Day 5: కొండను కదల్చగల విశ్వాసము

వాక్య భాగము : Mat 21:20-22; Mark 11:20-25;

ధ్యానసారాంశము:
సత్యము: ఆకాశము క్రింద వున్న సమస్తము దేవుని నియంత్రణలోనే ఉన్నది.
కృప: పనికిరాని ఆచారములను పెరికివేయుటకు ప్రభువు విశ్వాసికి అధికారమిచ్చెను.


Faith

లెంటులో రెండవ దిన ధ్యానములో "ప్రభువు మనకు రెండంచుల విశ్వాస ఖఢ్గమును దయచేసినాడని; సృష్టించుటకు నిర్మించుటకు విశ్వాసము ఎంత అవసరమో, ఆలాగే ఫలింపని ప్రతీ దానిని(ఆచారములను మాత్రమే) పెరికివేయుటకు/తొలగించుటకు అంతే విశ్వాసము అవసరము" అని నేర్చుకొన్నాము.

పనికిరాని హానికరమైన మతాచారములను పెంచిపోషిస్తే అవి మానవ మనుగడకు అడ్డంకి పర్వతములుగా ఎదుగుతాయి. వీటిని తొలగించుట ఏ ఒక్కరితరము కాదు గాని కేవలము విశ్వాసికి మాత్రమే సాధ్యము. దేవుడు మనిషికి ఇచ్చే అధికారము, ఆయుధము ఆయనిచ్చు విశ్వాసమే.

సమస్తమును దేవుని నియంత్రణలో జరుగుచున్నదనే విశ్వాసముతో ముందుకు కొనసాగుటయే సమాధానకరమైన జీవితము. విశ్వాసముతో ప్రార్ధించి, ప్రకటించుట మనవంతు, పని చేయుట ప్రభువు వంతు.

దేవుడు విశ్వాసులను ఆధరించును గాక!


ఇది శిష్యులకు మాత్రమే చెప్పిన వర్తమానము. శిష్యులు అనగా ప్రభువు సిలువ శ్రమలలో పాలుపొందినవారు. ఇక్కడ శిష్యులకు ఒక ప్రత్యేకమైన విశ్వాసమును అనుగ్రహించెను. కదిలింపబడని దురధికార, దుర్వ్యాపార సామ్రాజ్యములను పెకలించగల వాక్కును అనుగ్రహించెను.

కొండ: ఉన్నత స్థలము, ఆరాధన. రెండు రకములు 1. సీనాయి = అమోరీయుల(ఆచార పాప) అధికారము, 2. సీయోను = సువార్త, దైవ రాజ్యము.

పర్వతము: ప్రభుత్వము, అధికారము

సముద్రము: వర్తకము, వ్యాపారము. కనానీయుల ప్రదేశము.

ఇది రెండవ బూర సమయమునుండి సంపూర్ణముగా జరుగును. భూలోక ప్రభుత్వములన్నియు మహాబబులోను వర్తక సామ్రాజ్యముతో పాటు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కూలిపోవును.

వివరము పెద్దది కాబట్టి, సారాంశమేమనగా: శిష్యుల విశ్వాస ప్రార్థన ధీర్ఘకాల బంధకములను కదిలించి విశ్వాసికి స్వాతంత్ర్యమును, సంతోషమును ఇచ్చును.

దేవుని రాజ్యము మతాచారులయొద్దనుండి తొలగింపబడి, ఫలించు వారికివ్వబడును.

Supporting Verses

    మార్కు సువార్త 11
  1. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.
  2. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనిబోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
  3. అందుకు యేసు వారితో ఇట్లనెనుమీరు దేవునియందు విశ్వాసముంచుడి.
  4. ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  5. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
  6. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.
  7. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.


విశ్వాసము అవసరమైన స్థితులు

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల