ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 39
వాక్య భాగము: Meditation on 7 words on cross
Good Friday
- Reading material:
- ఏడు మాటలు పలికినావా! - 7 మాటల ధ్యానకీర్తన
-
దేవదాసు అయ్యగారి ప్రసంగములు:
అయ్యగారి 6 ప్రసంగములు
సిలువ విలువ - ధ్యాన కలువ నుండి 7 మాటలపై అయ్యగారి ప్రసంగములు:
1వ మాట, 2వ మాట, 3, 4వ మాటలు, 5వ మాట, 6, 7వ మాటలు - 7 మాటలు 7 ముఖ్యాంశములు - Book by రెవ. డా. బి. ఇమ్మానుయేలు
ప్రకటనలో ప్రత్యక్షపరచబడిన 7 ఆత్మలు, 7 అంతస్థులు, 7 లోకములు, 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 తెలుళ్ళ పాత్రలు, ప్రభువు అందించిన నూతన యెరూషలేముల జ్ఞానము క్రైస్తవుని మదిలో ముద్రించబడకపోతే, ఈ లోకంలో విశ్వాసి నిజమైన ఆనందమును పొందలేడు.
సిలువ మీదనున్న ప్రభువు పరదైసు నుండి పాతాళమునకు వెళ్ళి, పాతనిబంధన భక్తులను రక్షించి పరలోక సింహాసనము వరకు చేసిన ఎమెర్జన్సీ ప్రయాణములో పలికిన ఆ ఏడుమాటలకు ప్రత్యక్ష సాక్ష్య నెరవేర్పే అక్కడున్న 1.ప్రజలు 2.దొంగకు పరదైసు 3.మరియ యోహానులు 4. దేవుని మహిమ ప్రభావలేమి 5.దాహము 6.సమాప్తము 7. ఆత్మకు తన పూర్వస్థితి. ఆ అతితక్కువ సమయములో ప్రభువు చేసిన భౌతిక ప్రయాణము మన కాలప్రయాణములో ఇంతకాలము జరుగుచున్నది.
1 వ మాట - దైవాధికారముతో ప్రజలందరికి అందించిన సార్వత్రిక కృప. (పునరుత్ధానము నుండి రేప్చర్ వరకు)
2 వ మాట - మారుమనస్సు పొందుచున్న సంఘములకు ఇచ్చుచున్న బహుమతి (పెంతెకొస్తు దినము నుండి రెండవ రాకడ వరకు)
3 వ మాట - సార్వత్రిక సంఘము వధువు సంఘమును కనుటలో గల ఆదరణ, మారుమనస్సు పొందక 7 సంఘములలో మిగిలిన వారికి కాపుదల. (ముద్రల నుండి 7 బూరలవరకు)
4 వ మాట - పరదైసునుండి బయలుదేరి పాతాళములో ఉన్న వారిని రక్షించుటకు మద్యలో నున్న అగాధములోనుండి అన్యునిగా పడిన వేదన( తెలుళ్ళ పాత్రలకాలములోని సామాన్య ప్రజలతోపాటు క్రైస్తవుల వేధన).
5 వ మాట - పాతాళమునకు రాకడ, పాతాళములో ప్రభువుపొందిన వేదన, అంతవేదనను భరించి రక్షణ కార్యమును ముగించిన ప్రభువు(అంతిక్రీస్తు పరిపాలన).
6 వ మాట - సాతానుపై ప్రభువు విజయము, యుగాంతమువరకు సంఘములకు ప్రభువు ఇచ్చుచున్న విజయమునకు ముద్ర (1000 యేండ్ల పరిపాలన గోగు మాగోగు యుద్దము, అంత్య తీర్పు)
7 వ మాట - విజయోత్సవముతో దైవ సన్నిదిలో అడుగు పెట్టిన ప్రభువు ఆత్మ(నిత్యజీవము).
పునరుత్ఠానము : మహిమ శరీరము. ప్రభువుకోసము ప్రాణమిచ్చిన వారమైతే, అంతమువరకు ఆయనతో ఉంటే; 1000 యేండ్ల కాలములో మనము పొందబోయే మహిమ స్థితి.
Supporting Verses
-
Luke 23:34: Father, forgive them, for they know not what they do.
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము -
Luke 23:43: Truly, I say to you, today you will be with me in paradise.
నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను -
John 19:26–27: Woman, behold your son. Son, behold your mother.
అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. -
Matthew 27:46 & Mark 15:34 My God, My God, why have you forsaken me?
ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. -
John 19:28: I thirst.
నేను దప్పిగొను చున్నాననెను. -
John 19:30: It is finished. (From the Greek "Tetelestai" which is also translated "It is accomplished", or "It is complete".)
సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. -
Luke 23:46: Father, into thy hands I commit my spirit.
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
Click here to Like this page
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +