ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 38
వాక్య భాగము: Mat 27:57-61; Mark 15:42-47; Luke 23:50-56; John 19:38-42
యేసు ప్రభుని దేహము
సత్యము: యేసు ప్రభువు నూతన నిబంధన రక్తమును చిందించి, సిలువపై మరణించి, క్రీస్తుగా నిరూపింపబడెను
కృప: యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరణముద్వారా మనకు నిత్యజీవమును అనుగ్రహించెను.
ప్రార్థన: మా కోసము నిరంతరము పరమందు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్న ప్రభువా! ఈ భూమిమీద సిలువ మరణము పొంది మాకు అనుగ్రహించిన నిత్యజీవములోనికి ప్రవేశించునట్లు మీ సిలువ ధ్యానముద్వారా మాకు నూతన మనసును, విశ్వాసమును కలుగజేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
ప్రభువును ప్రేమించి దూరముగా వెంబడించుచున్న వారందరు యేసు సిలువపై మరణించిన తర్వాత ఆయన దేహము వద్దకు వచ్చిరి. ప్రభువు సిలువ మోత సమయములో కురేనీయుడైన సీమోను ఆయన శ్రమలో పాలుపంచుకొనగా, ప్రభుని దేహవిషయములో అరిమతయి యోసేపు ధైర్యము వహించెను. ప్రభువు భాప్తీస్మానంతరం మొదటిరాత్రి కనిపించిన నికోదేము మళ్ళీ ఇక్కడ కనిపించెను. యూదుల ఆచారమును కొనసాగించువారందరు ప్రభువు మరణమైన తర్వాత చాలా శ్రద్ధ వహించిరి.
ఈ రోజు మన మనసును చావువైపుకాక జీవమువైపు ఏకీభవించుట మంచిది. ఇక్కడ రెండు అనుభవములు కనబడుచున్నవి.
- 1. యేసుక్రీస్తు నోటనుండి వచ్చు ప్రతీ మాట జీవమని నమ్మి సిలువపై పలికిన వాటిని భద్రపరచుకొన్న భక్తులు (జీవమునకు దారి)
- 2. ప్రభువు మరణమైన తర్వాత ఎంతైనా ఖర్చుపెట్టుగల ఆయన అభిమానులు (సారములేని భక్తి). ఇది కూడ ప్రభువు కోసము చేసే పనే, కావలసినదే. కాని ఇదే చాలా ప్రాముఖ్యమైనది అనినమ్ముట నిష్ప్రయోజనము.
గమనిక 1: ప్రభువుకు నెళవైన వారందరు, ఆయనకు బహు దగ్గరి ఆప్తులందరు అక్కడ ఉండి విలపించిరి. కొంతమంది అరోపించుచున్నట్లు ప్రభువు చనిపోలేదు, వేరే ఎవరో చనిపోయారు అనే వాదన తప్పు. ప్రభువు భక్తులు ఆయనను బాగుగా ఎరుగుదురు.
గమనిక 2: సిలువధ్యాములు, 40రోజుల ఉపవాసము, పాద శుద్ధి, ఈష్టరు, సమాధుల దగ్గర ఆరాధన ఇవన్నీ వ్యర్ధమైన ఆచారములు అని వీటిని చేయుచున్న వారిని ద్వేషించు భక్తులు గలరు. అయితే ఈ సిలువ ధ్యానములు చేయుచున్న వారు వాక్యమును లోతుగా ధ్యానించి ప్రభువును హత్తుకొనుచున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలు చేయుచున్న భక్తులు క్రైస్తవులనందరిని ప్రేమించి అరిమతయి యోసేపు వరుసలో సమాధుల స్థలమును వాలంటరీగా శుభ్రపరచుచున్నారు కానీ సమాధులలో దేవుడున్నాడని ఎవరూ నమ్మరు. ఈ ప్రదేశములో క్రైస్తవులు జీవించిరి అనుటకు ఒక ఆధారము క్రైస్తవ సమాధులు.
Supporting Verses
యోహాను సువార్త 19:38. అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను.
39. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.
40. అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.
41. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
42. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +