Day 15 : సువార్త సువాసన
వాక్య భాగము : Mat 26:6-13; Mark 14:3-9; John 12:1-8
సత్యము: సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడును
కృప: దేవుని సువార్తను అస్వాదించు మనస్సాక్షిని, ఆత్మను ప్రభువు మనకు దయచేసెను
ప్రార్థన: మహిమగల ప్రభువా! మా కోసం భూస్థాపన పొంది, తిరిగిలేచి సువార్తను మావరకు అందించిన దేవా! మీకు వందనములు.
ప్రభువు శిలువకార్యము శాస్వతకాల నిబంధన. ప్రభుని శిష్యులు ప్రారంభించిన సువార్త ఒక దీర్ఘకాల ప్రణాలిక. మరియ అత్తరుబుడ్డిలోని మొత్తం అత్తరుతో ప్రభువును అభిషేకించుట అనేది ఒక చిన్ని సంఘటన. అయితే ప్రభువున్న సిలువ సమయ స్థితినిబట్టి ఆ అభిషేకమును సువార్తకు జతకలపడం ద్వారా సర్వకాల, సర్వలోక, సర్వ సువార్త వేళల యందు కొనియాడబడు శాస్వతకాల సువాసనగా ఆ చిన్న పని దీవించబడెను.
ఒక వ్యక్తి/సంఘము/దైవరాజ్యము/పెండ్లికుమార్తె శ్రమగుండా పోవు సమయములో సాటి విశ్వాసి అందించు ఆధరణ బహుగా దీవించబడునని ఈ ఘటన ద్వారా తెలియుచున్నది.
ఈ ఘటన ద్వారా మనము అందుకొని అస్వాదించు పరిమళమేదనగా, దైవ సువాసన మనచుట్టూ బహుగా ఆవరించి యున్నది గనుక లోకనైజముతో ఎవరెన్ని మూసపద్ధతులను ప్రతిపాదించినా, ప్రభువును ఆనుకొని సువార్త సువాసనలో ఆనందించు ఆత్మను దేవుడు మనకు దయచేసెను. దేవుడు తన పరిమళముతో మనలను నడిపించును గాక! ఆమేన్.
Note: కాబట్టి ప్రోక్షింపబడుచున్న సువార్త పరిమళమును హత్తుకొనకపోతే (యూదా ఇస్కరియోతు) జీవితములో నిరాశం, నిస్పృహ, నిస్తేజము, నీరసము ఆవరించి నిర్జీవమైపోవును. దైవసేవయందు శ్రమలో ఉన్నవారికి ఇచ్చు చిన్ని ఆధరణ అధికమై ఆకాశ సింహాసనము వరకు కొనిపోవును.
- మత్తయి సువార్త 26 :
- యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు,
- ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.
- శిష్యులు చూచి కోపపడిఈ నష్టమెందుకు?
- దీనిని గొప్ప వెలకు అమ్మి బీదల కియ్యవచ్చునే అనిరి.
- యేసు ఆ సంగతి తెలిసి కొనిఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?
- బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.
- ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.
- సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నని వారితో అనెను.
Comments
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +