Day 6: క్రీస్తే సర్వాధికారి

వాక్య భాగము : Mat 21:23, 22:1-14; Mark 11:27;12:1-12; Luke 20:1-19;

ధ్యానసారాంశము:
సత్యము: సమస్తమును క్రీస్తుమూలముగా కలిగెను. సమస్త అధికారము క్రీస్తుదే.
కృప: సర్వాధికారియైన ప్రభువు రక్షణలో మనము పాలిభాగస్తులగుట.


Faith

ప్రార్థన: సర్వాధికారియైన ప్రభువా! మాకు అధికారమునిచ్చుటకు ఈ భూమిపై వెలసి, మా ఋణముల కొరకు మహాశ్రమ పొందినందుకు మీకే కృతాజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రీ! ఆమేన్.


సర్వాధికారమునకు ఒక విచిత్ర లక్షణమున్నది. ఇది వేరొకరి అధికారము మీద ఆధారపడదు. దాచిన దాగదు, చంపిన చావదు. కావున సర్వాధికారియైన యేసుప్రభునకు తలవంచి నమస్కరించుటకంటే వేరొక మార్గము లేదు. లోకములోని అధికారులు ప్రభువువద్దకు వచ్చి, ఆయన సర్వాధికారము వెనుక వారుగాని మరి యే లోకాధికారముగాని లేవని నిరూపించినారు.

బైబిలు మొత్తంలో దేవుడు అను పదమే లేని ఏకైక గ్రంథము ఎస్తేరు గ్రంథము. మొర్ధుకై అనువాడు ఒక యూదా మత స్థాపకుడు. "సహాయము వేరొక చోటనుండి వచ్చును" అని మొర్ధుకై చెప్పినపుడు ఎస్తేరు మదిలో దేవుని యొద్దనుండి సహాయము వచ్చును, ఆ సహాయము చేయుటకు తాను బలియైపోయినను సంతోషమే అని అదే కాలములో వున్న దానియేలు వరుసలో యేసు ప్రభువునకు సాదృశ్యముగా నిలిచెను. మొర్ధుకైకి దైవ స్పృహ లేనందున స్వంత ఇష్టము వచ్చినట్లు అధికార దుర్వినియోగమునకు తెరతీసెను. చివరికి ఆ యూదామత పెద్దలు ప్రభువును ఆయన సర్వాధికారమును గుర్తించలేనివారై ఆయనను సిలువకు అప్పగించిరి.

శాస్త్రులు, ప్రధాన యాజకులు ప్రభువును సిలువవేసిరి గాని, దేవుడు సర్వాధికారియై తన రక్తము ద్వారా నూతన నిభంధనను స్థిరపరచి దైవరాజ్యమును స్థాపించెను. ఈ లోకములోని ప్రభుత్వములన్నీ దైవరాజ్యలోనుండి నిర్మితమైనవే. అయితే రాజకీయాధికారము ప్రభుత్వాధికారమును అణచివేయునప్పుడు ప్రభువు తన అధికారముతో వచ్చును.

విశ్వాసులు దైవరాజ్యమును నిర్మించుటలోగల శ్రమను ఆనందముతో అంగీకరించుటయే దేవునితో పనిచేయుట. దేవుడు అట్టి అధికారమును మనకందరకు దయచేయును గాక!

Supporting verses

లూకా సువార్త 20
  1. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి
  2. నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి.
  3. అందుకాయననేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి.
  4. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా
  5. వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
  6. మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని
  7. అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి.
  8. అందుకు యేసుఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను.
  9. అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.
  10. పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి.
  11. మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.
  12. మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి.
  13. అప్పుడా ద్రాక్షతోట యజమానుడునేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెద రను కొనెను.
  14. అయినను ఆ కాపులు అతనిని చూచిఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని
  15. అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?
  16. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.
  17. ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?
  18. ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.
  19. ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.

Comments Facebook G+ Twitter

Thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల