అనాదిలోని దైవ రాజ్యము

అపొ.కార్య 1: 3-5; యోహాను 1:1-5; యోహాను 6:63; యోహాను 17:17; యోహాను 14:6; ఆది 1:27,28

ఆరోహణ ధ్యానములు

అనాదికి రూపం ఆది :

ఊహలోనికి రాగలదొకటియైనను లేని స్థితిని అనాది అందురు. ప్రతి మనిషికి, ప్రతి పనికి అనాది స్థితి ఉండును. ఇది విశ్వాసము కలుగుటకు ముందు ఉండే కాలము. అనగా "మనం దీనిని చేయబోవుచున్నాము , లేదా మనకిది సంభవించబోవుచున్నది" అని మనకింకా తెలియబడని కాలము. దేవుడు భూమ్యాకాశములను, దూతలను సృజింపక ముందు, అనాది కాలములో మన కొరకు తన రక్షణ సంకల్పమును తయారు చేసెను. తన రక్షణ మహా సంకల్పమును ఉద్దేశించి ఎంతో కాలమైనప్పటికి, కేవలం రెండువేల సంవత్సరముల క్రిందట దానిని నెరవేర్చడం జరిగింది. ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్ధానమైన తర్వాత ఈ అనాదిలోని రక్షణ కార్యము ప్రారంభ (ఆది) దశకు వచ్చినది. కాని ఆయన శిష్యులకింకా ఈ విషయం గ్రహింపులో లేదు. ప్రభువు స్థితి ముగింపు / సమాప్తము చేసిన స్థితి. శిష్యులకది అనాది స్థితి. ఆరోహణమునకు ముందు 40 రోజులు ప్రభువు వారిని విశ్వాస స్థితికి తీసుకొని వచ్చారు. అనగా వారు రక్షణ గల దైవ రాజ్యమును ప్రారంభించుటకు సంపూర్ణ విశ్వాస పూర్ణులైనారు. మనమిప్పుడు ఆ రాజ్యమును కన్నులారా చూచుచున్నాము. చూడని వారు ఇంకా అనాది స్థితిలో ఉన్నట్టే. అలోచనకు కర్త ప్రభువైన యేసుక్రీస్తే. ఆది లేనిదేదైనను(విశ్వాసము, నిరీక్షణ) వ్యర్ధము.


సారాంశము: మనకు దేవుడు సిద్ధపర్చినవి అనేకమైనవి ఉన్నా గాని అవి కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా ఉండకూడదు. ఆయన సంకల్పమును తెలిసికొనుటకు ఏకాంత స్థలము చేరి, ఆయన సన్నిధిలో కనిపెడితే అవన్నీ బైలుపడగలవు.

వివరము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Share your thoughts and suggestions