Day 9: యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన పరమ ఆజ్ఞ:దైవప్రేమ

వాక్య భాగము : Mat 22:34-40; Mark 12:28-34; Luke 21:37; John 15: 9-14

సత్యము: ప్రభువే అనాది నుండి మనలను తండ్రిలా ప్రేమించుచు మన రక్షణకొరకు సిలువ మరణము పొందుట
కృప: తండ్రియైన ప్రభువే ముందుగా మనలను ప్రేమించి మనలను చేర్చుకొనుట.

ప్రార్థన: ప్రభువైన తండ్రీ! మమ్ములను మిక్కిలి ప్రేమించి ఈ భూమిమీద అవతరించి, మా కొరకు ప్రాణము పెట్టిన దేవా! సిలువపై మీరు చూపిన ప్రేమకై అనేక వందనములు సమర్పించుచున్నాము. ఈ రోజు మీ ఆజ్ఞప్రకారము సహోదరులను ప్రేమించు హృదయమును మాకు దయచేయుమని యేసు నామమును బట్టి సమర్పించుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.


lent9

ఈ ప్రశ్న ప్రభువుకు సంతోషము కలిగించే ప్రశ్న. అడగవలసిన ప్రశ్న, ప్రభువు సమాధానము చెప్పవలసిన ప్రశ్న. తాను ఏమైయున్నాడో(ప్రేమ) తెలియజేయుటకు అవసరమైన ప్రశ్న. ఈ భూమిమీద మనందరి రక్షణకై నూతన నిభంధన నిర్మాణముకొరకు, మనకు బదులుగా మన ప్రభువే ప్రాణము తన పెట్టెను. దీనిలో అమూల్యమైన దైవప్రేమ వున్నది.

దేవదాసు అయ్యగారి సిలువ మాట: పాపి చేయి పరిశుద్ధతలో పెట్టి ప్రేమ(యేసుప్రభువు) బలియైనది.

ప్రభువు మనలను పరిశుద్ధులుగా చేసి ఆయనకు స్నేహితులుగా నిలబెట్టుటకు ఆ దైవ ప్రేమ ప్రయాసపడినది. చివరికి ప్రభువు మహాశ్రమపొంది మనకు అప్పగించిన కార్యమేమనగా ఆయనయందు భయభక్తులు కలిగి ప్రభువు ప్రేమను విశ్వాసులందరికి పరిచయం చేయుచు, దానిలో నిలిచియుండి ప్రభువునకు స్నేహితులైయుండవలెను అనునది ఇప్పుడు ప్రాముఖ్యమైన ఆజ్ఞయైనది. కావున ఎంత కాంపిటేషన్ ఉన్న, కాన్సెప్ట్ తారతమ్యమున్నా గాని విశ్వాసి యొక్క దైవభక్తికి సహోదరప్రేమ అతి ముఖ్యమైన కొలమానము.

రోమీయులకు 12: 9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

ఇంతకు ముందు ప్రభువును అడిగిన ప్రశ్నలు చెడుతనమును గూర్చి అయితే ఈ ప్రశ్న మంచిని హత్తుకొను ప్రశ్న. కావున దైవప్రేమలో మంచిని చేరి, దానినే అనుసరించి జీవించు కృప వున్నది. మంచినిగూర్చి కించిత్తైన వంచన దారి వైపు ఆలోచింపక దైవ ప్రేమయందు కొనసాగుదము.

దేవుడు ఆ దైవప్రేమను ఈరోజు సంఘముల మద్య పుట్టించును గాక! ఆమేన్.

    మత్తయి సువార్త 22 :
  1. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.
  2. వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు
  3. బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.
  4. అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే.
  5. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
  6. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
  7. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను.
    యోహాను సువార్త 15 :
  1. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
  2. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.
  3. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.
  4. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
  5. తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
  6. నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.

Comments Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +

dove Maranatha! Do not Hate any Nation, Denomination, Religion or Person * Listen to Lord Jesus Christ * దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము - తధాస్థు. iiBM బైబిలుమిషను పాఠశాల