ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 34
వాక్య భాగము: Luke 23:8-15;
యేసుక్రీస్తు ప్రభువు నిర్ధోషి అని తీర్పు
సత్యము: పాపమెరుగనట్టి ప్రభువు లోకపాపముల నిమిత్తము సిలువపై శ్రమపొందెనుకృప: పాప విమోచన, వ్యాధి నివారణ, నరకమునుండి విడుదల
ప్రార్థన: పరిశుద్ధుడవైన ప్రభువా! నిర్ధోషియని అధికారులచే తీర్పుపొందియు, మా పాపముల నిమిత్తము మరణము వరకు మహా శ్రమ పొందినందుకు, మాకు విడుదల నిచ్చినందుకు స్తోత్రములు చెల్లించుచున్నాము.
ప్రభువును చూచుటకు అనేకులు శిష్యులద్వారా వచ్చుచుండెడివారు. గ్రీసుదేశస్థులు కూడ ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అడిగిరి కాని ప్రభువు ఆ శిష్యులతో "గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను(యోహాను 12:20-26)" అని చెప్పెను.
గ్రీసు దేశస్థులకు ప్రభువు అమూల్యమైన సత్యమును చెప్పెను కాని ఎప్పటినుంచో యేసును చూడగోరిన మహారాజైన హేరోదుకు అసలు ఉత్తరమీయలేదు. హేరోదుమనసులో సూచకక్రియవున్నది. ప్రభువు "దేవాలయమును పడగొట్టి తిరిగి లేపుట" అను మహా సూచకక్రియను జరిగించుచున్నను హేరోదు దానిని గ్రహింపలేడు. హేరోదు చిన్నచిన్న క్రియలకొరకు కనిపెట్టెను గాని ప్రభువులకు ప్రభువైన యేసు మహా కార్యమును సర్వలోకము కొరకు తలపెట్టెను. ఇది హేరోదుకు బహు రౌద్రమును కలుగజేసినను, హేరోదు ఏ ఒక్క దోషమును ప్రభువునందు కనుకొనలేకపోయెను.
గవర్నరు అయిన పిలాతు, మహారాజైన హేరోదు చివరికి ఈయనయందు ఏ దోషమును కనుగొనలేకపోతిమి, ఈయన నిర్దోషి అని తీర్పు ఇవ్వవలసి వచ్చినది. ఇది ఒక చరిత్ర.
ప్రభువుయొక్క ఈ పరిశుద్ధ బలియాగమునకు కృతజ్ఞతగా మన శరీర ఇచ్చలను త్యజించి ఆయన పరిశుద్ధమైన కృపలో జీవించు ధన్యత మనకందకు దేవుడు దయచేయును గాక! ఆమేన్.
Supporting Verses
లూకా సువార్త 23:8. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను.
9. ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.
10. ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.
11. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
12. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
13. అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
14. ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు.
15. హేరోదునకు కూడ కనబడలేదు.హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +