Day 14 : ప్రభువును హింసించుటకు ఏకమైన పెద్దలు, ప్రధాన యాజకులు

వాక్య భాగము : Mat 26:2-5; Mark 14:1,2; Luke 22:1,2;

సత్యము: యేసుప్రభువే తన సిలువశ్రమకు(మననిమిత్తము) సూత్రధారి
కృప: మనకు వ్యతిరేకముగా ఎందరు ఏకమైనను ప్రభువు సంకల్పములో ఉంటే చివరికి విజయము

ముందు పాఠములో ప్రభువు దేవాలయమైయున్నరని ధ్యానించాము. ఆ దేవాలయమును కూల్చుటకు పెద్దలు, యాజకులు కూడిరి. ఆదికాండము 11వ అద్యాయములో జనులందరు బాబెలు గోపురమును కట్టుటకు ఏకమవగా, అది దేవునికి వ్యతిరేకము కాబట్టి వారిని తరిమివేసెను. బాబెలు నిర్మించుటకు యేకమైన జనాంగము ఇప్పుడు ప్రభువును కూల్చుటకు ఏకమైరి. అయితే సిలువ మరణము ప్రభువు చిత్తము కావున ప్రభువు వారిని అడ్డుకొనలేదు. మంచిని నిర్మించుట కంటే పడగొట్టుట సుళువు(ఈజీ) .

మహిమ పొందుటకు మనమును మన సిలువ ఎత్తుకొని జీవించుచుండగా ఒక కాలములో మన విశ్వాసమును కూల్చుటకు అందరు ఏకమయినా గాని ప్రభువు మనకు విజయమునిచ్చును. ఎంతమంది ఏకమై సత్యమును చంపజూచినను, సత్యము మొలకెత్తి విస్తరించును అని క్రీస్తు సువార్త ఘనకార్యములను బట్టి మనకు తెలియుచున్నది. శ్రమయందు కృంగక, ప్రభువు ఆనుకొని నడచు కృపను దేవుడు మనకు దయచేయును గాక! ఆమేన్.

    మత్తయి సువార్త 26 :
  1. రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్ప గింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.
  2. ఆ సమయ మున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
  3. యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.
  4. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల