Day 11 : యేసు ప్రభువే పరమ బోధకుడు

వాక్య భాగము : Mat 23:1-39; Mark 12:38-40; Luke 20:45-47;

సత్యము: విశ్వాసికి నేరుగా ప్రభువు బోధించును
కృప: దేవోక్తిని వినగల చెవినిచ్చు పరిశుద్ధాత్మను పరమ బోధకుడు అనుగ్రహించెను

ప్రార్థన: మాతో సహవాసము చేయుటకు పరలోకములో మహిమ సింహాసనమును వదిలి సిలువశ్రమను పొందిన దేవా మీకు స్తుతులు. మీ సహవాసానుభవము దొరుకునట్లు నీవే మాకు స్వయముగా బోధించి మమ్మును శుద్ధీకరించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


పూర్వం రాజులు ప్రజలకు చెప్పవలసిన విషయములు మంత్రికి, మంత్రులు ప్రజలకు తెలియజేసెడివారు. తర్వాత కాలములో దేశ ప్రధానులు రేడియోలోను, టీవీలలోను ప్రసంగించేవారు. ఇప్పుడు అవసరమైతే నేరుగా ఫోన్లో ముఖాముఖి వీడియోలో మాట్లాడుచున్నారు. అయితే ప్రభువైన క్రీస్తు మొదటనుండి మనకు నేరుగా బోధించుచుండెను.

మనము ప్రార్థన చేయునపుడు, బైబిలు చదువుచున్నపుడు మనమూహించని అనేకవిషయములు ప్రభువు అందించును.

క్రొత్తనిభంధనలో విశ్వాసులందరు ప్రభునియెదుట సమానులే. వాక్యము బోధించునపుడు అవసరమైన అంశములు బోధకునికి ప్రభువే అందించును. అయితే ఇక్కడ విశ్వాసికి వాక్యానుసార నడవడిక అను ఒక బాధ్యతను ప్రభువు అప్పగించెను. ఎక్కువ శాతం బోధకులు తమ స్వీయ ప్రసంగములను వారు పాటింపక పోవచ్చు. అందుచేత బోధకులు మనకు ప్రామాణికము కాదు కాని వారు చెప్పే వాక్యము మాత్రం ప్రామణికము.

ప్రభువే మనకు స్వయముగా బోధించునను స్పృహ కలిగి బోధకుల వాఖ్యమును గైకొనుచు, సంఘకాపరి కాపుదలలో కొనసాగుతూ సంఘము యెడల బాధ్యత కలిగి జీవించు కృప ప్రభువు మనకు దయచేయునుగాక.

Pitfall: దేవుడే స్వయముగా బోధించును అని సంఘమునుండి వేరై వాడిపోవుట. విశ్వాసి విత్తనము(దైవవాక్య సత్యమును వినగల చెవి) సంఘములో (భూమి, నీరు, గాలి, వెలుతురు) నాటబడక ఒంటరిగా నుండుట నిష్ప్రయోజనము(మొలకెత్తి ఫలించదు). కాబట్టి విశ్వాసి క్రైస్తవమతములో సంఘాచారములో ప్రభువువద్ద నీరుగా నేర్చుకొను అభ్యాసము సంఘమాదిరి కావలయును.

సిలువ ధ్యానములోని ఈ చిన్నచిన్న భావములు ఉదహరించుచుండగా ప్రభువే చదవరులకు కావలసిన ఉపదేశమును స్వయముగా అందించును గాక! ఆమేన్.

    మత్తయి సువార్త 23 :
  1. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యుల తోను ఇట్లనెను
  2. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
  3. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.
  4. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.

క్రైస్తవమత పద్దతులనుబట్టి సేవకులుగా అభిషేకము పొందిన వారు సంఘములో వాక్యము వివరించుటకు పాటుపడుదురు. సమయము, సందర్భములను పాటిస్తూ, అందరికోసం అందించే సందేశం అప్పుడప్పుడు లోతైన విశ్వాసికి పొడిపొడిగా ఉండవచ్చు. కాని అదే సమయంలో ప్రసంగము వినుచున్న విశ్వాసికి ప్రభువు అనేక మర్మముల వివరమును అందించును. అనేక వాక్యములను గుర్తుచేయును. కొంతమందికి భవిష్యత్తు రూపుదాల్చుకొనును. లోకమునకు పైగా దేవుడు సంఘమును ఉంచెను. కావున విశ్వాసి సంఘమును హత్తుకొని జీవింపవలెను.

దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి ఆధరించునుగాక! ఆమేన్.

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల