Day 13 : ప్రభువే దేవాలయము

వాక్య భాగము : Mat 24:1-25,46; Mark 13:1-37; Luke 21:6-36;

Lent 13

సత్యము: పరలోకములో దేవాలయమైయున్న ప్రభువు
కృప: పరలోక దేవాలయము భూమిమీదికి దిగివచ్చుట

ప్రార్థన: పరలోకముందున్న దేవా! ఈ భూలోకమునకు వేంచేసి సిలువలో రక్తము కార్చి మమ్మును దేవాలయమునకు తోడుకొనిపోయిన ప్రభువా! మీకు వందనములు. మీ మందిరములో నిరంతరము నేర్చుకొని, జీవించు భాగ్యము దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


ప్రభువు శిష్యులు చాలా షార్ప్. ఈ మందిర కట్టడములు శాస్వతము కాదని ప్రభువుచెప్పగా శిష్యులు అంత్యకాల సమయమునకు వెళ్ళిపోయిరి. అదేవిధముగా ఈ రోజుధ్యానములో మనం పరలోక దేవాలయుములోనికి వెళ్ళుచున్నాము. మనము నివసించుచున్న ఈ భూప్రపంచములో సంఘము కూడుకొని దేవుని ఆరాధించుటకు మందిరము(బిల్డింగ్) అవసరమే. సంఘమునకు శిరస్సైయున్న ప్రభువు, విశ్వాసులు, యాజకులు, ఉపకరణములు, మందిరకట్టడము... ఇవన్నీ కలిసి భూమిమీద దేవలయమగుచున్నది. ఈ మందిరములో ప్రభువుతో సంపూర్ణ సహవాసము చేయువారికి పరలోకములోని దేవుని మహిమ దేవాలయము కనబడును.

ప్రభువే దేవాలయమను స్పృహతో జీవించువారు మాత్రమే పరలోకములో మహిమ మందిరములోనికి(ప్రభువు మహిమలో) ప్రవేశించగలరు. పరదైసు మహిమవేరు, మందిరమహిమ వేరు. దేని అంతస్థు దానిదే. ప్రభువుయందు ధ్యానముకలిగి మందిరములో భయభక్తులతో దేవుని సేవించినయెడల దేవాలయమైయున్న ప్రభువును చేరగలము.

దేవుని రాకడవరకు దైవ మందిరములో సహవాసముకలిగి పరలోకదేవాలయములో చేరుదముగాక! మరనాత.

ప్రకటన 21:22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.


    Supporting verses - మత్తయి సువార్త 24 :
  1. యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా; ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.
  2. అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
  3. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
  4. యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
  5. అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.
  6. మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
  7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
  8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.
  9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.
  10. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.
  11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
  12. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.
  13. అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల