ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 26
వాక్య భాగము: Mark 14:53; Luke 22:54; John 18:12-14,19-23
ప్రధాన యాజకుని(తన సేవకుని) వద్దకు ప్రభువు తేబడుట
సత్యము: మెల్కెసెదకు క్రమములోని ప్రధానయాజకుడైన ప్రభువు ఈ భూసంబంధ ప్రధానయాజకుని వద్ద దోషిగా నిలబడి శ్రమపొందెను.
కృప: మనలను రాజులుగాను, యాజకులనుగాను చేసెను.
ప్రార్థన: ప్రభువా! పరలోక యాజకా! ప్రధాన కాపరీ! మాకోసం అన్యాయముగా విచారించబడి మమ్మును మీకు విశ్వాసులుగా, దాసులుగా, శిష్యులుగా, కుమారులుగా, సహోదరులుగా, స్నేహితులుగా, కాపరులుగా, రాజులుగా, అపొస్తలులుగా, యాజకులుగా; ఇంకా సంఘ పరిచారకులుగా, సంఘ పెద్దలుగా హెచ్చించిన దేవా! మీకు వందనములు. మీ శ్రమను గుర్తుచేసుకొనుచు బాధ్యతతో ముందుకుసాగు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! అమేన్.
దేవుడు మోషేద్వారా ఏర్పరచి అధికారమిచ్చిన ప్రధాన యాజకుడు ప్రభువును పరీక్షింపబూనుకొనెను. యేసే క్రీస్తయితే ప్రజలందరి కొరకు చనిపోవుట ఆవశ్యకము అనెను గాని ప్రభువును గుర్తించలేకపోయెను. అయితే అప్పుడు చేసిన పరీక్ష యొక్క ఫలితమే మనందరి రక్షణ.
పాతనిబంధనలోని ఆదాము మొదలుకొని జెకర్యా వరకు ఒకే వృత్తి చేయు రెండు రకముల వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు యేసుప్రభువునకు సాధృశ్యముగా ఉంటే, ఇంకొకరు ఇది నిజమా? అయితే అలా జరుగుతుందేమో చేసి చూద్దాం అని టెస్ట్ పాపఫలితము తెచ్చుకున్న తర్వాత నమ్ముతారు(చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు). దీనికి మంచి ఉదాహరణ మొదటి రాజులు 13వ అద్యాయములోని ఇద్దరు ప్రవక్తలు. రాజుదగ్గర ఉన్న భూసంబంధమైన ప్రవక్త దైవ సందేశము తీసుకువచ్చిన ప్రవక్తను (యేసుప్రభువుకు సాదృశ్యము) పరీక్షించుటకు భోజనము చేయుమని బలవంతము చేయగా, తాను తీసుకువచ్చిన సందేశము సత్యమని ఋజువుపర్చుటకు తన ప్రాణమును బలిగా పెట్టి భూప్రవక్తకు నమ్మిక కలిగించెను.
ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే మనము ఏ స్థానములో ఉండి దేవుని పరీక్షించుచున్నాము? పైన ప్రార్థనలో, దేవుడనుగ్రహించిన 12 స్థానములలో 1. విశ్వాసిగా పరీక్షిస్తే ఆ విశ్వాసి జీవితము మాత్రమే ప్రభావితమౌతుంది, 2. ఒక కాపరి ప్రభువును శంకిస్తే సంఘము మొత్తానికి, 3. ఒక దైవ చిత్తములోని రాజు ప్రభువును విశ్వసింపక పరీక్షించినట్లయితే మొత్తం దేశం (2 సమూ 24. దావీదు తప్పిదం) దాని ఫలితము ఎదుర్కొనవలసి వచ్చును. 4. ఇక్కడ ఆ ప్రధాన యాజకుడు ప్రభువును పరీక్షించుటద్వారా ఒక జనాంగము(యూదా) మొత్తం ఆ ఉపద్రవమును (హిట్లర్) ఎదుర్కొనవలసి వచ్చినది.
దావీదు వెంటనే దేవునివైపు తిరిగెను గాని యూదుల ప్రధాన యాజకులు క్రీస్తు ప్రభువును హత్తుకొనక గొప్ప చిక్కు తెచ్చుకొనిరి.
ఈ చిన్న శ్రమలను క్రైస్తవుడు తట్టుకొనలేకపోతే, ప్రభువు రాకడ సమయంలో నిలబడుట యెట్లు ? - యం. దేవదాసు అయ్యగారు.
కష్టసమయమందు విసుగక దేవుని హత్తుకొను కృప మనకున్నది. కనుక ప్రభువునందు సంపూర్ణ విశ్వాసము కలిగి ముందుకు సాగిపోవుదము.
Supporting verses
యోహాను సువార్త 18:12. అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
13. అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.
14. కయపఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
19. ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా
20. యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
21. నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.
22. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొఒకడుప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
23. అందుకు యేసునేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +