ప్రార్థన
ప్రభువులకు ప్రభువైన దేవా! మీకే వందనములు. మా దేశమును, ప్రజలను మీ రక్షణలో ఉంచి కాచి కాపాడుమని వేడుకొనుచున్నాము. స్వత్రంత్రుడవైయున్న దేవా! మీరిచ్చిన స్వత్రంత్రతను మీ నామ మహిమార్థమై వాడుకొను బలమును, శక్తిని దయచేయుము. అన్ని బంధకములనుండి(పాపము, అనారోగ్యము, అప్పులు...) విడుదలను కలుగజేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ. ఆమేన్.
పదజాలము
- స్వేచ్చ: బాహ్య బంధకముల(external binding) నుండి విడుదల. వ్యక్తిగత అవధులు లేని, ఇతరులపై ఆధారపడని స్థితి. స్వేచ్చ మితిమీరితే "స్వనీతి" అను పాపములో పడుదురు.
- స్వాతంత్య్రము: దేశసంపదను పౌరులు వాడుకొనుటకు ప్రభుత్వము ఇచ్చే స్వేచ్చ.
- స్వతంత్రత: అధిపతి తన వనరులను ఇతరులు వాడుకొనుటకు ఇచ్చే స్వేచ్చా పరిధి. ఉదా: పిల్లలు తన ఆస్థిని వాడుకొనుటకు తండ్రి ఇచ్చే స్వేచ్చ.
భారత క్రైస్తవులు స్వతంత్ర దినోత్సవమును జరుపుకొనుటకు అయ్యగారు ఆరాధన క్రమమును ఏర్పరిచిరి. అహింసా స్వాతంత్య్ర సాధన అనేకమంది విశ్వాసుల ప్రార్థన, శ్రమ, త్యాగముల ఫలితము. కావున క్రైస్తవులు దేవుడనుగ్రహించిన స్వతంత్రత, స్వాతంత్య్రము కొరకు దేవుని ఆరధించుట మంచిది.
దేవదాసు అయ్యగారి చిన్నప్పటి రోజులలో అనేకమంది మిషనరీలు దేశప్రజల మెరుగైన జీవితం కొరకు వారి జీవితాలను ధారపోసారు. వృదాగా పోవుచున్న మనదేశములోని వనరులను రక్షించుటకు పెద్దపెద్ద పనులు తలపెట్టిరి. అందులో ఒక ఘనమైన పని ధవళేశ్వరం ఆనకట్టు. బేరేజ్ పనుల పర్యవేక్షణాధికారులైన దొరల దగ్గర పెరిగిన అయ్యగారి ప్రార్థనలు అందరిని బహుగా ఆకర్షించేవి. ఆ దినములలో స్వాతంత్రోద్యమం ఒక బలమైన అంశం. దేశ స్వాతంత్య్రము కొరకు విరివిగా ప్రార్థనలు జరుగుచుండెడివి. స్వాత్రంత్య్రము దైవలక్షణమని, దేవునిలో జీవించుట వలన కలుగు భాగ్యము స్వాత్రంత్య్రమని, స్వతంత్రత/పరతంత్రతలను కాపాడుకొను సూత్రములు అనేక రచనలలో పొందుపరిచిరి.
అనేక క్రైస్తవ మిషనరీలు స్వత్రంత్ర దేశమునకు కావలసిన పరిపాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో కీలక పాత్ర వహించారు. రాబోయే స్వతంత్ర భారతదేశములో అందరికి సమాన హక్కులు, ఆరోగ్యము, విద్య అందాలని అనేక సంస్కరణోద్యమాలు నడిపించారు. దేశంలో అందరూ ఇంకా ఉద్యమ బాటలో ఉండగా అయ్యగారు అప్పటికే విశ్వాసులకు స్వాతంత్య్రమును ప్రకటించి అందరికి ఉచిత విద్య, స్వస్థత/ఆరోగ్యము అందించుచు స్వతంత్ర పౌరుని జీవన విధానమును అభ్యసింపజేసిరి. స్వాతంత్య్రము తర్వాత అనేకమంది విశ్వాసులను మిషనరీలుగా పంపించిరి.
ఉదా: రెవ. వి. సుజీవరాజు అయ్యగారు స్వతంత్ర దేశములో కారడవిగా ఉన్న చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, మద్యప్రదేశ్ అటవీ ప్రాంతములోని ప్రజలందరి జీవనశైలిని ప్రగతిపధములో నడిపించిరి. అప్పటి కలక్టర్స్, ప్రభుత్వాలు సాధు(సుజీవరాజు అయ్యగారు) గారికి మొదట భయపడి జైలులో పెట్టినా గాని తర్వాత వారే సాధుగారి సేవలను కొనియాడిరి. అప్పటి కలక్టర్ ఖోశ్లా గారు ప్రతీ సభలకు వచ్చి, సాధుగారి సంస్కరణలకు ఆశ్చర్యపడేవారు.
సత్యమేవ జయతే! సత్యమైయున్న దేవుని విడిచి దూరముగా పోవుటయే స్వతంత్రతను కోల్పోవుట. విశ్వాసులు దేవునియందు భయభక్తులు కలిగి జీవించుట దేశభక్తిలో ఒక భాగం. నీతిమంతుల నిమిత్తం దేవుడు దేశమును దీవించును. రాజులు ప్రజల/భూసార విషయమై శ్రద్ధ చూపుటకు ప్రార్థింపవలెను.
ప్రసంగి 5:9 ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.
స్వతంత్రత దైవలక్షణము
లోకంలో అనేకమంది స్వేచ్చకోసం అన్వేషిస్తారు కాని స్వేచ్చ ఒక మిధ్య. సృష్టించబడిన ఏ బౌతిక రూపమునకు సంపూర్ణ స్వేచ్చ ఉండదు. దేవుడు తాను సృష్టించిన దేనికిని స్వేచ్చనీయలేదు కాని స్వతంత్రతనిచ్చెను. స్వతంత్రత జీవరాశులకు దేవుడిచ్చిన గొప్పవరము. వెలుగు, గాలి, నీరు... అన్నియు ఇప్పుడు స్వతంత్రముగా వాడుకొనుచున్నాము. అంత్యకాలములో దేవుడిచ్చిన వనరులను వాడుకొనుటకు స్వాతంత్య్రము ఉండదు.
విశ్వాసి దేవుడిచ్చిన స్వతంత్రతను ఎల్లప్పుడు ఆనందించుచు, కృతజ్ఞతా స్తుతితో జీవించు కృప మన ప్రభువైవ యేసుక్రీస్తు అందరికి దయచేయును గాక! ఆమేన్. మరనాత.
స్వాతంత్ర్యమెక్కడ | చచ్చిపోదె
దోచిన చంపిన | దొరలిమీదనెబడు
స్వాతంత్ర్య మెక్కడ | చచ్చిపోదె
కీడుచేసినవెన్క | కీడె తరిమివచ్చు
స్వాతంత్ర్యమెక్కడ | చచ్చిపోదె
మేలు చేయనుమాన | మేలుకలుగకుండ
స్వాతంత్ర్యమెక్కడ | చచ్చిపోదె
తే||గీ|| ఇందువలన వ్యాకులతయు | హీనస్థితియు
సంభవించును తప్పదు | చావుచావు
కీడుమాని మేలొనరింప | క్షేమమగును
ఇదియె స్వాతంత్ర్యజీవము | హితము హితము 159
సీ|| పాపముల్ మాన్పించు | భక్తులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
మతవైరమునుతీర్చు | మాన్యులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
కులమును పోగొట్టు | కోవిదుల్ లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
శత్రుత్వమును నాపు | సాధువుల్లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
తే||గీ|| సృష్టిపూజను మాన్పించి - స్రష్టపూజ
నేర్పు నిపుణులులేచిన - నిండుస్వేచ్చ
కలుగగా దేశమునకు సు - ఖము లభించు
స్రష్టపూజయే భాగ్యాల - సాధనంబు 160
సీ|| తలపులో తప్పున్న - తనువెల్ల చెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె
మాటలో తప్పున్న - మర్యాదచెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె
క్రియలలో తప్పున్న - క్రియకన్ని చెడిపోవు
స్వాతంత్ర్యమెక్కడ - చచ్చిపోదె
మూటిలో ఒకటైన - మూలబడినయెడ
స్వాతంత్ర్యమెక్కడ చచ్చిపోదె
తే||గీ|| మూడునొక్కటై పనిచేయ - ముప్పుపోవు
దైవభక్తి నాగరికత - ధర్మగుణము
విద్యమున్నగువానికి - వెలుగువచ్చు
అపుడు సంపూర్ణ స్వాతంత్ర్య - మబ్బు మనకు 161
సీ|| ఏలికయును ప్రజ - ఏకీభవించిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము
పరదేశజనసహ - వాసముండిన గొప్ప
స్వాతంత్ర్యమేలదా - జయము జయము
కలహంబులకు సందు - కలుగగా నణచిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము
సోదరభావంబు - శోభ్బిల్లుచుండిన
స్వాతంత్ర్యమేలదా - జయము జయము
తే||గీ|| దేశచిత్రాలు దర్శింప - తిరుగనెడల
అనుభవాభిమానంబులు - అధికమగును
సర్వస్థల జనములపరి - చయము కల్గు
సంతసముతుష్టి స్వాతంత్రత - శక్తిపుట్టు 162
అ||వె|| సత్యమైన యేసు - సత్యము స్వాతంత్ర్య
మిచ్చుననుచు చెప్పి - హెచ్చరించె
సత్యమైన యేసు - స్వామినిచేరిన
పూర్ణస్వేచ్ఛ మనము - పొందగలము 197
తే||గీ|| క్రీస్తు తొలగింప నేరని - కీడులేదు
వీలుకాదని అంగల - మేలు లేదు
ఈయ శక్తి లేకున్నట్టి - ఈవి లేదు
కడను చేర్చలేనట్టి మో - క్షంబులేదు. 198
గతకాల ధ్యానములు
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet