ప్రభువు పొదిగిన పరిశుద్ధ నైజము
వాక్య భాగము: Mat 26:31-35; Mark 14:27-31; Luke 22:31-38; John 13:33-38,14:1-31
Postpone your death for Christ until you perform great things in His name
పరిశుద్ధ నైజము
దేవదూతలకు స్వంత అలోచన (బ్రెయిన్) లేదు. ప్రభువైన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడమే వారి పని. అలాగే దేవునితో సహవాసము పెరిగే కొలది మన శరీర నైజము (దురిత నైజము = సహజాత ప్రవృత్తి = basic instinct) మాయమై పోయి, పరిశుద్ధ నైజము(Holy instinct) అబ్బును. అనగా దేవుని అంతరంగములో ఏమున్నదో కేవలము దానితో కలిసిపోయి మన స్వంత అలోచన లేకుండా అనాలోచితముగా ఆయన ఉద్ధేశ్యమును నెరవేర్చు వారుగా ఉంటాము. ఈ రోజు పాఠము "మన ఆలోచనకు యేసు క్రీస్తు ప్రభువై యున్నారు". మన అంతరంగము ఆయనకు స్పష్టముగా తెలియును. మనము ఆయనను సంపూర్ణముగా ప్రేమిస్తే, మనకు తెలియకుండగనే ఆయన మనలను కాపాడువాడు.
ఆయన శిష్యుల మదిలో ఏమున్నదో వారు ఎంతకు తెగిస్తారో ప్రభుకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము బయలుదేరేముందు ఆయన శిష్యులు తోమా తో కలిసి "ఆయనతో మనము కూడ చనిపోవుటకు వెళ్ళుదము రండి" అని తీర్మనము కూడ చేసికొన్నారు. అవసరమైతే నిశ్చయముగా ప్రభువుకోసం చనిపోతారని దేవునికి తెలుసు. అయితే ప్రభువు వారిని అంతము వరకు ప్రేమించెను. వారి అంతము ప్రభువుతో పాటు కాదు. దైవ రాజ్యమైన క్రీస్తు మార్గమును స్థాపించి, స్థిరపర్చాల్సిన బాధ్యత పేతురు గారిపై ఉన్నది. అయితే పేతురు గారు చాలా నిష్కపటమైన మొండి రాయి. ఆయన చేస్తాను అని అనుకొంటె చేసి తీరతారు. ఆయన మొహమాటము లేకుండా ప్రభువును అనేక ప్రశ్నలు వేసి సందేహ నివృత్తి చేసుకుని స్థిరపడిన శిష్యుడు. పేతురును ఆది సంఘ నాయకుడుగా ప్రభువే నియమించారు. ఆ నాయకుడు ప్రభువుకంటె ముందే చనిపోతానంటున్నాడు.
అబ్రహాము గారికి ప్రతి క్షణం దేవుని మాట వినే అలవాటు. అందుకే ఆయన ఎత్తిన కత్తి ఇస్సాకుపై పడే క్షణములో కూడ దేవుని మాటను వినగలిగినాడు. అయితే పేతురు గారికి విషయం స్పష్టమయితే తెలియకుండానే పని పూర్తి చేయడం అలవాటు. ప్రభువు శిష్యులలోని ప్రేమను చూస్తున్నా రు. అందుకే ప్రభువు పేతురు గారి అలోచనను తీసివేసి తన మాటలను పేతురు గారి మదిలో పెట్టెను. "ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను". ఆ మాటతో పేతురు నిశ్ప్రుహలోనికి వెళ్ళిపోయెను. కోడి కూసిన తర్వాత, బహుగా పశ్చాత్తప పడితే గాని మళ్ళీ స్పృహలోనికి రాలేక పోయెను. అత్యంత నిశ్ప్రుహలో ఉన్న పేతురు మానవ నైజమును బట్టి (survival instinct)మాత్రమే కాక ప్రభువు మాట చొప్పున ఆయనను ఎరుగను అనెను. అయితే కోడి కూసిన తర్వాత పేతురుకు ప్రభువు యొక్క మాట మరల గుర్తుకొచ్చి బహుగా ఏడ్చెను.
మనలో చాలా మంది ప్రభువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన వారున్నారు. ఐతే ప్రభువు సంకల్పమును తెలుసుకొని ఆయన చేయమన్న కాలములో వాటిని నెరవేర్చుటకు సిద్దపడాలి. నేను ఇప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటాను, తర్వాత అయితే కష్టం అనుకునే వారికి ప్రభువు ఏ పని అప్పగించరు.
"ముమ్మారు" అనే లేఖన సూచక క్రియ పేతురు విషయంలో మూడు సార్లు నెరవేరింది. ఈ మూడు సందర్బాలలో పేతురు పొందిన పశ్చాత్తాప వేదన ప్రభువైన యేసు క్రీస్తు ఉద్దేశించిన రక్షణ మహా సంకల్ప ప్రణాళికను వెలుగు లోనికి తీసికొని వచ్చింది. ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగని, ఇక జరగబోని మూడు అద్భుతాలు (turning points for the current world) జరిగాయి.
- ప్రజలందరి రక్షణ కొరకైన సిలువ యాగము యొక్క గొప్ప పశ్చాత్తాప అనుభవ సాక్ష్యము (Luke 22:51)
- ప్రభువు పునరుత్ధానమైన తర్వాత ఆయన సంఘమును స్థాపించి, కాచి, మేపు ధన్యత (John 21:15-18)
- అన్యులకు క్రీస్తు సువార్త అందించి తద్వారా మనలను రక్షించిన ఘనత (Acts 10:11-16)
జరిగిన పొరబాటులకు చింతింపక ప్రభువు యెదుట పశ్చత్తాప హృదయులమై , ప్రభువు ప్రణాలిక మన యెడల ఏ విధముగా ఉన్నదో తెలిసికొనుటకు ఆయన సన్నిధికి చేరుదము. ప్రభువు ఇచ్చిన పనిని ఆయన చెప్పిన సమయములో నెరవేర్చుటకు ప్రభువు మనలను ఆయత్త పరచును గాక!
Supporting Verses:
మత్తయి సువార్త 26: 31. అప్పుడు యేసు వారిని చూచిఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగాగొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
32. నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద ననెను.
33. అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
34. యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
35. పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +