అబ్రహామునకు సంతానము లేనపుడు దేవుడు అబ్రహాము సంతతిని, వారు నివసించు దేశములను, వారి స్థితిగతులను చూచెను. బైబిలు అందుబాటులోనికి వచ్చిన తర్వాత దానిలోని సంగతులను క్షుణ్ణముగా, బహు విపులముగా నేర్చుకొనగల ఆసక్తిని దేవుడు దేవదాసు అయ్యగారిలో చూచెను. దేవుడు అయ్యగారిని గూర్చి ఈ క్రింది సంగతులు సాక్ష్యమిచ్చెను. ఇవి ప్రతి విశ్వాసి జీవితానుభవములో నెరవేరవలెనని ప్రచురించడమైనది ( రక్షణ పద్యముల నుండి వ్యాఖ్యానింపబడినవి).
దేవుని గూర్చిన పరమ ధర్మములన్ని పట్టింపుగా నేర్చుకొనుటను బట్టి,
ప్రభువైన యేసు క్రీస్తు అందించిన పరధర్మములను బట్టి నడుచుకొనుటను బట్టి,
పరులకు శుభకరంబుగ ప్రభుని ధర్మములు బోధింప బూనుకొనుటను బట్టి,
ప్రతిఫలము ప్రకటింపకుండనె పరులకొరకు ప్రార్థించి ప్రభువును చూపించుటను బట్టి,
యోహానువలే పరమును చూచి సాక్ష్యమిచ్చుటనుబట్టి.
దేవుని వేడుకొనుచు, దేవునితో మాటలాడుటను వాడుక కలిగి,
బైబిలు చదివి, దేవవాక్కులాలకింప కొనసాగించుటను బట్టి,
పాపక్షమయను బలమును ధరించి,
ప్రభువును ఆనుకొని విజయమొంది మోక్ష మార్గమున ప్రయాణించుటను బట్టి.
తల్లిదండ్రులను, ఆది సంఘములను సన్మానించుచు, దేవ సంఘమునకు తగిన పుత్రుడవు కావున,
అన్ని సంఘములను బంధు జనాంగముగా పేర్కొని, సంఘ సిద్ధాంతములను చాటి చెప్పుటను బట్టి,
ప్రభువు పనిలో నున్నవారందురు స్థిర స్నేహితులుగా భావించి హితము పల్కుటచేతనే ఐశ్వర్యమబ్బెను.
అన్ని మంచి విషయములయందు ఆశ కలిగి,
అన్ని దుర్గుణములను హేయంబుగానెంచి,
ప్రజల రక్షణ విషయములో పట్టు గలిగి,
దైవ సేవ వ్యాప్తికి దేవుని దాసునివైనందుకు ఐశ్వర్యమబ్బెను.
అన్ని విషయాలు ప్రకటనయైన తర్వాత అన్ని మిషనులు, శాఖలు బైబిలు సత్యములోనికి వచ్చి ఏకమగుదురు. మానవుల పనివంతు సమాప్తమగును. అపుడు ఆత్మ పూర్ణులైన పరిశుద్ధులు స్వప్నమందు గాని, దర్శనమునందుగాని ధర్మ బోధలు జనులకందింతురు. పరలోకమునుండి ప్రవక్తలు దిగివచ్చి ప్రభువును ప్రకటింతురు.
వెలుగు దేవ సృష్టిని చూపు విధముగా బైబిలులోని దేవుని విశదముగా చూపించుచుండును.
గాలి ఈ భూమిమీద అన్ని మూలలకు ఏలాగు జొచ్చునో అదేవిధముగా బైబిలు మిషను అన్ని మూలలకు వ్యాపించును.
వాన దాని ఋతువునందు వచ్చునట్లు ప్రతి వత్సరము నూతన ఫలములిచ్చుటకు క్రైస్తవ సంఘ ఘన కార్యములు సాక్ష్యమిచ్చుచుండును.
ఈ మూడు సుఖదాయకములు భూజనులకు అందించుటకు ఆత్మకుమ్మరింపు అనుక్షణం ఆయత్తపరచుచుండును.
Please see this page for more info.
Also please read అయ్యగారి జ్ఞాపకార్థము here.