ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 23
వాక్య భాగము: John 17
యేసుప్రభువు వెల్లడించిన దైవ స్వరూప లక్షణములు, ఐక్యతలో బంధించు ప్రార్ధన
ఈ అద్యాయములో చాలా విశేషములు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యేకతలు, ప్రార్థన, శాస్వత కోరిక ఈ చివరి ప్రార్థనలో వెల్లడించబడినవి.
ఇది ప్రభువు చేసిన అతి పెద్ద, శాస్వతకాల ప్రార్థన. ఒలీవల కొండ దగ్గర శిష్యులందరు నిద్ర మత్తులో ఉన్నప్పటికిని యోహాను మాత్రం ప్రభువు యొక్క ప్రార్థనలోని ప్రతీ మాటను మదిలో దాచుకొనుటకు వినుచుండెను. ఆయన చివరి క్షణములో చేసిన ప్రార్థన మనందరి నిత్యజీవ సహవాసము కొరకైన ప్రార్థన. ఈ ప్రార్థన బహువేధనలో గెత్సెమనేలోని ఒలీవల కొండమీద చేసిన ప్రార్థన అనుటకు ఋజువు ఈ ప్రార్థన అయిన వెంటనే కిద్రోను వాగు దాటిపోయిరి. ఇక్కడ ఇవ్వబడిన మేప్స్ ప్రకారం గెత్సేమనే నుండి ఒలీవలకొండకు 1 కిలోమీటరు. అక్కడనుండి కిద్రోనుకు 11.5 కి.మీ. అనగా ప్రభువు ఆ వేధనలో కూడా చాలాదూరము నడిచి వెళ్ళిరి. "లెండి ఇక్కడనుండి వెళ్ళుదము" అను చిన్న మాటలో ఆ రాత్రి చాలా నడక(రక్తము చమటగా కారిన తర్వాత వేధన, శ్రమ) ఉన్నది. తర్వాత అంత దూరము అదేరాత్రి ప్రభువు యెరూషలేమునకు తీసుకురాబడెను. శ్రమనుండి అధిక శ్రమకు, సిలువ మరణమువరకు జరిగినది.
- Other prayers of Jesus
-
సువార్త ఫలితము వచ్చినపుడు:
మత్తయి 11:25 తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
26 అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
27 సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. -
లాజరు మరణమైనపుడు కరుణతో కదిలిన హృదయ ప్రార్థన:
యోహాను 11:41 యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. -
మనుష్యకుమారుడు పొందబోవు సిలువ వేదన సిద్ధబాటు:
యోహాను 12:27 తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
28 తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. - గెత్సేమనే తోటలో
- యోహాను 17:1-3 మన నిత్య జీవము కొరకు
- యోహాను 17:4-19 శిష్యులు సత్యమందు ఐక్యత కొరకు
- యోహాను 17:20-23 యాజకులకు, సంఘములకు, విశ్వాసులకు అనుగ్రహించిన మహిమ నిమిత్తము
- యోహాను 17:24-26 దైవలక్షణ ధారణ వలన కలుగు సింహాసన స్థానము అనుగ్రహించుటకు
- సిలువపై చేసిన ప్రార్థనలు
- లూకా 23:34 యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
- మత్తయి 27:46 ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
- లూకా 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను.
- ప్రభు రాత్రి భోజనము:
లూకా 22:17-19 కేవలము స్తుతి మాత్రమే చెల్లించెను.
ప్రభువు చేసిన 6 ప్రార్థనలు + ప్రభువు నేర్పిన ప్రార్థన = 7 ప్రార్థనలోకెల్ల ఈ ప్రార్థన చాలా పెద్దది. ఈ ప్రార్థనలో ప్రభువు యొక్క దైవమహిమ, దైవలక్షణములు, నిత్యజీవము, క్రీస్తు వాగ్ధానము, సంఘప్రణాళిక, యాజక బాధ్యత, ఈలోకములో క్రైస్తవునికి ప్రభువు ఇచ్చిన రక్షణ మొదలగు ఖచ్చితమైన వాక్కులు ఉన్నందున ఈ అద్యాయము మొత్తం ధ్యానించుట అనివార్యము.
ప్రపంచం ముందు రెండు మార్గములున్నవి, 1. స్థిరమైన సత్యమార్గం 2. తాత్కాలిక ఉపశమన మార్గం. విశ్వాసి ప్రభువును హత్తుకొని సత్యములో ప్రతిష్ఠింపబడి నిత్యానందములో గడుపును గాక! ఆమేన్.
Supporting verese
యోహాను సువార్త 17:16. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.
17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
19. వారును సత్యమందు ప్రతిష్ఠచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
24. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +