Day 17: ప్రభురాత్రి భోజనము - సిద్ధబాటు

వాక్య భాగము: Mat 26:17-19; Mark 14:12-16; Luke 22:7-13; John --

వాక్య భాగము: దా||కీ 23:1; మార్కు 14:22; 1 కొరిం 11:23-29

రాజనీతి: ఎన్ని ఆటంకములున్నను, మనకు ప్రభుభోజనము సిద్ధ పర్చుచున్న తండ్రి

గమనిక: ఈ వ్యాసము "ప్రభు సంస్కారపు విందు" అనే అయ్యగారి వర్తమానముల నుండి సంగ్రహించ బడినది.

పాప శుద్ది:- శరీర బలము కొరకు నీ శరీర రక్తములు సిద్దపర్చి నందుకు వందనములు, అయోగ్యులము, పాపులము. నీ శరీరాహారం పుచ్చుకొనుటకు మాకు నేర్పించుము, నీ వాక్య వర్తమానము అందించుము. జ్ఞానము, విశ్వా సము, ప్రత్యక్షతను, వాక్యమును దీవించుము. అయోగ్యముగా పుచ్చుకొనకుండ యోగ్యముగా పుచ్చుకొనే కృప దయచేయండి. దూతలను కావలి ఉంచి, దయ్యములను వెళ్ళగొట్టుము. మాకు నీ భోజనము యెడల అపేక్ష, శ్రద్ధ, గౌరవము, అభిమానము దయచేయుము అని వేడుకొనుచున్నాము. ఆమేన్.


సందర్బము: యేసు ప్రభువు పండుగకు వస్తే , పస్కా బలి అర్పణగా ఆయనను అర్పించాలని అటు ప్రధాన యాజకులు, ఇటు అల్లరి మూకలు కుట్ర పన్ని అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయం అది. నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి గాని; మన ప్రభువుకు తలవాల్చుటకైనను స్థలము లేని పరిస్థితి. అదే సమయంలో మనకు మంచి విందు సిద్ధపర్చాలని ఆయన మదిలో మిక్కిలి బలమైన ఆశ.


సాదృశ్యము: డొంక ఉన్నది, పొదవున్నది, చెట్లున్నవి, మొక్కలు ముండ్ల కుప్పలున్నవి. దూరంగా పెద్దపులి వున్నది, ఎలుగుబంటి వున్నది, నక్క వున్నది. ఇక్కడ గొర్రెపిల్ల, ఇక్కడ గొల్లబోయాడు చేతిలో దొంకి కర్ర వుంది. పొద యెద్దకు వెళ్ళి చెట్ల కొమ్మలు కర్రతో వంచి గొర్రె పిల్లకు ఆహారం పెట్టెను. క్రూర జంతువులన్నిటికి గొర్రెపిల్ల కనిపిస్తుంది. వాటి కండ్లు గొర్రె పిల్లను చూస్తున్నవి. గొల్ల బోయాడు మెత్తని మేత వేయగా వాటి వైపు చూస్తు గొర్రెపిల్ల తినగలదా? తినకుండ ఆ క్రూర జంతువులు చేయగలవా? గొర్రె పిల్ల తిన్న తర్వాత దానిని క్రూర జంతువులు తినగలవా? (గొర్రె పిల్లను కౄర జంతువులు ఎందుకు తినలేవో "ఆహారం సిద్దపర్చుట " అనే అంశం తర్వాత వివరించ బడినది)


దావీదు కీర్తన 23:5 వాక్యము మనకు కంఠత అయిన వాక్యం. దానిని వివరించు కొందాము. ఈ వాక్యంలో రూపం ఎలాగు తలంచాలి. నా శత్రువులు అనగా బైట మన శత్రువులున్నారని తలంచండి బోజనము ఈ బల్లపై యున్నవని తలంచండి. శత్రువులు మనవైపు చూస్తున్నట్లును ప్రభువు బల్లవద్ద నిలువబడియున్నాడు. ప్రభువు నాకు సిద్ధపరచియున్నాడు. పుచ్చుకొనువారు బల్లయొద్ద కూర్చుండియుందురు. సిద్ధపర్చిన ప్రభువు పుచ్చుకొను విశ్వాసి, శత్రువులైన సైతాను ముగ్గురున్నారు. ప్రభువు బల్ల, భోజనము, సైతాను, విశ్వాసి; భోజనము ఎన్ని సం||ల నుండి సిద్దపర్చుచున్నారో ఆ కళలన్నీ ఉన్నవి. దేని కళ దానిదే. అన్నిటిలో కష్టమైనది? ప్రభువు మన నిమిత్తమై యీ భోజనము సిద్దపరచుట కష్టమైన పని.

మన భోజనము

వడ్లు దంచి బియ్యం చేసి బజారుకు వెళ్ళి కూరలు తెచ్చి సిద్దపర్చుట కష్టమని స్వంత అనుభవము వల్ల ఈ లోక భోజనం వల్ల తెలిసి కొంటున్నాము. ఇది అశాశ్వత భోజనము. ప్రభువిచ్చేది శాశ్వత భోజనము.

  1. సిద్దపర్చుట
  2. నాకు
  3. భోజనం
  4. ప్రభువు బల్లయొద్ద ఉండుట
  5. ఆయనే సిద్దపరచియున్నాడు
  6. ఆయనే వడ్దించుచున్నారు
పాపి, బీదవాడు, అయోగ్యుడగు లోకస్తుని మార్చి, సిద్దపర్చి, బల్లకు చేర్చే ఇంత గొప్పపని నమ్ముటకు వీలులేదు. జ్ఞానము ఒప్పుకోదు, మనస్సాక్షికి వీలులేదు. అయినను నమ్మే విశ్వాసము ప్రభువు మనకు ఇచ్చినాడు. ఇది ఆయన కృప. మనలను రానిచ్చుట రెండవ కృప. ఆయన అన్నియు సిద్దపర్చినను మనము యోగ్యులముగా పుచ్చుకోకపోతే లాభమేమిటి. మేము అయోగ్యులముగాను, గౌరవము లేని వాని ఆను, శ్రద్ధ లేనివాని గాను విచ్చియున్ననని ఒప్పుకొని బల్లయొద్దకు పోవలెను.

శత్రువు యెదుట సిద్దపర్చుట, ప్రభువు నాకు, నన్ను పిలుచుట, నేను అనుభవించుటకు అన్ని సిద్దపర్చి నన్ను పిలుచుచున్నాడు. నేను వెళ్ళకపోతే ప్రయోజనమేమి? మోక్షం చాలా విశాలమైనది, ఇంకా స్థలమున్నది. నన్ను పిలుచుచున్నాడు.

  1. భోజనము ఉంది
  2. కాళీ ఉంది
  3. ఆహ్వనమున్నది
  4. తినకపోతే ప్రయోజనమేమి?

జ్ఞానం:- నమ్మకం కుదరకపోయినా పరవాలేదు. ప్రభువు నాకేందుకివ్వాలనే మనస్సు వస్తే ఎంత చెప్పిన అర్థము కాదు. నమ్మండి. "నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము"

పేతురు నీకు, యోహాను నీకు, యాకోబూ ఇది నీకు ... అని ప్రభువు ఎందుకీలాగిచ్చెను తెలుసునా? మరెందుకు పుచ్చుకోవడం. ప్రభువు యిస్తున్నారు గాన పుచ్చుకుంటున్నాము. విశ్వాసం వల్ల అంత గ్రహిస్తాము. జ్ఞానంవల్ల కొంత గ్రహిస్తాము. విశ్వాసం గొప్పది.

గొర్రెపిల్ల సాదృశ్యము

దుడ్డుకర్ర :- శత్రువులను "కొట్టుటకు వచ్చేవు సుమా, నాచేతిలో కర్ర ఉన్నది" అని అనగలుగుటకు.

దండము: గొర్రెపిల్లను వెనుకకు లాగుటకు, ఏ భయము లేకుండ గొర్రెపిల్ల బాగా చూస్తు మేస్తు ఆకలి తీర్చుకొనుము, గొల్లవాడు మేపుచున్నాడు గాన కౄర జంతువులు ఏమి చేయలేవు. గొర్రెపిల్ల సంతుష్టి పొందవలెను. నేను గొర్రెలకు వుత్తమ కాపరిని నా గొర్రెలు నా శబ్దము వినును. అనగా

  1. విశ్వసించండి
  2. గౌరవించండి
  3. నా యొద్దకు రండి
  4. అను ఆహ్వానమున్నట్టి విశ్వాసులే ఈ బల్ల యొద్దకు రండి. విశ్వాసం కుదుర్చుకొనండి.
సైతాను, దెయ్యలు, అంతి క్రీస్తు, అబద్ద భోధకులు, ఎక్కడబడితే అక్కడే శత్రువులు, పాపాలు, జబ్బులు, నరకం, హేడెస్సు, 7 సం||ల శ్రమలు, పరిపాలన వైపు నీ కేమి పని? నా పని నా భోజనం వైపు చూచి కడుపునిండా భోజనం చేయుము. అది ప్రభువు యొక్క దయారస రూప కళ "నీకును నీ సంఘమునకు".


అయ్యగారి వర్తమానంలో మిగిలిన అంశములు: బైబిలులో ఏదేను తోట మొదలు, ఐగుప్తులో, యేసు ప్రభువు సంచరించిన ప్రదేశాలలో, పరలోకంలో, పాతాళంలో ప్రభువు మనకు యే విధముగా విందు సిద్దము చేసారో ... ఆయా విషయాలు గలవు. సారాంశము: మనము ఎన్ని ఇరుకు ఇబ్బందులలో ఉన్నను, మన ప్రభువు మనకు సిద్దపర్చిన విందును కృపతో అందుకొన్నచో, దేనికి భయపడక ప్రభువును మాత్రమె చూచు అనుభవముతో సాగిపోవుదము.

ప్రార్ధన :- దయగల ప్రభువా! శరీరమునకు లోకాహారం, ఆత్మకు శరీరానికి సంస్కార విందునూ, నూతన యెరూషలేములోను మహా గొప్ప పెండ్లి విందు సిద్దపర్చినావు. నీవిచ్చిన అనేక విందులను గూర్చి నీకు స్తోత్రములు. ఆమేన్.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +