ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 36
వాక్య భాగము: Mat 27:32; Mark 15:21-22; Luke 23:26-32;
సిలువ మోత
సత్యము: దుఃఖముతో ఉన్న ప్రతీ ఒక్కరి కన్నుల భాష్పబిందువును తుడిచివేయుటకు ప్రభువు సిలువను మోసెను
కృప: మన సిలువను ప్రభువు సుళువుగాను తేలికగాను చేసెను.
ప్రార్థన: మాకొసము సిలువ భారమును భరించిన దేవా! మా జీవితములో ప్రతీక్షణము మీ జీవము ఉన్నదని, మా భారమును తీసివేసినారని తెలిసుకొని మీ సిలువను ఎత్తుకొని జీవించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము. మాతరము, పిల్లల తరము, రాకడ తరము కొరకు మీసన్నిధిని మోకరించి మా కోసము విలపించు మనసును దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
ప్రభువు సిలువ మోయు సమయములో వెంబడించిన 4 రకముల విశ్వాసులు, ప్రభువు వెల్లడించిన 4 ప్రాముఖ్యమైన విషయముల గురించి ధ్యానించుదము.
- 1. ప్రభువుని ఎరుగని కురేనీయుడైన సీమోను: అక్కడ జరుగుచున్నవాటికి ఏమాత్రము సంబంధం లేకపోయినను అందరు కలిసి ప్రభువును హింసించుచున్న తీరుకి చలించిపోయి ఆయన శ్రమలో పాలుపొందిన ధన్యుడు.
- 2. గొప్ప జనసమూహము: వీరందరు ప్రభువును ఎరిగినవారు, ఏదోఒక సమయములో ఆయనచేత మేలు పొందినవారే కాని ఆ సమయములో అల్లరి జనముతో కలిసిపోయి సిలువ విలువ తెలిసుకొనలేని భక్తిహీనులు.
- 3. దుఃఖించుచున్న చాలమంది స్త్రీలు: ప్రభువును ప్రేమించి విలవిలలాడుచు ఏమియు చేయలేక బహుగా ఏడ్చుచున్న స్త్రీలు.
- 4. ప్రభువును హత్తుకొనిన శిష్యులు: వీరు అక్కడలేరు కాని ప్రభువు దృష్టిలో వున్నారు. "ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును" అను వాక్యము శిష్యుల వ్యతిరేకుల గురించి స్త్రీలతో చెప్పిన విషయము. ప్రభువు కనిన పిల్లలు శిష్యులు. వారు ప్రభువు నిబంధనను ధరించి వాక్యమనే పాలతో పెంచబడి ప్రభువు భారమును మోయువారై యున్నారు. క్రైస్తవ సంఘమనే గర్భము ధరించిన శిష్యుల అంతము కూడ ప్రభువు శ్రమవంటిదే గాని సంఘములో కొంతమంది ప్రభువు భారము లేకుండుటే/మోయకుండుట ధన్యత అని దుర్భోధచేయుదినములు వారు చూతురని ప్రవచించెను. శిష్యులు అప్పుడు ప్రభువుకు దూరముగానుండి ఎండిన మ్రానులైరి కాని ప్రభువు తిరిగిలేచి వారిని దర్శించిన వెంటనే కదల్చబడని మహా వృక్షములుగా అయిపోయిరి.
4 ప్రాముఖ్యమైన విషయములు:
- 1. మిషను/పని: మనగురించి విచారించుచు, రాబోయే పిల్లలు/తరము కొరకు ప్రార్థించాలి
- 2. జాగ్రత్త: ప్రభువు మిషను మనలో లేకపోతే, ప్రభువు శ్రమలో పాలిభాగస్తులము కాలేము. ప్రభువునుండి పొందుకొనిన(గర్భము) నూతన క్రియలు చేయుట, వాక్యసువార్త(పాలు) చేయుటకు ప్రభువుతో శ్రమించవలెను.
- 3. ప్రమాదము: పర్వతము = ఇహలోక రాజ్యాధికారము, కొండలు = విగ్రహములు. కన్నీటి ప్రార్థన సన్నగిల్లితే పర్వతములు కొండలు ప్రమాదమని తెలిసుకోలేని స్థితిలో ఉండి వాటికి దాసులగుదురు.
- 4. జీవము: ఎదగడం ఆగిపోతే ఎండిపోవడం మొదలవుతుంది (దేవదాసు అయ్యగారు చెప్పిన సూక్తి). విశ్వాసి ఎల్లప్పుడూ జీవకళతో ఉండాలే తప్ప ప్రభువుకు దూరమై ఎండిపోకూడదు.
Supporting Verses
లూకా సువార్త 23:26. వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
27. గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
28. యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
29. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
30. అప్పుడుమామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
31. వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +