Day 8: దేవుడు సజీవులకే దేవుడు గాని మృతులకు కాదు

వాక్య భాగము : Mat 22:23-33; Mark 12:18-27; Luke 20:27-33, 44;

సత్యము: దహించు అగ్నికి నిలబడగలవానికి మాత్రమే ఆయన దేవుడు
కృప: ఆయనే మనలను ప్రేమించి మనకు రక్షణ దయచేయుట

ప్రార్థన: జీవమైయున్న ప్రభువా! నీ జీవమును మాకిచ్చుటకు మహాశ్రమలను పొంది మమ్ములను బ్రతికించిన దేవా! మీకు వందనములు. మాలో నీ జీవమునింపి మాకు నిత్యమైన దేవుడవైనందుకు మీకు స్తుతులు చెల్లించుచున్నాము తండ్రీ! ఆమేన్.

మృతులు ఆయనను అంగీకరించరు కావున వారికి తీర్పు తీర్చబడియున్నది. కావున భూమిమీద రెండు వర్గములున్నవి. సజీవుల గుంపు, మృతుల గుంపు. సజీవులు పరలోకములో ప్రభువుతో ఆనందించెదరు. మృతులు పాతాళములో ఏడ్చుచు, పండ్లుకొరుకుచు దేవుని ఎన్నడును చేరకుందురు.


మరణమునుండి జీవములోనికి దాటుటకు సంకేతమేదనగా "నేనేమి చేయగలను??" అనే నిరాశనుండి "క్రీస్తులో నేనేమైనా చేయగలను!!" అను విశ్వాసమును పొందుటయే.

ప్రభువును ఆనుకొని ఆయనతో నడచుట సజీవుల లెక్కలోనికి వచ్చుట. ప్రభువును ఎరగని వారికి ఆయన అదృశ్యుడు. ఉదా: ఇక్కడ దిగువ Click here for Image ని క్లిక్ చేస్తేనే ఇక్కడున్న ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఉదాహరణగుండా వెళ్ళనివారికి ఇక్కడ ఇమేజ్ లేనట్లే. lent8

Click here for Image

    మత్తయి సువార్త 22 :
  1. పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దిన మున ఆయనయొద్దకు వచ్చి
  2. ​బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;
  3. మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
  4. రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.
  5. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
  6. పునరుత్థాన మందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.
  7. అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
  8. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.
  9. మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవు డను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నా నని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?
  10. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.
  11. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి.

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల