Day 10: యేసుక్రీస్తు అందరికి ప్రభువు
వాక్య భాగము : Mat 22:41-46; Mark 12:34-37; Luke 20:39,41,44;21:38;
సత్యము: యేసుక్రీస్తు అందరికి ప్రభువు
కృప: ఆయన మనకు ప్రభువైయుండుట
పాతనిబంధన గ్రంథములోని అన్ని గ్రంధములలో క్రీస్తు ప్రత్యక్షముగానో, పరోక్షముగానో ప్రత్యక్షపరచబడెను. పాతనిబంధన భక్తులందురు ప్రభువును తలంచుచు ఘనకార్యములు చేసిరి. క్రొత్తనిబంధనలో ప్రభువును చూచుచూ అత్యంత ఘనకార్యములు చేసిరి. ఇప్పుడున్న ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో క్రీస్తు భక్తుల క్రియాఫలమును అనుభవించుచున్నారు. అందువలన ఆయన అందరికిని ప్రభువైయున్నారు.
మూలాలకు వెళ్ళి ఆలోచించినయెడల ప్రభువు ఘనత బైలుపడును. మన స్కోప్(ప్రమాణము) చాలా చిన్నదయితే ప్రభువు మహిమను చూడలేము. ఉదా: 1. మావాడే గొప్పవాడు, ఎందుకంటే మావాడు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ టాపర్ అంటారు కాని మూలములకువెళ్ళి ఆ యూనివర్సిటీ ఏవిధముగా స్థాపించబడినదో ఎవరూ పట్టించుకోరు. 2. ఫ్రూట్స్ చాలాబాగున్నాయి అంటారు కాని దానివెనుక ఉన్న తోటమాలి శ్రమ ఎవరూ పట్టించుకోరు. కొంతమంది అసలు ఫ్రూట్ వెనుక చెట్టు ఉందని ఒప్పుకోరు.
అయితే ప్రభువు మనకు ప్రత్యక్షమాయెను కావున ఆయనను ఆనందముతో హత్తుకొందము.
- మత్తయి సువార్త 22 :
- ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి
- క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.
- అందుకాయనఆలా గైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు
- నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు?
- దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా
- ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
Comments
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +