ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 31
వాక్య భాగము: Mat 27:1-2; Mark 15:1; Luke 22:66-71;
ప్రధాన యాజకుడు - యాజకులు
సత్యము:క్రీస్తు కూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతాను మహిమ పరచుకోలేదు గాని మహాశ్రమలలో పాలిభాగస్తుడాయెను.
కృప: మన ప్రధాన యాజకుడు మన అన్ని శ్రమలలో సహానుభవము గలవాడై మనలను కనికరించి సమయోచితమైన సహాయమును అందించును.
ప్రార్థన: మిక్కిలి శ్రమపొందిన మా ప్రధానయాజకుడవైన ప్రభువా! మాకు సంతోషమును, ఆనందమును ఇచ్చుటకు మా శ్రమలను మీమీద వేసుకొని భరించిన దేవా! మీకు వందనములు. మా అయోగ్యతను తీసివేసి, ఆత్మ తీవ్రతను పెంచమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3,4,5 అద్యాయములలో యేసు ప్రభువు అనే ప్రధాన యాజకుని వివరము ఉన్నది. సిలువ ధ్యానములలో అత్యధికంగా ఈ యాజకుల వాక్యములను పొందుపరచిరి. యూదా సమాజపు యాజకులు అన్న, కయప ఇంకా శాస్త్రులు మన ప్రభువైన ప్రధాన యాజకుని స్థానమును ఆక్రమించి ప్రభువును తిరస్కరించించిరి. ఈ సృష్టికి ప్రాధాన దూతయైన లూసిఫర్ సాతానుగా మారుటకు, పాపము ప్రవేశించుటకు కారణమైన శోధన(అతిక్రమము/ట్రెస్‌పాస్/చొరబాటు/ప్రభువు స్థానమును కోరుకొనుట) ఆ యాజకులకు గుడ్డితనము కలుగజేసెను. సాతాను తన ఆఖరి క్రియ జరిగించుటకు యాజకులను క్రీస్తును గుర్తించకుండా చేసి ప్రభువుకంటే మిక్కిలి హెచ్చించుకొని ప్రభువునకు అన్యాయపు తీర్పు తీర్చుటకు వారి కన్నులు మూసివేసినది. సాతానుకు ఇది ఆఖరు పైసాచిక ఆనందము. అయితే ప్రభువు సాతాను శిరను(తలను) సిలువపై చితుకకొట్టెను. ఇప్పుడు మనకు దేవుని కృప మాత్రమే ఉన్నది తప్ప సాతాను అధికారము ఏమాత్రము లేదు.
ప్రభువైన క్రీస్తుగా ప్రత్యక్షపరచుకొన్న దేవా! మీరు సర్వలోకమునకు ప్రభువని తెలిసుకొని జీవించుటకు కృపదయచేయుము. మేము, మా పరిధి మీ యెదుట చాలా తక్కువ గనుక మేము ఏ క్షణమందైనను మీ స్థానమును ఆశించకుండునట్లు మమ్మును శోధనలోనికి తేక కీడునుండి తప్పించుము. ఈ సృష్టిలో మరి దేనినైనను మీ కంటే ఎక్కువగా ఎంచకుండునట్లు మమ్మును కాపాడుమని రక్షకుడవైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
Supporting Verses
లూకా సువార్త 22:66. ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
67. నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయననేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
68. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
69. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
70. అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయనమీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
71. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +