Day 18: ప్రభువు ప్రారంభించిన నూతన నిబంధన
వాక్య భాగము: Mat 26:20; Mark 14:17; Luke 22:14-20, 24-30; John 13:1-20
రాజనీతి: Inception of New Testament by Lord Jesus Christ
గమనిక: ఈ వ్యాసము "ప్రభు సంస్కారపు విందు" అనే అయ్యగారి వర్తమానముల నుండి సంగ్రహించ బడినది.
సందర్బము: రొట్టె ద్రాక్షారసముతో సిద్ధముగా ఉన్న భోజనపు బల్ల. ప్రభువు, శిష్యులు బల్ల దగ్గర వున్నారు. శిష్యుల దృష్టిలో ప్రభువు మాత్రమే ఉన్నారు, వేరొకటి మదిలోనికి రాజాలని క్షణాలు. ప్రభువు వారి అంతరంగములో ఏమున్నదో స్పష్టముగా చూస్తున్నారు. రాబోయే దైవ రాజ్యానికి కాబోయె వారసులకు నిత్యమైన నిబంధనగా ప్రభు సంస్కారపు విందుకు నాంది పలుకుతున్న సమయం.
ప్రభు రాత్రి భోజనము విశ్వాసులకే ప్రభువు ఏర్పరచినారు. క్రీస్తు ప్రభువు రెండు మాటలు చెప్పెను.
- రొట్టె నిచ్చుచు ఇది నా శరీరము అనెను
- ద్రాక్షారసము ఇచ్చుచు ఇది నా రక్తము అని చెప్పెను
ఉదా:- గ్లాసులో నీళ్ళు పోసి అడిగిన వారికి ఇస్తాము. అడిగినాయన పుచ్చుకున్నాడు. ఆయన గ్లాసు తీసుకొన్నాడా, మంచి నీళ్ళు తీసికొన్నాడా? ఇచ్చిన ఆయన గ్లాసు నిచ్చాడా, నీళ్ళిచ్చాడా? అడిగిన ఆయన నీళ్ళు అడిగాడు గాని గ్లాసు అడగలేదు గాని రెండు ఇవ్వడం నిజమే. ఆలగే రొట్టె ఇచ్చుట నిజమే, దాని మూలముగా శరీరము ఇచ్చుట కూడ నిజమే. ద్రాక్షారసము ఇచ్చుట నిజమే, దాని మూలముగా రక్తమును ఇచ్చుట కూడ నిజమే. రొట్టె, ద్రాక్షారసము బహిరంగ క్రియ => ప్రభువు శరీర, రక్తములు తీసుకొనుట అంతరంగ క్రియ. సంస్కార సమయం, ప్రభువు అంతరంగమును పరిశీలించే సమయం. ప్రభువు సిద్ధపర్చిన ఐశ్వర్యమును విశ్వాసి అందుకొనుటకు అధికారము పొందుకొనే సమయం.
ఇప్పుడు కూడ మనకు రొట్టె, ద్రాక్షారసము ఇస్తారు. విశ్వాసులు మాత్రము తీసికొందురు. పాదిరి గారు వాటిని బల్ల మీద పెట్టి ప్రతిష్టించిన తర్వాత అవి వట్టి రొట్టె,వట్టి ద్రాక్షారసము కాదు. విశ్వాసమును బట్టి ఆయన శరీర రక్తములను అందుకొనుచున్నారు. రొట్టె,ద్రాక్షారసము అందుకొనుట ఎంత నిశ్చయమో ప్రభువు యొక్క శరీర రక్తములను అందుకొనుట అంత నిశ్చయము. ప్రతిష్ట లేక ముందు పిల్లలు ఆ రొట్టె తినిన, ఆ ద్రాక్షారసము త్రాగిన అది వట్టి రొట్టె, వట్టి ద్రాక్షారసము మాత్రమే. ఆరాధన అయిపోయిన తర్వాత మిగిలిన రొట్టె, మిగిలిన ద్రాక్షారసము పిల్లలు త్రాగిన వట్టి రొట్టె, వట్టి ద్రాక్షారసమే గాని సంస్కారమున తీసికొన్నప్పుడు వాటితోబాటు విశ్వాసి ప్రభువు శరీర రక్తములను అందుకొనును.
అక్కడ కేవలం 12 మంది శిష్యులు వున్నారు. వారిలో ఒకడు అప్పటికే సాతానుకు లొంగిపోయాడు. ఇక ఆ 11 మంది శిష్యులకు ప్రభువైన యేసు క్రీస్తు తన అనాది రక్షణ మహా సంకల్పమును విశదపరుస్తున్నారు. ఈ నూతన నిబంధన కట్టడను నా రెండవ రాకడ వరకు కొనసాగించండి అని వారికి అధికారమిచ్చెను. అప్పటికి ఇంకా ప్రభువు సిలువ వేయబడలేదు, శిష్యులు బీదవారు. అయినా గాని శిష్యులు ఆ ఒక్క రోజు తీసుకున్న ప్రభు బోజనము ద్వారా ఈ సువార్త భూగోళమంతటికి వ్యాపిస్తుందని, ఇది రెండవ రాకడ వరకు కొనసాగుతుందని గ్రహించగలిగి, అనేక అద్భుతములను చేయగలిగిరి. కాబట్టి మనము ఎంతటి బలహీనులమైనప్పటికిని, ఆయన శరీర రక్తములు మనకున్నవి గనుక, ఈ భూలోకములో అత్యంత బలమైన పనులను మనము చేయగలుగుటకు ప్రభువునందు బలవంతులము. ఇదంతా ఆయన కృపయే.
దేవుడు మనకు తన వాక్యాహారమను శరీరము ద్వారా తన ఆత్మాభిషేక రక్తముతో రాకడ వరకు మనలను పోషించును గాక! ఆమేన్.
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +