారి ముఖ్యబోధ స్వరముతోడ ఎగురవే ||ఓహొ|| -
ఎగిరి వెళ్ళు పావురమా - ఏది అడ్డంబు నీకు - ఎగిరి ఎగిరి
పరమ యెరూషలేము పురము జేర ఎగురవే ||ఓహొ||
పావురమా పరలోక
పావురమా పరలోక జీవమునిచ్చిన పావురమా|నిత్య జీవము నిచ్చిన పావురమా | పా| |
-
అనాది నుండిన ఓ పావురమా - పునాది వెసితి వీ భువికి వినోద
మైన సృష్టిని చేసి - జనాంగముల కప్పగించితివా | | పా | | -
జీవము నిచ్చిన - పావురమా - త్రోవను జూపిన పావురమా
గావుము నామది - స్తుతిగానంబులు - సేవలో నడుపు ఓ పావురమా | | పా | | -
జ్ఞానము నిచ్చెడి పావురమా - దానమునిచ్చెడి పావురమా
గానము చేసెద ఓ పావురమా - పావనునిగ జేసెడి పావురమా | | పా | | -
వరముల నొసగెడి ఓ పావురమా - స్వరముతో బిలిచెడి పావురమా
నిరతము నీ సన్నిధిలో నుండిన కొరతలు దీర్చెడి పావురమా | | పా | | -
పొదలో మండిన ఓ పావురమా - నదిలో మండిన పావురమా
గదిలో మండిన ఓ పావురమా - హృదిలో మండి మదివెలిగించుము | | పా | | -
బైబిలులో ప్రవక్తల నెల్ల - బలముగ నడిపిన పావురమా
విభజించితివి లోకమునుండి బలపరచిన ఓ పావురమా | | పా | ||
యెహొవాను గానము
యెహొవాను గానము చేసెదము ఏకముగా - మనకురక్షకుడాయెనే - ఆయన మహిమ పాడెదము -
ఆయనను వర్ణించెదము - ఆయనే దేవుడు మనకు || యెహొ||
-
యుద్ధశూరుడేహొవా -నా బలము నా గానము
నా పితరుల దేవుడు -ఆయన పేరు యేహొవా 2 ||యెహొ|| -
ఫరో రథముల సేనలను -తన శ్రేస్ఠాధిపతులను
ఎర్రసముద్రములోన - ముంచివేసె నెహొవా 2 ||యెహొ|| -
నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నీపై లేచువారిని 2||యేహొ|| -
దోపుడు సొమ్ము పంచుకిని - ఆశ తీర్చుకొందును
నాకత్తి దూసెదను - అని శత్రువనుకొనెను 2 || యేహొ|| -
వేల్పులలో నీ సముడెవడు -పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు? 2||యేహొ|| -
ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి 2||యేహొ||