Old
New
విలాపవాక్యములు Lamentations विलापगीत - 3
- నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
- ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు.
- మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
- ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
- నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు
- పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు
- ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
- నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
- ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు
- నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు
- నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కు లేకుండ చేసియున్నాడు
- విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు
- తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.
- నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.
- చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
- రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను.
- నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
- నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
- నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
- ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
- నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
- యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
- అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
- యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమి్మక యుంచుకొనుచున్నాను.
- తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
- నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
- ¸°వనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
- అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.
- నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
- అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
- ప్రభువు సర్వకాలము విడనాడడు.
- ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును.
- హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
- దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
- మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు
- ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు.
- ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా డెవడు?
- మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?
- సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
- మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.
- ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
- మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.
- కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.
- మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
- జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు.
- మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.
- భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
- నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.
- యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
- నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
- నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని.
- ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు.
- వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి
- నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని.
- యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా
- నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.
- నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి.
- ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి.
- యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
- పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు.
- యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని
- నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు.
- వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని పెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని.
- యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు.
- వారికి హృదయకాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు.
- నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ వారిని నశింపజేయుదువు.
- I am the man who has seen affliction under the rod of his wrath;
- he has driven and brought me into darkness without any light;
- surely against me he turns his hand again and again the whole day long.
- He has made my flesh and my skin waste away; he has broken my bones;
- he has besieged and enveloped me with bitterness and tribulation;
- he has made me dwell in darkness like the dead of long ago.
- He has walled me about so that I cannot escape; he has made my chains heavy;
- though I call and cry for help, he shuts out my prayer;
- he has blocked my ways with blocks of stones; he has made my paths crooked.
- He is a bear lying in wait for me, a lion in hiding;
- he turned aside my steps and tore me to pieces; he has made me desolate;
- he bent his bow and set me as a target for his arrow.
- He drove into my kidneys the arrows of his quiver;
- I have become the laughingstock of all peoples, the object of their taunts all day long.
- He has filled me with bitterness; he has sated me with wormwood.
- He has made my teeth grind on gravel, and made me cower in ashes;
- my soul is bereft of peace; I have forgotten what happiness is;
- so I say, "My endurance has perished; so has my hope from the LORD."
- Remember my affliction and my wanderings, the wormwood and the gall!
- My soul continually remembers it and is bowed down within me.
- But this I call to mind, and therefore I have hope:
- The steadfast love of the LORD never ceases; his mercies never come to an end;
- they are new every morning; great is your faithfulness.
- "The LORD is my portion," says my soul, "therefore I will hope in him."
- The LORD is good to those who wait for him, to the soul who seeks him.
- It is good that one should wait quietly for the salvation of the LORD.
- It is good for a man that he bear the yoke in his youth.
- Let him sit alone in silence when it is laid on him;
- let him put his mouth in the dust- there may yet be hope;
- let him give his cheek to the one who strikes, and let him be filled with insults.
- For the Lord will not cast off forever,
- but, though he cause grief, he will have compassion according to the abundance of his steadfast love;
- for he does not willingly afflict or grieve the children of men.
- To crush underfoot all the prisoners of the earth,
- to deny a man justice in the presence of the Most High,
- to subvert a man in his lawsuit, the Lord does not approve.
- Who has spoken and it came to pass, unless the Lord has commanded it?
- Is it not from the mouth of the Most High that good and bad come?
- Why should a living man complain, a man, about the punishment of his sins?
- Let us test and examine our ways, and return to the LORD!
- Let us lift up our hearts and hands to God in heaven:
- "We have transgressed and rebelled, and you have not forgiven.
- "You have wrapped yourself with anger and pursued us, killing without pity;
- you have wrapped yourself with a cloud so that no prayer can pass through.
- You have made us scum and garbage among the peoples.
- "All our enemies open their mouths against us;
- panic and pitfall have come upon us, devastation and destruction;
- my eyes flow with rili of tears because of the destruction of the daughter of my people.
- "My eyes will flow without ceasing, without respite,
- until the LORD from heaven looks down and sees;
- my eyes cause me grief at the fate of all the daughters of my city.
- "I have been hunted like a bird by those who were my enemies without cause;
- they flung me alive into the pit and cast stones on me;
- water closed over my head; I said, 'I am lost.'
- "I called on your name, O LORD, from the depths of the pit;
- you heard my plea, 'Do not close your ear to my cry for help!'
- You came near when I called on you; you said, 'Do not fear!'
- "You have taken up my cause, O Lord; you have redeemed my life.
- You have seen the wrong done to me, O LORD; judge my cause.
- You have seen all their vengeance, all their plots against me.
- "You have heard their taunts, O LORD, all their plots against me.
- The lips and thoughts of my assailants are against me all the day long.
- Behold their sitting and their rising; I am the object of their taunts.
- "You will repay them, O LORD, according to the work of their hands.
- You will give them dullness of heart; your curse will be on them.
- You will pursue them in anger and destroy them from under your heavens, O LORD."
- उसके रोष की छड़ी से दु:ख भोगनेवाला पुरूष मैं ही हूं;
- वह मुझे ले जाकर उजियाले में नहीं, अन्धियारे ही में चलाता है;
- उसका हाथ दिन भर मेरे ही विरूद्ध उठता रहता है।
- उस ने मेरा मांस और चमड़ा गला दिया है, और मेरी हडि्डयों को तोड़ दिया है;
- उस ने मुझे रोकने के लिये किला बनाया, और मुझ को कठिन दु:ख और श्रम से घेरा है;
- उस ने मुझे बहुत दिन के मरे हुए लोगों के समान अन्धेरे स्थानों में बसा दिया है।
- मेरे चारों ओर उस ने बाड़ा बान्धा है कि मैं निकल नहीं सकता; उस ने मुझे भारी सांकल से जकड़ा है;
- मैं चिल्ला चिल्लाके दोहाई देता हूँ, तौभी वह मेरी प्रार्थता नहीं सुनता;
- मेरे माग को उस ने गढ़े हुए पत्थरों से रोक रखा है, मेरी डगरों को उस ने टेढ़ी कर दिया है।
- वह मेरे लिये घात में बैठे हुए रीछ और घात लगाए हुए सिंह के समान है;
- उस ने मुझे मेरे माग से भुला दिया, और मुझे फाड़ डाला; उस ने मुझ को उजाड़ दिया है।
- उस ने धनुष चढ़ाकर मुझे अपने तीर का निशाना बनाया है।
- उस ने अपनी तीरों से मेरे हृदय को बेध दिया है;
- सब लोग मुझ पर हंसते हैं और दिन भर मुझ पर ढालकर गाीत गाते हैं,
- उस ने मुझे कठिन दु:ख से भर दिया, और नागदौना पिलाकर तृप्त किया है।
- उस ने मेरे दांतों को कंकरी से तोड़ डाला, और मुझे राख से ढांप दिया है;
- और मुझ को मन से उतारकर कुशल से रहित किया है; मैं कल्याण भूल गया हूँ;
- इसलिऐ मैं ने कहा, मेरा बल नाश हुआ, और मेरी आश जो यहोवा पर थी, वह टूट गई है।
- मेरा दु:ख और मारा मारा फिरना, मेरा नागदौने और- और विष का पीना स्मरण कर !
- मैं उन्हीं पर सोचता रहता हूँ, इस से मेरा प्राण ढला जाता है।
- परन्तु मैं यह स्मरण करता हूँ, इसीलिये मुझे आशा हैे
- हम मिट नहीं गए; यह यहोवा की महाकरूणा का फल है, क्योंकि उसकी दया अमर है।
- प्रति भोर वह नई होती रहती है; तेरी सच्चाई महान है।
- मेरे मन ने कहा, यहोवा मेरा भाग है, इस कारण मैं उस में आशा रखूंगा।
- जो यहोवा की बाट जोहते और उसके पास जाते हैं, उनके लिये यहोवा भला है।
- यहोवा से उठ्ठार पाने की आशा रखकर चुपचाप रहना भला है।
- पुरूष के लिये जवानी में जूआ उठाना भला है।
- वह यह जानकर अकेला चुपचाप रहे, कि परमेश्वर ही ने उस पर यह बोझ डाला है;
- वह अपना मुंह धूल में रखे, कया जाने इस में कुछ आशा हो;
- वह अपना गाल अपने मारनेवाले की ओर फेरे, और नामधराई सहता रहे।
- क्योंकि प्रभु मन से सर्वदा उतारे नहीं रहता,
- चाहे वह दु:ख भी दे, तौभी अपनी करूणा की बहुतायत के कारण वह दया भी करता है;
- क्योंकि वह मनुष्यों को अपने मन से न तो दबाता है और न दु:ख देता है।
- पृथ्वी भर के बंधुओं को पांव के तले दलित करना,
- किसी पुरूष का हक़ परमप्रधान के साम्हने मारना,
- और किसी मनुष्य का मुक़ मा बिगाड़ना, इन तीन कामों को यहोवा देख नहीं सकता।
- यदि यहोवा ने आज्ञा न दी हो, तब कौन है कि वचन कहे और वह पूरा हो जाए?
- विपत्ति और कल्याण, क्या दोनों परमप्रधान की आज्ञा से नहीं होते?
- सो जीवित मनुष्य क्यों कुड़कुड़ाए? और पुरूष अपने पाप के दण्ड को क्यों बुरा माने?
- हम अपने चालचलन को ध्यान से परखें, और यहोवा की ओर फिरें !
- हम स्वर्गवासी परमेश्वर की ओर मन लगाएं और हाथ फैलाएं और कहेंे
- हम ने तो अपराध और बलवा किया है, और तू ने क्ष्मा नहीं किया।
- तेरा कोप हम पर है, तू हमारे पीछे पड़ा है, तू ने बिना तरस खाए घात किया है।
- तू ने अपने को मेघ से घेर लिया है कि तुझ तक प्रार्थना न पहुंच सके।
- तू ने हम को जाति जाति के लोगों के बीच में कूड़ा- कर्कट सा ठहराया है।
- हमारे सब शत्रुओं ने हम पर अपना अपना मुंह फैलाया है;
- भय और गड़हा, उजाड़ और विनाश, हम पर आ पड़े हैं;
- मेरी आंखों से मेरी प्रजा की पुत्री के विनाश के कारण जल की धाराएं बह रही है।
- मेरी आंख से लगातार आंसू बहते रहेंगे,
- जब तक यहोवा स्वर्ग से मेरी ओर न देखे;
- अपनी नगरी की सब स्त्रियों का हाल देखने पर मेरा दु:ख बढ़ता है।
- जो व्यर्थ मेरे शत्रु बने हैं, उन्हों ने निर्दयता से चिड़िया के समान मेरा आहेर किया है;
- उन्हों ने मुझे गड़हे में डालकर मेरे जीवन का अन्त करने के लिये मेरे ऊपर पत्थर लुढ़काए हैं;
- मेरे सिर पर से जल बह गया, मैं ने कहा, मैं अब नाश हो गया।
- हे यहोवा, गहिरे गड़हे में से मैं ने तुझ से प्रार्थना की;
- तू ने मेरी सुनी कि जो दोहाई देकर मैं चिल्लाता हूँ उस से कान न फेर ले !
- जब मैं ने तुझे पुकारा, तब तू ने मुझ से कहा, मत डर !
- हे यहोवा, तू ने मेरा मुक़ मा लड़कर मेरा प्राण बचा लिया है।
- हे यहोवा, जो अन्याय मुझ पर हुआ है उसे तू ने देखा है; तू मेरा न्याय चुका।
- जो बदला उन्हों ने मुझ से लिया, और जो कल्पनाएं मेरे विरूद्ध कीं, उन्हें भी तू ने देखा है।
- हे यहोवा, जो कल्पनाएं और निन्दा वे मेरे विरूद्ध करते हैं, वे भी तू ने सुनी हैं।
- मेरे विरोधियों के वचन, और जो कुछ भी वे मेरे विरूद्ध लगातार सोचते हैं, उन्हें तू जानता है।
- उनका उठना- बैठना ध्यान से देख; वे मुझ पर लगते हुए गीत गाते हैं।
- हे यहोवा, तू उनके कामों के अनुसार उनको बदला देगा।
- तू उनका मन सुन्न कर देगा; तेरा शाप उन पर होगा।
- हे यहोवा, तू अपने कोप से उनको खदेड़- खदेड़कर धरती पर से नाश कर देगा।