Day 4 : సత్యవాక్య విస్తరణ
వాక్య భాగము : Mat 21:17; Mark 11:19; John 12:20-50
ధ్యానసారాంశము:
సత్యము: యేసుక్రీస్తు ప్రభువు తన స్వరూపము(దైవలక్షణములు) మానవులలో బహుగా ఫలించుటకు శిలువ మరణమాయెను.
కృప: మన నిమిత్తము దైవకుమారుడు ప్రాణముపెట్టి, మనలను ఫలించు విత్తనములుగా చేసెను.
ప్రార్థన : క్రీస్తు ప్రభువా, మా కోసము మహిమ సింహాసనమును త్యజించి నరావతారునిగా ఈ భూమిమీద శ్రమలు పొందిన దేవా! నీకు మా హృదయమును సమర్పించుకొనుచున్నాము. మా హృదయమును శుద్ధీకరించుమని, మీ సేవలో మేము నాటబడిన విత్తనముగా చేయుమని మిక్కిలి వినయముతో బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
సంఘములో కాలక్రమేణా కొన్ని సత్ఫలిత ఆచారములు స్థిరపడును. ఉదా: 15వ శతాబ్దమునుండి క్రైస్తవులు తప్పక చదువుకోవలెనను ఆచారమును చర్చి పిల్లలకు నేర్పేవారు.
విశ్వాసి జీవితములో సత్యము(దేవుని ప్రణాళిక) అను విత్తనమునుండి కలిగిన మంచి ఫలములు = మనకు కలిగిన అధికారము, పేరు ప్రఖ్యాతలు.
సత్యమైయున్న యేసును చూచుటకు గ్రీసు దేశమునుండి వచ్చినవారితో ప్రభువు ఈ మాట చెప్పెను. ప్రభువు ముందు సిలువ ఉన్నది. గ్రీసు దేశస్తులు ప్రభువు మహిమను చూచుటకు రాగా, వారిని ప్రభువు శ్రమను చూచుటకు సిద్ధపరిచెను. ముందు శ్రమ ఉన్నను తర్వాత అంతకుమించి మహిమ ఉన్నది. శ్రమలో విశ్వాసి పడిపోకుండు నిమిత్తము ఆయన సన్నిధిలో "శ్రమ, వెనువెంటనే వచ్చు మహిమ"ను కనబర్చును.
సత్యాచార ఫలము అనగా "సత్యమును(ప్రభువును) అనుసరించుట" అను ఒక జీవనవిధానమును ఆచారముగా పెట్టుకొనుట వలన వచ్చు భౌతిక ఆశీర్వాదము. ఈ భౌతిక ఆశీర్వాదములను విశ్వాసి మృతమైనదిగా ఎంచి, ప్రభువును గట్టిగా పట్టుకొనుట వలన భూమిలో పడిన గింజ మొలకెత్తి మహా వృక్షమగునట్లు మన ఆశీర్వాదము ప్రభువు శ్రమలో దాచబడినది అను సత్యమును గ్రహించుటే ఈ రోజు పాఠ్యసారాంశము.
పరలోకములో కనిపించబోవు ప్రతీ విశ్వాసికి ఈ లోకములో ఎదురయ్యే అనుభవము - "ఏదో ఒక సమయములో ప్రభువు కాడిని మోయవలసిన అవకాశము వచ్చును".
కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు - హెబ్రీ 12.
దేవుని చిత్తము నెరవేర్చుచు శిక్షలో పాలుపొంది శ్రమను అనుభవిస్తున్న వారు గుర్తించవలసిన విషయము - వారి అభివృద్ధి, విస్తరణ, ఫలింపు మొలకెత్తినది. విశ్వాసి శ్రమను చూచిన దుర్బీజులగుదురు. ఘోర శ్రమలను పక్కనపెట్టి ప్రభువును చూచిన యెడల ఆయన కాంతి ఆ విత్తనమును బహుగా ఫలింపజేయును.
సంపూర్ణ విశ్వాస హృదయము గలవారు పొందు శ్రమలు:
దేవుడు నా గుండె జబ్బును తీసివేసినాడని ఒక విశ్వాసి సాక్ష్యము చెప్పెను. ప్రభువు మన పాపమును, వ్యాధిని, అతిక్రమములను సిలువపై భరించెను కావున మన శరీరవయములకు దైవిక స్వస్థత కలుగుచున్నది. అయితే ఈ రోజు పాఠము శరీరవయములను గూర్చి కాదు; దేవుడు మన శరీరములో అమర్చిన హృదయమనే అత్మీయ అవయము మారుమనసు పొంది, సంపూర్ణసమర్పణతో దైవచిత్తానుసారముగా నడచుకొను విశ్వాసి త్యాగమును గూర్చి ధ్యానించవలెను.
1వ మృతి: సాదారణముగా హృదయము మన పరిసర ప్రభావముతోనో, ఫ్రెండ్స్ తోనో, పగవారితోనో, టీచర్స్ తోనో, తలిదండ్రులతోనొ, బిజినెస్ తోనో, భాగాస్వామితోనో ఏదో ఈలోకసంబంధమైన ఆకర్షణలతో నిండిపోయి ఉంటుంది. వాటిని వదిలి ప్రభువు సిలువ సమీపమునకు వచ్చిన మనకు దేవుడు మహా మహిమగల ఫలములను సిద్ధపర్చెను. వాటిని శాశ్వతముగా స్వతంత్రించుకొనుటకు చిన్ని సూత్రము ఏదనగా, మోసకరమైన, పాప నైజము కలిగిన మన హృదయమును పాతిపెట్టి, ప్రభువు మనకిచ్చు నూతన హృయమును అమర్చుకొంటే అందులో అపరిమితమైన ఆత్మ నివసించుటకు అనుకూలమున్నది గనుక ప్రభువుతో మనకు సహవాసము లభించును.
ప్రభువు అనుగ్రహించిన నూతన హృదయమును పరిశుద్ధ వాక్యముతో నిర్మించుకొనుట దేవుడు మనకిచ్చిన భాగ్యమైన బాధ్యతయైయున్నది. ఒకని హృదయము నిండినదానిని బట్టి వాని జీవితముండును. మనము ఏస్థితిలో నుండి పుట్టినను ప్రభువు తన సిలువ మరణముద్వారా జీవాత్మయైన సత్యవాక్కును మనకు అనుగ్రహించెను. ఈ వాక్యము మన హృదయములో నివసించినయెడల జీవితము తేజరిల్లును. ఇది సాధారణ క్రైస్తవుని అనుభవము.
2వ మృతి: ఇదే నేటి ధ్యానము
మొదటిమృతి మనిషిని పాపస్థితి నుండి పరలోకమువరకు తీసికొని వెళ్ళును. ఈ నూతన విశ్వాసి ప్రార్థనలో ఎదిగి చివరికి దైవలక్షములను ధరించిన గట్టి విత్తనముగా (ప్రభువు ఉదహరించిన గోదుమ గింజగా) మార్చబడును. ఈ విత్తనమును అనేకమందిలో మొలిపించే మిషనులో ఉన్న శ్రమయే ఈ రెండవ మృతి.
కావున సత్యమును, ప్రేమను, జీవమును, పరిశుద్ధతను కనబరుచుటకు విశ్వాసి పరిత్యజించే శరీర సుఖములు, జీవపు డంబములు, అధికార బింకములు మొదలగునవి మృతిచెందును. ప్రభువు సిలువ సమయములో అనేక దేశములనుండి అధికారులు ఉన్నతమైనవారు ఆయనను కొనియాడుటకు వచ్చిరి గాని, ప్రభువు వారికి సత్యమును భోధించి సిలువమరణమునకు ఆయత్తమాయెను.
ఈ స్థితిలో ప్రభువు అనేక అద్భుత కార్యములు జరిగించును, మేలుకరమైన నూతన ప్రపంచముల సృష్టి జరుగును. ఈ సిలువ శ్రమ సృష్టికర్తల శ్రమ.
అనేక ఆశీర్వాదములు/సదుపాయములు విశ్వాసి పొందుట, సత్యములో నిలుచుటవలన సమస్తమును కోల్పోవుట, సత్యము ప్రభలమై అనేక రెట్లుగా మరలా అశీర్వదింపబడుట మొదలగు అనుభవములు ఈ శిక్షణలో ఉండును.
దేవునిసంకల్పములో వున్న సత్యమును నిరూపించుటకు మనము పొందుచున్న ఈ శ్రమ, పరలోకములో మనలను మహిమ సింహాసనమువరకు తీసికొనివెళ్ళును. అట్టి ధన్యత మనకు ప్రభువు దయచేయును గాక! ఆమేన్.
Supporting verses
- యోహాను 12 వ అద్యాయము
- గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
- తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.
- ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
- తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.
హెబ్రీయులకు 12:
5. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
6. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
7. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
8. కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
Social Presence
Share your thoughts and suggestions
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet -
Recommend this website on Google +