Day 12 : కానుకకు విలువ కట్టేది ప్రభువే
వాక్య భాగము : Mark 12:41-44; Luke 21:4;
సత్యము: ప్రతి అర్పణను ప్రభువు వెలకట్టును
కృప: లేమిలోనుండి సమర్పించిన చిన్నకానుకకు సహితము ప్రభువు బహుగా వెలకట్టుట
ప్రార్థన: మా అల్పమైన సమర్పణను అంగీకరించుచున్న దేవా! మీకే వందనములు. మేము కలిమిలోఉన్నను, లేమిలో ఉన్నను మీయందు సమర్పణ కలిగి జీవించు కృపను దయచేయుమని యేసునామమును బట్టి వేడుకొనుచున్నము తండ్రీ! ఆమేన్.
కానుకలు ఇచ్చువారు రెండు రకములు. 1. సమృద్ధిలో ఉన్నవారు, 2. లేమిలో ఉన్నవారు. ఇక్కడ ప్రభువు ధృవీకరించిన విషయము లేమిలోనుండి ఇచ్చువారి సమర్పణ చాలా గొప్పది. ఈ ప్రపంచములో ధనమునకు ఉన్నవిలువ వేరు, అది దేవునికి సమర్పించినపుడు ఆయనిచ్చు విలువ వేరు. ఉదా: రెండు చేపలు, ఐదు రొట్టెలు ఒకమనిషికి సరిపోయే కొలత మాత్రమే; ఐతే ప్రభువు వాటికి ఇచ్చిన విలువ 5-6 వేల మందికి సరిపడునంత వెలకట్టెను. ఇచ్చిన ఆ బాలునికి పరలోకములో ఆ మహిమ ఉండును.
దేవునికి ఇచ్చుట(కానుక) అనునది చాలా ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు; అతి ప్రమాదకరమైనది కూడ. పాతనిబంధనలోను(హేబెలు), క్రొత్తనిబంధనలోను(అననీయ) మొట్టమొదటి మరణము అర్పణకు సంబంధినదే. మన అర్పణ సమర్పణతో లేనిదైతే అది ప్రమాదకరము.
కాబట్టి దేవునియొద్ద మన హృదయములను సమర్పించి ఆయనకు లోబడి నడచుకొనుచు అర్పించు అర్పణ గొప్పది. ప్రభువు కానుకకు అధిపతి అని గుర్తించి ఆయనను చూచుచు ఇచ్చు కానుక దీవెనను, ఆశీర్వాదము, ఐశ్వర్యమును కలుగజేయును.
ప్రభువు యందు భయభక్తులు కలిగి జీవించుకృప మనకు కలుగును గాక!
- మార్కు సువార్త 12 :
- ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూ హము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేష ముగా సొమ్ము వేయుచుండిరి.
- ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా
- ఆయన తన శిష్యులను పిలిచికానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.
- వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.
Comments
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +