దేవుడు ఎందుకు బైబిలుమిషనును స్థాపించెను?

క్రీస్తుశకములో అవసరాన్నిబట్టి సువార్త ప్రకటింపబడెను గాని బైబిలులోని ఆదినుండి అంతము వరకు, అనాది నుండి అనంతము వరకు ఉన్న వివరములు ఎవరు వరుసగా చెప్పలేదు. అంత్యకాలమందు దేవుడు దేవదాసయ్యగారిని ఏర్పరుచుకొని, అన్నివిషయములు క్షుణ్ణముగా వివరించగా అవి భక్తులు వ్రాసికొనిరి. ఉదాహరణకి దిగువ ఒక చార్టు; ఈ చార్టు వివరము దండకము మరియు మిత్ర అను పుస్తకములో చదవవలెను.


బైబిలుమిషను ముఖ్య భోధలు తెలుసుకొనుటకు అభయాని, విమలాత్మ ప్రోక్షణము, సన్నిధి, ప్రార్థన మంజరి మొదలగు పుస్తకములు చదవవలెను. బైబిలుమిషను ఆనవర్సరీ స్తుతులు ప్రార్ధనలు చేయవలెను.

బైబిలు మిషను వాడుక

వాడుక, ఒక మంచి అలవాటును అభ్యసించుట. దినచర్య: (బైబిలు చదువుచున్నపుడు, సన్నిధిలో కనిపెట్టుచున్నపుడు మాత్రమే కాక ప్రతివిషయములోను) వినుట, విశ్వసించుట, ఆత్మకు విధేయులగుట అనునవి తప్పనిసరి క్రియలు. బైబిలును క్షుణ్ణముగా అర్థం చేసుకొని ఒక నినాదముతో ముందుకు సాగుటకు ఈ క్రింది పట్టికలో తరచుగా వాడే పదముల సారాంశము ఇవ్వబడినది.


నినాదముఅర్థం లక్ష్యము పుస్తకములు వాడుక
మరనాత
(1Cor 16:22)
మన ప్రభువైన యేసు క్రీస్తు వచ్చియున్నారు.
మన ప్రభువైన క్రీస్తు మరల వచ్చుచున్నారు .
ప్రభువైన యేసూ రమ్ము!
ప్రభువు వచ్చుటకు ఇక ఆటంకమేమియు లేనందున ఆయన రాకడకు ప్రతి విశ్వాసి సిద్ధపడియుండవలెను.
మనము ప్రభువుతో సదాకాలము సహవాసము చేయువారము గనుక ఆయన పరిశుద్ధతను ప్రతిభింబించే వారుగా స్తుతిని అలంకరించుకొనవలెను.
రాకడ రవళి.
రాకడ ధ్వని.
రాకడ ప్రార్థనలు, స్తుతులు.
ప్రకటన గ్రంథము, ముఖ్యాంశములు.
ప్రకటన గ్రంథ వివరము.
ద్వితీయాగమనము.
నమస్కారము, సలాము, వీడ్కోలు చేయునపుడు .
ధ్వని, ప్రతిధ్వనులుగా.
ప్రార్థన, పని ముగించినపుడు.
ఆయన మీతో చెప్పునది చేయుడి
(యోహాను 2:5)
ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినది చేయుడి. ఈ వాక్యము బైబిలు మిషనుకు మూల సిద్ధాంతము.
ఎవ్వరెన్ని ఆటంకములు కల్పించినా, బ్రతుకులో శూన్యత ఉన్నా గాని ప్రభువు చిత్తమును కనుగొని, దానినే చేయుట.
అనాదిలో దేవుడు మనకొరకు ఒక ప్రణాలికను సిద్ధము చేసి మహిమను అనుగ్రహించెను.
ఇప్పుడు శరీరము నిచ్చెను. ప్రభువు రాకడలో అదే మహిమతో తిరిగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ అనుక్షణం తన ప్రణాళికను బోధించును.
కావున ఆయన చిత్తము తెలిసికొని ఆచరించుటకు దైవ సన్నిధికి చేరవలెను.
ప్రభువుతో నడచుట, ఆయన చిత్తమును తెలిసికొని తదనుగుణంగా రూపాంతరము చెందుట
బైబిలు మొత్తం,
పాటలు, గద్య, పద్యములు, అన్ని రచనలు
మన మార్గములన్నిటిలో,
పనులన్నిటిలో
సూక్ష్మ ప్రార్థన
(Genesis 26:24)
దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము! దేవా అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము! దైవ సహవాసము
సార్వత్రిక ప్రార్ధన. ఏ భేధము లేకుండా అందరు ప్రార్ధించగల అతి చిన్న, తిన్నగా దేవుని చేరే ప్రార్ధన.
ప్రార్ధనా వళి
సమర్పణ, రాకడ, దైవలక్షణ స్తుతి,
ఉపవాస ప్రార్ధనలు
ప్రతి దినము
సన్నిధి
(Psalm 119:15-16)
మనోనిదానము కలిగి,
మనఃస్పూర్తిగా పాపములను ఒప్పుకొని,
ఇక పాప జీవితములో ఉండను, పరిశుద్ధముగా జీవించుదుననే తీర్మానము కలిగి;
దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని;
చింత యావత్తు ప్రభువు మీద వేసి,
ప్రభువు వశమై, ఆయననే స్తుతించుచు;
ప్రభువును కలిసికొని ఆయన మాటలు వినుట.
నీతి సూర్యుడైన ప్రభువు యొక్క దివ్యలక్షణ రూపమునకు మార్పుచెందుట. పరలోకములోని నిరంతర స్తుతిని అభ్యసించుట. సన్నిధి వన్నె,
సన్నిధి క్రమావళి,
సన్నిధి వర్తమానములు,
దైవసాన్నిధ్యము,
సన్నిది సంపద,
ప్రార్ధన మెట్లు,
ప్రార్ధన మంజరి,
అన్ని ప్రార్థనలు
ఏకాంతముగా తెల్లవారుజాములో,
సన్నిధి కూటములలో ,
సభలలో
దండకము
(Psalm 1:2)
దేవుడు అనాదిలో సంకల్పించిన రక్షణ మహా భాగ్యము, సృష్టి, రక్షణ నెరవేర్పు, ప్రభువు రాకడ, పరలోక నిత్య సహవాసము. దైవ ధ్యానము, రాకడ స్పృహ, ప్రభువునందు పరమగీతానుభవ ప్రేమ.
ఈ లోకంలో సంఘము చేయు ఘన కార్యములు, ప్రభువు యొక్క ప్రత్యేక వాగ్ధానములను ధ్యానించుట.
బైబిలు.
దండకము.
పరమగీతార్థము.
ఆత్మ సంచారము
(2Kings 5:26)
పరిశుద్ధాత్మ క్రియలు, అవధులు లేని స్థలము, కాలము.
(గమనిక: క్రైస్తవ సంఘ మందస్థితిని బట్టి దీని వివరములోనికి వెళ్ళుట లేదు)
ప్రస్తుతం మనలను ఆధరించుచు, మహా శక్తిని దయచేయుచున్న దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన శక్తిని ఎరిగి స్థల, కాల పరిధులు లేక ప్రభువు సత్యమును ప్రత్యక్షపరచుట. పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసము .
విమలాత్మ ప్రోక్షణము .
ఆత్మీయ స్వస్థత.
భక్తుని ఉన్నతానుభవము
రూపాంతరము
(Romans 12:2)
దుర్నీతి, స్వనీతి, దుష్ట లక్షణములను విడిచిపెట్టి; పరిశుద్ధత, జీవము, సత్యము, ప్రేమ,
శాంతి, సమాధానము, విశ్వాసము...మొ|| లగు దైవలక్షణ శక్తితో లోకమును జయించుచు,
దైవ భయభక్తులతో మహిమ నుండి పెండ్లి వధువు మహిమలోనికి ప్రవేశిస్తూ
మహిమ మేఘములోనికి ఎగరగల శక్తిని పొందుట.
రూపాంతరము నిరంతర ప్రక్రియ. దైవ సన్నిధిలో ప్రభువు చిత్తమును కనుగొని, ఉత్తమమైన మార్గములో జీవించుట.
ఈ ప్రక్రియలో విశ్వాసికి ప్రభువు వధువు రూపమునిచ్చును.
ఉపవాస ప్రార్ధన ప్రకరణము.
రక్షణ వాణి .
మనస్సాక్షి.
ఇమ్మానుయేలు.
వాగ్దాన మంజరి
నిరంతర దైవ మహిమానుభవము

బైబిలుమిషను పేరు కింద ఉండే అయ్యగారి సూక్తి:
ఏ మతమునుగాని, ఏ మనుష్యునిగాని, ఏ శాఖనుగాని దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలిసుకొనవలెను.


వధుసంఘరూపము దాల్చి, తెల్లని నీతివస్త్రములతో అలంకరిచుకొనుటకు కావలసిన అన్ని ఏర్పాటులు బైబిలుమిషను రచనలలో ఉన్నవి. అనగా బైబిలో ఉన్న అన్నివిషయముల వివరము మిషనులో ఉన్నవి. దేవుడు ఆ పరిమళమును ప్రతి విశ్వాసికి అందించును గాక! ఆమేన్.