Old
New
యెషయా గ్రంథము Isaiah यशायाह - 22
- దర్శనపులోయను గూర్చిన దేవోక్తి
- ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు.
- నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి
- నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.
- దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును.
- ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను
- అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు.
- అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధము లను కనిపెట్టితివి.
- దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి.
- యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి
- పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి.
- ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా
- రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు
- సంతోషించి ఉత్సహించుదురుఒ కాగా ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడుమీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.
- ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము
- ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు
- ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును
- ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును
- నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.
- ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమా రుడునగు ఎల్యాకీమును పిలిచి
- అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికార మును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసుల కును యూదా వంశస్థులకును తండ్రియగును.
- నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు
- దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.
- గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల లందరిని అతనిమీద వ్రేలాడించెదరు.
- సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
- The oracle concerning the valley of vision. What do you mean that you have gone up, all of you, to the housetops,
- you who are full of shoutings, tumultuous city, exultant town? Your slain are not slain with the sword or dead in battle.
- All your leaders have fled together; without the bow they were captured. All of you who were found were captured, though they had fled far away.
- Therefore I said: "Look away from me; let me weep bitter tears; do not labor to comfort me concerning the destruction of the daughter of my people."
- For the Lord GOD of hosts has a day of tumult and trampling and confusion in the valley of vision, a battering down of walls and a shouting to the mountains.
- And Elam bore the quiver with chariots and horsemen, and Kir uncovered the shield.
- Your choicest valleys were full of chariots, and the horsemen took their stand at the gates.
- He has taken away the covering of Judah. In that day you looked to the weapons of the House of the Forest,
- and you saw that the breaches of the city of David were many. You collected the waters of the lower pool,
- and you counted the houses of Jerusalem, and you broke down the houses to fortify the wall.
- You made a reservoir between the two walls for the water of the old pool. But you did not look to him who did it, or see him who planned it long ago.
- In that day the Lord GOD of hosts called for weeping and mourning, for baldness and wearing sackcloth;
- and behold, joy and gladness, killing oxen and slaughtering sheep, eating flesh and drinking wine. "Let us eat and drink, for tomorrow we die."
- The LORD of hosts has revealed himself in my ears: "Surely this iniquity will not be atoned for you until you die," says the Lord GOD of hosts.
- Thus says the Lord GOD of hosts, "Come, go to this steward, to Shebna, who is over the household, and say to him:
- What have you to do here, and whom have you here, that you have cut out here a tomb for yourself, you who cut out a tomb on the height and carve a dwelling for yourself in the rock?
- Behold, the LORD will hurl you away violently, O you strong man. He will seize firm hold on you
- and whirl you around and around, and throw you like a ball into a wide land. There you shall die, and there shall be your glorious chariots, you shame of your master's house.
- I will thrust you from your office, and you will be pulled down from your station.
- In that day I will call my servant Eliakim the son of Hilkiah,
- and I will clothe him with your robe, and will bind your sash on him, and will commit your authority to his hand. And he shall be a father to the inhabitants of Jerusalem and to the house of Judah.
- And I will place on his shoulder the key of the house of David. He shall open, and none shall shut; and he shall shut, and none shall open.
- And I will fasten him like a peg in a secure place, and he will become a throne of honor to his father's house.
- And they will hang on him the whole honor of his father's house, the offspring and issue, every small vessel, from the cups to all the flagons.
- In that day, declares the LORD of hosts, the peg that was fastened in a secure place will give way, and it will be cut down and fall, and the load that was on it will be cut off, for the LORD has spoken."
- दर्शन की तराई के विषय में भारी वचन। तुम्हें क्या हुआ कि तुम सब के सब छतों पर चढ़ गए हो,
- हे कोलाहल और ऊधम से भरी प्रसन्न नगरी? तुझ में जो मारे गए हैं वे न तो तलवार से और न लड़ाई में मारे गए हैं।
- तेरे सब न्यायी एक संग भाग गए और धनुर्धारियों से बान्धे गए हैं। और तेरे जितने शेष पाए गए वे एक संग बान्धे गए, वे दूर भागे थे।
- इस कारण मैं ने कहा, मेरी ओर से मुंह फेर लो कि मैं बिलक बिलककर रोऊं; मेरे नगर सत्यनाश होने के शोक में मुझे शान्ति देने का यत्न मत करो।।
- क्योंकि सेनाओं के प्रभु यहोवा का ठहराया हुआ दिन होगा, जब दर्शन की तराई में कोलाहल और रौंदा जाना और बेचैनी होगी; शहरपनाह में सुरंग लगाई जाएगी और दोहाई का शब्द पहाड़ों तक पहुंचेगा।
- और एलाम पैदलों के दल और सवारों समेत तर्कश बान्धे हुए है, और कीर ढाल खोले हुए है।
- तेरी उत्तम उत्तम तराइयां रथों से भरी हुई होंगी और सवार फाटक के साम्हने पांति बान्धेंगे। उस ने यहूदा का घूंघट खोल दिया है।
- उस दिन तू ने वन नाम भवन के अस्त्रा- शस्त्रा का स्मरण किया,
- और तू ने दाऊदपुर की शहरपनाह की दरारों को देखा कि वे बहुत हैं, और तू ने निचले पोखरे के जल को इकट्ठा किया।
- और यरूशलेम के घरों को गिनकर शहरपनाह के दृढ़ करने के लिये घरों को ढा दिया।
- तू ने दोनों भीतों के बीच पुराने पोखरे के जल के लिये एक कुंड खोदा। परन्तु तू ने उसके कर्ता को स्मरण नहीं किया, जिस ने प्राचीनकाल से उसको ठहरा रखा था, और न उसकी ओर तू ने दृष्टि की।।
- उस समय सेनाओं के प्रभु यहोवा ने रोने- पीटने, सिर मुंडाने और टाट पहिनने के लिये कहा था;
- परन्तु क्या देखा कि हर्ष और आनन्द मनाया जा रहा है, गाय- बैल का घात और भेड़- बकरी का वध किया जा रहा है, मांस खाया और दाखमधु पीया जा रहा है। और कहते हैं, आओ खाएं- पीएं, क्योंकि कल तो हमें मरना है।
- सेनाओं के यहोवा ने मेरे कान में कहा और अपने मन की बात प्रगट की, निश्चय तुम लोगों के इस अधर्म का कुछ भी प्रायश्चित्त तुम्हारी मृत्यु तक न हो सकेगा, सेनाओं के प्रभु यहोवा का यही कहना है।
- सेनाओं का प्रभु यहोवा यों कहता है, शेबना नाम उस भण्डारी के पास जो राजघराने के काम पर नियुक्त है जाकर कह, यहां तू क्या करता है?
- और यहां तेरा कौन है कि तू ने अपनी कबर यहां खुदवाई है? तू अपनी कबर ऊंचे स्थान में खुदवाता और अपने रहने का स्थान चट्टान में खुदवाता है?
- देख, यहोवा तुझ को बड़ी शक्ति से पकड़कर बहुत दूर फेंक देगा।
- वह तुझे मरोड़कर गेन्द की नाई लम्बे चौड़े देश में फेंक देगा; हे अपने स्वामी के घराने को लज्जित करनेवाले वहां तू मरेगा और तेरे विभव के रथ वहीं रह जाएंगे।
- मैं तुझ को तेरे स्थान पर से ढकेल दूंगा, और तू अपने पद से उतार दिया जायेगा।
- उस समय मैं हिल्कियाह के पुत्रा अपने दास एल्याकीम को बुलाकर, उसे तेरा अंगरखा पहनाऊंगा,
- और उसकी कमर में तेरी पेटी कसकर बान्धूंगा, और तेरी प्रभुता उसके हाथ में दूंगा। और वह यरूशलेम के रहनेवालों और यहूदा के घराने का पिता ठहरेगा।
- और मैं दाऊद के घराने की कुंजी उसके कंधे पर रखूंगा, और वह खोलेगा और कोई बन्द न कर सकेगा; वह बन्द करेगा और कोई खोल न सकेगा।
- और मैं उसको दृढ़ स्थान में खूंटी की नाईं गाडूंगा, और वह अपने पिता के घराने के लिये विभव का कारण होगा।
- और उसके पिता से घराने का सारा विभव, वंश और सन्तान, सब छोटे- छोटे पात्रा, क्या कटोरे क्या सुराहियां, सब उस पर टांगी जाएंगी।
- सेनाओं के यहोवा की यह वाणी है कि उस समय वह खूंटी जो दृढ़ स्थान में गाड़ी गई थी, वह ढीली हो जाएगी, और काटकर गिराई जाएगी; और उस का बोझ गिर जाएगा, क्योंकि यहोवा ने यह कहा है।