ప్రభువైన యేసు క్రీస్తు శ్రమల ధ్యానము : Day 40

వాక్య భాగము: మత్తయి సువార్త 27:59-66; మార్కు 15:43-46; లూకా 23:50-56; యోహాను 19:41,42.

కావలి గల సమాధిలో ప్రభువైన క్రీస్తు. Holy Saturday

సత్యము: దేవదూతల కావలిలో ప్రభువు సమాధి
కృప: ఆత్మజనితులకు దేవదూతల కాపుదలను అనుగ్రహించిన ప్రభువు

ప్రార్థన: జీవాధిపతివైన ప్రభువా! మీ జీవమును మాకిచ్చుటకు మీ ప్రాణముపెట్టి, సమాధిలో ఉంచబడి తిరిగిలేచి మాకు నిత్యజీవమును అనుగ్రహించినందుకు మీకు అనేక వందనములు. మా ఆత్మ నశించిపోకుండునట్లు మీ జీవమును మాకు ధారబోయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ప్రభువు ఇచ్చిన అధికారము వలన కలిగిన ఘనతతో దేవునియెడల కృతజ్ఞత లేనివారమైతే, కన్నులు మూయబడి జీవితము అంధకారములో నెట్టివేయబడును. ప్రధానయాజకులు పరిసయ్యులు అదే అంధకారస్థితిలో ఉండి ప్రభువు తిరిగి మూడవ దినమున లేస్తానని చెప్పిన మాటను విన్నారుకాని నమ్మలేదు. అయితే సమాధిలోని ఒక వ్యక్తి తిరిగి లేస్తాడేమో అని సైనికులను కాపలా పెట్టిన ఏకైక చరిత్ర యేసుప్రభువుది మాత్రమే.

యాజకులు, పిలాతు; యేసుక్రీస్తు ఉన్న సమాధిని వారి సైనికులు కాపలా కాస్తున్నారని తలంచుచున్నారు కాని ప్రభువు సమాధి, దానిని కాపలా కాయువారితో సహా దేవదూతల కావలిలో ఉన్నారని వారికి తెలియదు. ప్రభువు తన సేవకులైన దూతల కావలిలో ఉన్నారు కాబట్టి ఎవరును ఆయన దేహమును ఎత్తుకొని పోలేకపోయిరి. రూపాంతరసమయములో ప్రభువు పునరుత్ధానము గూర్చి చర్చించిన పరలోకపెద్దలు, ప్రధాన దూతలు ప్రభువు పునరుత్ధానము కొరకు అక్కడ ఎదురుచూచుచుండిరి. ప్రభువు సమాధిలో లేచినవెంటనే దూతల మహిమ కావలివారికి ప్రత్యక్షపరచబడెను.

అధికారుల అంతరంగ భయము: "మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి". ఒక వేళ ప్రభువు తిరిగిలేస్తే ఇక మా పదవి సమాధి అయిపోయినట్టే అని ఆ యాజకుల భయము. యాజకులు శిష్యులకు భయపడిరి. చివరికి శిష్యులు మన ప్రధానయాజకుడైన దేవునికి నిజమైన యాజకులగాను, ప్రభువులగాను అభిషేకించబడిరి.

నాస్థికులు ప్రభువును శిష్యులే ఎత్తుకొనిపోయి యేసు తిరిగిలేచినాడని ప్రచారం చేసారని, వారి స్వలాభము వారు పొందిన ఘనత, హోదా అని చాలామంది రీసెర్చ్‌లను క్వోట్‌చేసి వాదిస్తారు. ఒకవేళ వారే యేసును ఎత్తుకొనిపోయివుంటే అంత మహిమ, ఘనత, శక్తిప్రభావములు సంపాధించిన శిష్యులు మరణమునకు ఎదురెళ్ళి హతసాక్షులు అవ్వరు. ప్రభువుని తెలిసుకొన్నవారు ఇప్పటికీ త్యాగమూర్తులుగా, ఇతరులకు సహాయముచేయువారుగా ఉన్నారు.


ప్రభువా! మా శ్రమలవలన కలిగిన నిశ్శబ్ద కాలములో మీదూతల కాపుదలలో మమ్మును ఉంచుమని, ఏ అంధకారశక్తి మమ్మును ముట్టకుండునట్లు కృపను దయచేయుమని. మా శ్రమలలో బహుగా ఆధరించబడుటకు మీ ఆత్మను పొందుకొను రూపాంతరము మాకు ముందుగా దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

ఈ 40రోజుల యేసుక్రీస్తు శ్రమల ధ్యానములో ప్రభువును ఆరాధించిన ప్రతీ ఒక్కరిని దేవుడు ఆధరించి మిక్కిలి మేలుకరమైన జీవితమును దయచేయునుగాక! ఆమేన్.

Supporting Verses

మత్తయి సువార్త 27:
59. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
60. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
61. మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి.
62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి
63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడుమూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.
64. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయిఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.
65. అందుకు పిలాతుకావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.
66. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.

Click here to Like this page Facebook G+ Twitter click to collapse contents

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +