1. ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషింపరాదు, దూషింపరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలిసికొనవలెను
  2. దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా! అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము. తధాస్తు!
  3. ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తే ఉపకారం పొందుతారు
  4. దైవ చిత్తానుసారమైన జీవితానికి మనం తీసికొనే నిర్ణయం ముఖ్యం
  5. బైబిలు మిషను సేవకుడు నింపబడాలి, సంఘాన్ని నింపాలి
  6. భయం లేని భక్తి పంట లేని భూమితో సమానం
  7. మనిషి చనిపొతే అరిగిపోయిన చెప్పుతో సమానం
  8. సందేహముల చేత విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోతున్నారు
  9. క్రైస్తవుడు వీపు చూపకూడదు, చూపినట్లయితే పిరికి వారి క్రింద లెక్క
  10. బోధ బహు ఇంపు, బ్రతుకు బహు కంపు
  11. దినదినము మనము ప్రార్థనలో చల్లారితే, నిమిష నిమిషానికి మనము సైతానుకు వశమౌతాము
  12. అర్థం లేని బోధ వ్యర్ధం
  13. భర్తకు జాడింపు, భక్తునుకి పొడిగింపు, కూరకు తాళింపు ఉండాలి
  14. నలిగిన ఎద్దు ఎగరదు, వంగదు, పండుకొనదు, ఆగదు
  15. నదిలో మునగాలి, గదిలో ఎదగాలి
  16. ప్రభువు మనకు హక్కులు ఇస్తే పాపము చేసి చిక్కులు తెచ్చుకొన్నాము
  17. శ్రమలో ఆడుకోవాలి, పాడుకోవాలి, వేడుకోవాలి
  18. వేదన వచ్చినప్పుడు జవాబు వస్తుంది
  19. బహుమానం ఆయన ఇవ్వాలి అనుకొన్నప్పుడు ఇస్తారు. ఉ. మొర్ధుకై
  20. అనుభవాలు అంతస్థును పెంచుతాయి
  21. నారుమడికి నీరుకావాలి
  22. మనం చదివేది బైబిలు, అన్యులు చదివేది మనలను
  23. లోకం తెలియ పాపం చేస్తుంది, క్రైస్తవులు తెలిసి పాపం చేస్తున్నారు
  24. పాపం చేస్తూ ఉపవాసం ఉన్నా ఫలితం ఉండదు
  25. పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని జయించినపుడే ఎత్తబడగలము
  26. అగ్నికి ఈగలు ముసరవు
  27. బైబిలు మిషను సేవకులు కూలివాని వలే పనిచేయాలి
  28. అదును, పదును చూసి విత్తనం విత్తాలి
  29. ఏదో ఒక రోజున ప్రభువు ఫలాల కొరకు నీవైపు చూస్తారు
  30. సణుగుడు, గొణుగుడు, మణుగుడు
  31. గురువును వెంబడిస్తే గురువులవుతారు
  32. గురువును వెంబడిస్తే గుణవంతులవుతారు
  33. భక్తులు స్తుతి చేస్తారు, నామకార్ధ భక్తులు ప్రార్థన చేస్తారు
  34. దైవభక్తి వలన కలిమి కలుగదు, శత్రువు వలన ధనము తొలగదు
  35. అన్నికూటాలకు సాతను రాగలడు గాని శిలువకూటానికి రాడు, ఎందుకనగా వాని తల చితుకకొట్టబడింది శిలువ దగ్గరే
  36. భూమి, సూర్యచంద్రులు నశించినా పరవాలేదు, నీవు పోతే నాకు వేదన అన్నారు
  37. సువార్తికుడు సువార్త చేయాలికాని దుర్వార్త చేయకూడదు. మన బలహీనతలు సంఘానికి తెలియనవసరము లేదు
  38. నీ ధనాన్ని నీవు పరలోకానికి తీసికొని వెళ్ళలేవు గాని నీకంటే ముందుగా అక్కడకు పంపవచ్చును
  39. పొదుపులో ధనము పొదుగుతుంది, కానుకలో అది కలిమిగా ప్రత్యక్షమవుతుంది
  40. కూడబెట్టుటయే కలిమి కాదని, కానుక రూపము దాల్చని కనకము కలిసిరాదనియు తెలిసికొవాలి
  41. దేవునికిచ్చుటకై చాపిన చేతిని దేవుడు రిక్తముగా తిరిగి పంపడు
  42. తఫ్ఫటడుగు వేసారు తెప్పలాగ తేలారు
  43. బోధ విన్నారు కాని మనసు మార్చుకోలేదు
  44. శ్రమలు పోయిన భోగం వస్తాది, భోగం వెనుక రోగం వస్తాది
  45. రహస్య ప్రార్థన బహిరంగ బలము నిస్తుంది
  46. దేవుడు కట్టుకున్న ఆలయంలో దేవుడుండాలి, మానవుడు కట్టకున్న ఆలయంలో మానవుడు వుండాలి
  47. పాడుచేసేవారికి పాడికట్టే రాకడ
  48. పారిపోయిన పారిపోతాను గాని మారిపోను
  49. చెప్పే వాలు వుంది దాని వినే వీలులేదు
  50. ఎదగడం ఆగిపోతే ఎండిపోవడం ప్రారంభమవుతుంది
  51. గురిలేని బ్రతుకు దరిచేరని నావలాంటిది
  52. భయం లేని భక్తి అక్కరకు రాదు, అక్కరకు వచ్చినా చక్కాగా నడవదు, చక్కగా నడిచినా మేఘమెక్కదు
  53. పట్టించుకోలేదని అనుకోవద్దు సమయము వచ్చినపుడు పట్టించుకొంటారు
  54. విశ్వాసి ప్రార్థనలో ఎదిగితే లోకం రాలి పోతుంది
  55. అపవాది ఏదోవక దీపాన్ని ఆపాలని చూస్తాడు
  56. ఆయుధాలు వున్నవారిని చూసి ఆయుధాలు లేనివారు భయపడతారు
  57. శరీర నేత్రాలకు భూలోకం కనబడుతుంది, మనోనేత్రాలకు పరలోకం కనబడుతుంది
  58. పైకి ఎదగాలంటె శ్రమలు అనుభవించాలి
  59. రాకడకు ముందు క్రైస్తవులకు తిక్కపుట్టించే శ్రమలు వస్తాయి
  60. తప్పుచేస్తే శిక్ష తప్పదు, పశ్చత్తాప పడితే క్షమాపణ తప్పదు
  61. సాతాను తలంపులో శోధించి పాపంలో పడేస్తాడు
  62. తనను ఎన్ని అన్నా దేవుడు సహిస్తాడు గాని అభిషేకించు దైవజనుని అంటే ఆయన సహింపలేరు
  63. ఇత్తడికి తుప్పు పట్టదు, యేసులో తప్పులేదు
  64. ఏశావు ఏడ్చాడు గాని పశ్చాత్తాపంతో కాదు, లేదు అని ఏడ్చాడు
  65. పశ్చాత్తాపం పాపిని దేవుని వద్దకు నడిపించే ప్రక్రియ
  66. మంచి సలహాను ఎవ్వరూ తీసికోరు అలాగని ఇవ్వడం మానుకోకూడదు
  67. అవకాశానికి ప్రయత్నం తోడైనప్పుడు అదృష్టం కలిసి వస్తుంది
  68. నిజ క్రైస్తవుడు అప్పుచేయడు, అచ్చివుండడు
  69. దేవుని భయము ఏ వ్యక్తికి ఉంటుందో ఆవ్యక్తి జీవితం వర్ధిల్లుతుంది
  70. నిజమైన బలం, సంతోషం ప్రభువు పనిచేయుటలోనే ఉన్నది
  71. వెట్టిపనులు చేసినప్పుడే మన అహం అణిగిపోతుంది
  72. పాపము ఒప్పుకుంటే దొరికేది క్షమాపణ, ఒప్పుకోకపోతే కలిగేది శిక్ష
  73. విశ్వాసము లేనివాడే విగ్రహాలు చేసికుంటాడు
  74. కలహాలకు ముఖ్యకారణము గర్వము
  75. దైవసేవకుని విలువ దేవుని నెరిగిన వారికి మాత్రమే తెలుసు
  76. భక్తి బయటనుండి వచ్చేది కాదు గాని లోపలి నుండి బయటకు రావలసినది
  77. తొందరపాటు వలన అనేక పొరపాట్లు జరుగుతాయి గనుక తొందరపడకు
  78. ఊరక వచ్చేవాటికి ఎప్పుడు కక్కుర్తి పడకు, కష్టపడి సంపాదించుట నేర్చుకోవాలి
  79. శోధింపబడుట పాపము కాదు, శోధనకు లొంగుట పాపము
  80. సాతాను శోధించును – దేవుడు పరిశోధించును
  81. సాతానుది దురిద్ధేశము – దేవునిది సదుద్ధేశము
  82. నీ చెడుతనము నెప్పుడును తర్కించు చుండుము
  83. పగను సాధించుటకు ప్రయత్నించకు
  84. ప్రతి పనికి ఒక కాలము నిర్ణయించుకొనుము
  85. నీవు తలంచునది, చేయునది దేవుని కంటికి మరుగైయుండ నేరదని గ్రహించుము
  86. క్రమము తప్పక పనిచేయుము
  87. ప్రతిదియు క్రమమైన రీతిలోనే ఉపయోగించుము
  88. నీకవసరము లేని వస్తువులను చౌకగా వచ్చినను కొనకుము
  89. సమస్తమును మర్యాదగను, క్రమముగాను జరగనిమ్ము
  90. ప్రతిపనియు దాని కనుకూల కాలమందే చేయుము
  91. ఈ దినమున చేయవలసిన పని రేపటికివరకు మిగిల్చి పెట్టవద్దు
  92. ప్రతి విషయమును దీర్ఘముగా ఆలోచించి చేయుము
  93. ప్రతి వస్తువును దాని స్తలమందే ఉంచుము
  94. నీదిగాని వస్తువును తృణమైనను అంటుకొనకూడదు
  95. విశ్రంతి దినమును పరిశుద్ధపరచుటకై నిర్థారణ చేసికొనుము
  96. నిత్యము కృషి చేయువాడవై యుండుము
  97. కొండెగానిని ఎన్నడును నీ చెంతకు చేరనీయకుము
  98. కొండెములు చెప్పువాడవుగా ఉండకుము
  99. సోమరివారి తల సైతాను నివాస గృహము
  100. సొమరి చీమలయొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకొనుము
  101. వంచగాని చెంత చేరకుము
  102. సత్యము చెప్పవలసి వచ్చినప్పుడు ఎన్నడును జడియకుము
  103. ఆడిన మాట తప్పేవాడవై యుండకుము
  104. పరిశుద్ధత అనగా లోపల శుద్ధి యుండుటయే
  105. మంచి అదృష్టవంతునికి పాటుపడుటయే స్వంత జనం
  106. మంచి పుస్తకములే మన మంచి స్నేహితులు
  107. మంచి మాటను ఎవరు చెప్పినను అనుసరింపుము
  108. ఒకని కొరకు ఉపకారులును, కరుణా హృదయులునై యుండుడి
  109. కోపమును రేపు వట్టి మాటలు వచింపకుము
  110. మాట్లాడుట వెండివంటిది, మాట్లాడకుండుట బంగారము వంటిది
  111. అందరితో మాట్లాడు, కొందరినే స్నేహించుము
  112. అందరితో మర్యాదగా ప్రవర్తించుము
  113. ఇవ్వడం నేర్చుకో – తీసికోవడం కాదు
  114. ఇతరులు నీకేమి చేయవలెనని కోరుదువో అదేవారికి చేయుము
  115. ఇతరుల నేరములెన్నడును ఎన్నకుము
  116. పొరుగు మంచి ఎప్పుడును బయలు పరచు చుండుము
  117. తప్పుచేసి లేదని బొంకుట పాపము నేర్చుకొనుటే
  118. నీ స్వంత కష్టముల యందు ఓర్పు కలిగియుండుము
  119. నీకు కలిగిన తొందరలు ఇతరుల మీద పెట్టకుము
  120. నీవల్ల ప్రత్యుత్తరము కోరు వారికి మాత్రమే జవాబిమ్ము
  121. పవిత్ర బ్రతుకును మించిన గొప్ప ప్రసంగమింకొకటి లేదు
  122. వెలగల వస్త్రము కాదుగాని నీతి వస్త్రము ధరించుకొనుము
  123. నమ్మకమైన మనుష్యుడే దేవుని పరిశుద్ధ సృష్టి
  124. నమ్మకమైన పనివాడు తన యజమానికి స్నేహితుడు
  125. ప్రాణ స్నేహితుడైన వాడు ఒకడున్నను చాలు
  126. గర్వము చలి కంటే భరించరానిది
  127. వచ్చిన వాటి కంటే వచ్చునని అనుకొను కష్టములే గొప్పవి
  128. విచారము, అప్పులు ఆరోగ్యమునకు శత్రువులు
  129. బ్రతుకుటకు తినుము గాని తినుటకు బ్రతకవద్దు
  130. తప్పు చేయని వాడు ఎవరును లేరు, జ్ఞాని చేసిన తప్పు మరల చేయడు
  131. ఆదాయముకంటే అధికముగా ఖర్చుచేయువాడు దరిద్రుడే
  132. ఇతరులకు నీ దుఃఖమును దాచి సంతోషమునే బయలుపరచుము
  133. కత్తి మెడను వంచగలదు గాని హృదయమును వంచలేదు
  134. హృదయమును వంచగలిగినది హృదయమే
  135. నీ సంపాదనలో పదియవ వంతు దేవునిదని మరువకుము
  136. అభ్యుదయము దైవ కాలమని మరువవద్దు
  137. దేవుని యొద్దనుండి గొప్పసంగతులను కనిపెట్టుము
  138. దేవుని కొరకు గొప్ప సంగతులను చేయుటకు ప్రయత్నించుము
  139. జ్ఞానార్జితానుభవము కంటే విశ్వాసార్జితానుభవము గొప్పది
  140. అనుదినము ధ్యానములో ఉన్న జ్ఞానము వచ్చును
  141. దిద్దుకొనినవారే దీర్ఘాయుష్మంతులగుదురు, దిద్దుకొనని వారు దీర్ఘకాల చింతలో నుందురు
  142. మహాత్ములు చెప్పుచున్న మాటలు మౌనముగా ఆలకించుము
  143. నీవు చేసిన పాపము గాక నిన్ను దహనము చేయగలిగిన భయంకరమైన అగ్ని ఇంకొకటి గలదా?
  144. క్రీస్తు ప్రభువును విడిచి పెట్టుట కూడ దారుణమైన నరకము
  145. నీకుకలిగిన జ్ఞానము నీకు మరింత అణకువను గలిగించి నిన్ను జాగ్రత్తగా నడిపింపనిమ్ము
  146. నీవు నవ్వితే లోకమంతా నవ్వుతుంది, నీవు ఏడిస్తే మాత్రం ఒంటరిగానే ఏడ్వాల్సి ఉంటుంది
  147. సణుగుడు, గొణుగుడు అనేవి స్తుతికి విరుద్దమైనవి
  148. చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సంఘటనలకు దారి తీస్తాయి
  149. తప్పుపట్టడం అనేది నమ్మిక అనేదానికి విరుద్దమైనది
  150. ఆటంకాలు అనుభవాన్ని నేర్పుతాయి
  151. వృద్ధాప్యము శాపగ్రస్తమైనది
  152. గాఢమైన లోకజ్ఞానం కంటే నిన్ను నీవు తెలిసికొనియున్న స్వల్ప జ్ఞానం దేవుని దగ్గరకు తీసికొని వళ్ళగలదు
  153. మోకాళ్ళు నలుపెక్కితే ముఖము తెలుపెక్కును
  154. గురువు మాటవింటే గుణవంతులవుతారు, ప్రవక్త మాటవింటే ఫలిస్తారు
  155. దైవ భక్తి కలిమి వల్ల కలుగదు, శ్రమలవల్ల తొలగదు
  156. బేధములు కనబడినను ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని తుంచనాడ కూడదు
  157. సన్నిధిలో నీవున్న యెడల సన్నిధి నీలో ఉండును
  158. దశమ భాగము ఇవ్వడం ప్రారంభిస్తే మీ దశ ఎత్తుకుంటుంది
  159. పని అలవర్చుకో – పెత్తనం కాదు
  160. నీవు గొప్ప స్థితిలోనికి వచ్చినా దేవుని మరువవద్దు
  161. నీవు అధోఃలోకానికి వచ్చినా దేవుని మరువవద్దు
  162. చాడీలు చెప్పేవారి దగ్గర భక్తి ఉండదు, చాడీలు వినేవారి దగ్గర శక్తివుండదు
  163. ఎన్ని స్థితులు వచ్చిన ఆయన మాట వినకపోతే చివరికి చావు స్థితి లభించును
  164. ఏమాత్రము కొంచెము ద్వేషము ఉన్న కొన్ని కొన్ని సం|| జీవితమును పాడు చేయును
  165. స్వల్పమైన అనాలోచన, నిముషమాత్రము ఆగ్రహము అనునవి జీవితములోని కుటుంబ సమాధానము, ఆనందమును తొలగించును
  166. అణచుకొనలేని కోపము వలన ఇతరుల మనస్సులను గాయపరచి మాన్పుటకు వీలులేనంత నష్టము కలిగించును
  167. విశాలహృదయము, నిర్మల మనస్సు, నిదానమైన సంభాషణ,మృదువైన మాటల వలన జీవితములో ఆనందము, సమాధానము కలుగును
  168. నవనాడులు కృంగుతేనే గాని కన్నీరు రాదు
  169. రోగి వైద్యుని కిచ్చు సమయము దేవునికిచ్చిన యెడల మందు లేకుండా జబ్బు మాన్పివేయగలడు
  170. అపవాది ఏదో ఒక దీపమును ఆర్పాలని చూస్తాడు
  171. దీనుడుగా వస్తే దీవించుతాడు, కన్నీటితో వస్తే కరిగిపోతాడు
  172. కుటుంబ ప్రార్థన చేయకపోతే కుమ్మరాలు వస్తాయి
  173. కుటుంబ ప్రార్థన చేయకపోతే కుటుంబము వర్ధిల్లదు
  174. పాపం పెరిగిపోయింది, పరిశుద్ధత తగ్గింది
  175. ఆదివారం ఆరాధనలో పాల్గొనని వారు నిత్యారాధనలో పాల్గొనలేరు
  176. దేవుని కన్ను వెళ్ళే చోటికి మానవుని కన్ను వెళ్ళలేదు
  177. కష్టకాలంలో కుదురుగా కూర్చోవాలి
  178. దైవ సన్నిధిలో కూర్చొనుట దేవునికి పనిపెట్టుట అని గ్రహించాలి
  179. యోహానుకు మరియొక పేరు పక్షినేత్రము గలవాడు
  180. ప్రవక్తను గుర్తించే ప్రవర్తన గలిగియుండవలెను
  181. దైవజనుని ఆజ్ఞాపించకూడదు, అవమానపరచ కూడదు
  182. పెందలకడ ఆలయానికి వస్తే ఆయన ప్రక్కన కూర్చునే అర్హత దొరకును
  183. నా పని భూలోకంలో, నా గురి పరలోకంలో
  184. పువ్వులు లేని తోటలో సవాసన ఉండదు, ప్రార్థన లేని ఇంట్లో ఆనందం ఉండదు
  185. పని నేర్చుకోవాలి, ప్రయాణమవ్వాలి, ప్రయాసపడాలి
  186. మోకాళ్ళు నలుపెక్కితే, పరలోకపు చెక్కులు స్వతంత్రించుకోగలము
  187. తప్పుచేస్తే శిక్ష తప్పదు, నిప్పు పట్టుకుంటే కాలక మానదు
  188. ఏ స్థలములో కొట్టబడితే అదే స్థలంలో బోధింపవలెను
  189. రక్షణకు దూరంగా జీవిస్తున్న వారిని రక్షణ లోనికి నడిపించాలి
  190. పాపి చెయ్యి పరిశుద్ధతలో పెట్టి ప్రేమ బలియైనది
  191. దైవసన్నిధిలో ఉండేవారికి దైవ రూపం వస్తుంది
  192. దశమ భాగం ఇచ్చే ధనవంతులు తక్కువమంది ఉన్నారు, దశమ భాగము ఇవ్వని దరిద్రులు ఎందరో ఉన్నారు
  193. సత్తుగిన్నెను సుత్తితో ఎట్లాగ సరిచేస్తారో అట్లాగే వాక్యమనే సుత్తి ద్వారా మనలను సరిచేస్తారు
  194. కనిపెట్టు పట్టుగలవారు కలవర పడరు, కంగారు పడరు
  195. నీ జ్ఞానమునకు ఏది అడ్డు వస్తుందో దానికి "స్వస్థి" చెప్పాలి
  196. కనిపెట్టు పట్టు గలవారు భాగ్యవంతులు
  197. వ్యాధి వచ్చినంత మాత్ర్రాన వరములు అంతరించవు
  198. ప్రభువు తన శక్తిని మానవ శక్తికి అందినప్పుడు వాడలేరు
  199. మానవ శక్తి చేయలేని పనిని దైవశక్తి చేస్తుంది
  200. బ్రతుకు వేరుగా, బోధ వేరుగా ఉండకూడదు
  201. తెలిసినవికూడ తెలియనట్టుగా వినాలి
  202. నామకార్థ భక్తి మోక్షమునకు చేర్చదు
  203. శ్రమకు బహుమానం మహిమయే
  204. అపవిత్రతను విడిచి పవిత్రుడవు కావడానికి రమ్మని ప్రభువు పిలుస్తున్నారు
  205. నలుగుపెట్టి రుద్ధకపోతే రూపం రాదు
  206. నలుగు వద్దు అంటే రాకడకు వెళ్ళవు అని అర్థం
  207. శ్రమ జీవితానికి కావలసిన ఓర్పు
  208. సద్భక్తి వల్ల హింస, హింసను బట్టి మహిమ, మహిమను బట్టి అంతస్థు
  209. రాకడను ధ్యానిస్తే రాకడ జ్యోతి మన హృదయంలో నిత్యం ప్రకాశిస్తుంది
  210. చింతాకంత చిరాకు ఉంటే పరలోకం వెళ్ళలేరు
  211. చెప్పిన పని చేసే వారికి చెప్పబుద్ధి పుడుతుంది
  212. చింతను మాని చెంతకు జేరితే చిరంజీవులవుతారు
  213. పియానో మీద "నల్లని" "తెల్లని" మీటలు నొక్కినపుడు ఒక విధమైన శబ్ధము వస్తుంది. గాని రెండింటిని నొక్కితే కమ్మని సంగీతము వస్తుంది. అట్లే భయ, భక్తులు గలవారు దేవునిచే శాస్వత ఆశీర్వాదములు పొందగలరు
  214. ప్రభువు స్నేహితుడుగా ఉండాలంటే నీ పాపం శత్రువు అని ఎరిగి విడిచి పెట్టాలి
  215. నిరాశ పాపములో ప్రవేశించుటకు ద్వారము
  216. నిరాశ చెందుటకు ఏ కారణమున్నను సరే నిరాశ పడకు, చింత చెందకు
  217. ప్రభువును ఎరిగి ఇంకను పాపములోనే ఉన్నయెడల కృపను లోకువ గట్టుటయే
  218. దేనిచేతనైనను, ఎంత ఆపద యున్నను దిగులు పడకు, వెరవకు, భయపడకు, కృంగవద్దు
  219. ప్రభువు బలమును చూచి నడచిన యెడల మన బలహీనత కనిపించదు