Day 20: అంతరంగ దైవసహవాసము
వాక్య భాగము: Mat 26:26-29; Mark 14:22-25; Luke 22:19-20; John 13:31-32
- గమనిక: ఈ వ్యాసము దేవదాసు అయ్యగారి "ప్రభు సంస్కారపు విందు" అనే ప్రసంగ వర్తమానములనుండి సంగ్రహించబడినది.
ఈ రోజు రెండు అద్భుతములు మన మద్య వున్నవి
- యేసు ప్రభువు తన శిష్యులకు భోజనము యిచ్చేటప్పుడు జరిగిన అద్భుతము. ఆ 11 మంది ప్రభువుతో ఏకమైనారు, వారిలో వారైన, ఒకరితో ఒకరైన ప్రశ్నలు వేసికోలేదు. మిగిలిన సందర్భాలలో ఎవరో ఒకరు ప్రభువును ఏదో ఒక ప్రశ్న వేసిరి గాని, ఆయన రొట్టె, ద్రాక్షారసమును యిస్తూ, ఇది నా శరీరము, నా రక్తము అని చెప్పినను వారు ఎదురు ప్రశ్న వేయక ప్రభువులో ఏకమై పోయినారు. 11 మంది సహవాసములో సంఘముగా ఏకమై పోయినారు.ఆ సంఘము ప్రభులో ఒక్కటై పోయినది. వారే ఆది సంఘము.
- నేటికిని మనకిస్తున్న భోజన అద్భుతము మనము అనేక మర్మముల యెదుట ఉన్నాము.
- సూర్య, చంద్ర నక్షత్రాదులు ఆకాశమందున్నవి. అవి క్రింద పడకుండ ఎందుకున్నవో మనకు పూర్తిగా తెలియదు. అదొక మర్మము
- దేవుడు మనిషిగా జన్మించుట అది ఒక మర్మము
- సర్వలోక పాప పరిహార్ధమై శిలువపై మరణము పొందుట, అది ఒక మర్మము
- దేవుడేలాగు మరణము కాగలడు? సమాధి చేయబడుట, పునరుత్ధానమగుట గాలిలో పరలోకానికి వెళ్ళుట ఇన్ని మర్మముల యెదుటను ఇంకా అనేకమైన మర్మముల యెదుటను మనము నిలువబడి యున్నాము.
ఆలాగుననే యేసు ప్రభువు తన శరీర రక్తములను ఏలాగు ఇస్తారో అదియును గొప్ప మర్మము. అయినను తక్కిన మర్మములను నమ్ముచున్నట్లు ఈ మర్మమును నమ్మిన యెడల ఈ సంస్కార భోజనము వలన గొప్ప మేలు పొందగలము.
దైవ క్రియ పద్ధతి - మొదట అంతరంగ శరీరము తర్వాత బాహ్యమైన శరీరము
దేవుడు సృష్టిలో కలుగజేసిన వస్తువులు చూస్తే పైకి ఒక విధముగను, లోపల మరియొక విధముగను ఉన్నవి. బహిరంగ అంతరంగ స్తితులు ఒక విధముగా లేవు.- ఉదా:- పండు - అరటి పండు పైకి ఒక విధముగ, లోపల గుజ్జు మరియొక విధముగా నున్నది.
- ఉదా:- పక్షులు, జీవరాసులు - పక్షులు బయట ఈకలు, వెండ్రుకలును; లోపల వేరుగను ఉండును.
- ఉదా:- మనుష్యుడు - మనిషి బయటకు ఒక విధముగా నున్నాడు మరి లోపలనున్న ప్రాణము కనబడదు. దాని క్రియలు మాట్లాడుట, చూచుట, నడచుట వంటివి పైకి కనబడుచున్నవి. దీనిని బట్టి మానవుడు బాహ్యమున, అంతరంగమున వేరు వేరుననున్నాడు.
- ఉదా:- రొట్టె, ద్రాక్షారసము - చూచుటకు అవి రొట్టె, ద్రాక్షారసముగా బాహ్యముగా కనిపిస్తున్నప్పటికిని, వాటి ఆంతరంగములో ప్రభువు రక్త, మాంసములతో కూడిన సంఘము యొక్క జీవము దాగి వున్నది. అందుకే అనాటి సంఘము నేటికిని జీవించుచున్నది.
- రొట్టె - ప్రభువు శరీరము
- ద్రాక్షారసము - ప్రభువు జీవము (రక్తము)
అరటి పండులోని తొన, పక్షిలో ఈకలు, మనిషిలో చర్మము బహిరంగముగా ముందు వచ్చునవి/కనిపించునవి. కానీ ప్రభువు విషయంలో అంతరంగము ముందు, బహిరంగము వెనుక వచ్చినవి. ప్రభువు అద్భుత కార్యము చేయుటకు ముందు, అంతరంగమును శుద్ధి చేసి,సిద్ధపర్చి, మాట సెలవియ్యగా వెనువెంటనే ఆ కార్యములు బహిరంగముగా జరిగెను (మార్కు 11:24 లో నడుము వంగిన ఆమెకు స్వస్థత). అందుచేత ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందియున్నామని అంతరంగమున నమ్ముడి.
ప్రభువు శరీరధారియై వస్తారని పాతనిబంధనలో అంతరములోనున్నది. సువార్తలలో బహిరంగమున నెరవేరినది. తన సంఘము ఆయన శరీర, రక్తములతో పోషించబడును అని సువార్తలలో అంతరంగములో నున్నది, అది ఇప్పుడు బహిరంగ సంఘ శరీరముగా నున్నది. ఆయన రెండవ రాకడలో మనలను పరలోక రాజ్యములో చేర్చును అని ఇప్పుడు అంతరంగములో నున్నది, త్వరలో ఆయన రాకడలో మనలను మహిమ శరీరముతో కొనిపోవుట బహిరంగముగా జరుగును.
ఇన్ని అద్భుతములను ప్రభువు మనకు బహిరంగముగా బైలుపరుస్తున్నపుడు, అంతరంగములో ఆయనతో సహవాసము, ఆయన యెడల భక్తి, ప్రేమ కలుగక మానునా? ఆయనను నమ్ముకొనిన యెడల, ఆయన గొర్రెల మంచి కాపరి గనుక గాఢాంధకార లోయలను ఆయన సురక్షితముగా దాటించుచుండగా మనకేమి కొదువ. "నాకేమి కొదువ నాధుడుండ".
కృప తోడై యుండును గాక!
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +