Day 16 : ధన ప్రియులు బహు దారిద్రులు. మిత్రద్రోహమే వారి విద్య

వాక్య భాగము : Mat 26:14-16; Mark 14:10,11;

సత్యము: ధనమునకు దాసుడైనవాడు దేవునినెరుగడు
కృప: ప్రభువు తన ద్వారా మనలను ఆస్తికర్తలుగా చేయుట

ప్రార్థన: ప్రభువా! మేము ఈ లోకములోని ధనమునకు దాసులుకాక, నీవిచ్చు దీవెనెతో ధనవంతులగుటకు కృపను చూపుమని వేడుకొనుచున్నాము. మా సంపద మీకు మహిమార్ధమై ఉండునట్లు మాకు మీరిచ్చిన అన్ని ఈవులను కాపాడుకొనగల జ్ఞానమును దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

మత్తయి 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.

యేసుప్రభువు కాలములో ఆయన దగ్గర శిష్యునిగా వుండుట గొప్ప భాగ్యము. కాని యూదా ప్రభువును గుర్తించలేక "ట్రెండింగ్ తో ట్రేడింగ్" అను ధన వ్యామోహములో పడిపోయెను. ఆ టైంలో ప్రభువే పెద్ద న్యూస్ కాబట్టి యూదా ఇస్కరియోతు ప్రభువువద్ద ట్రెజరర్ గా జాయిన్ అయి ధనమునకు దాసోహమాయెను. ముందురోజు యూదా అత్తరు బాటిల్ ని అమ్మలేకపోయిన చిన్న కారణముతో ఏకంగా ప్రభువును అమ్మివేసెను.

మన ధనాపేక్ష ప్రభువును చూడలేనంతగా పెరిగితే అది మన అంతమునకు పునాది వేయును.

మన అవసరములన్నియు ప్రభువుకు తెలుసు కావున చిన్న చిన్న విషయములకు ప్రభువుపై కోపగించక, ఆయనను హత్తుకొను హృదయము కలిగి వుందుముగాక.

    మత్తయి సువార్త 26 :
  1. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి
  2. నేనాయ నను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
  3. వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల