Old
New
లూకా సువార్త Luke लूका - 2
- ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
- ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
- అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.
- యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భ వతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు
- గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.
- వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక
- తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
- ఆ దేశములో కొందరు గొఱ్ఱల కాపరులు పొల ములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా
- ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
- అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
- దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
- దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను.
- వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి
- సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
- ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱల కాపరులుజరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని
- త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.
- వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.
- గొఱ్ఱల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.
- అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.
- అంతట ఆ గొఱ్ఱల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.
- ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకము నుపు దేవదూతచేత పెట్టబడిన యేసు2 అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
- మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
- ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
- ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
- యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
- అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను.
- అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలి దండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు
- అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను
- నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;
- అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
- నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
- నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
- యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్ప బడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
- సుమెయోను వారిని దీవించిఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియ మింపబడియున్నాడు;
- మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లియైన మరి యతో చెప్పెను.
- మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,
- యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాల యము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.
- ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
- అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ లోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.
- బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.
- పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు.
- ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచ రించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.
- ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలు డైన యేసు యెరూషలేములో నిలిచెను.
- ఆయన తలి దండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగి పోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయ నను వెదకుచుండిరి.
- ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
- మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.
- ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.
- ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
- ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా1 అని వారితో చెప్పెను;
- అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.
- అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృద యములో భద్రము చేసికొనెను.
- యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
- In those days a decree went out from Caesar Augustus that all the world should be registered.
- This was the first registration when Quirinius was governor of Syria.
- And all went to be registered, each to his own town.
- And Joseph also went up from Galilee, from the town of Nazareth, to Judea, to the city of David, which is called Bethlehem, because he was of the house and lineage of David,
- to be registered with Mary, his betrothed, who was with child.
- And while they were there, the time came for her to give birth.
- And she gave birth to her firstborn son and wrapped him in swaddling cloths and laid him in a manger, because there was no place for them in the inn.
- And in the same region there were shepherds out in the field, keeping watch over their flock by night.
- And an angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were filled with fear.
- And the angel said to them, "Fear not, for behold, I bring you good news of a great joy that will be for all the people.
- For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord.
- And this will be a sign for you: you will find a baby wrapped in swaddling cloths and lying in a manger."
- And suddenly there was with the angel a multitude of the heavenly host praising God and saying,
- "Glory to God in the highest, and on earth peace among those with whom he is pleased!"
- When the angels went away from them into heaven, the shepherds said to one another, "Let us go over to Bethlehem and see this thing that has happened, which the Lord has made known to us."
- And they went with haste and found Mary and Joseph, and the baby lying in a manger.
- And when they saw it, they made known the saying that had been told them concerning this child.
- And all who heard it wondered at what the shepherds told them.
- But Mary treasured up all these things, pondering them in her heart.
- And the shepherds returned, glorifying and praising God for all they had heard and seen, as it had been told them.
- And at the end of eight days, when he was circumcised, he was called Jesus, the name given by the angel before he was conceived in the womb.
- And when the time came for their purification according to the Law of Moses, they brought him up to Jerusalem to present him to the Lord
- (as it is written in the Law of the Lord, "Every male who first opens the womb shall be called holy to the Lord")
- and to offer a sacrifice according to what is said in the Law of the Lord, "a pair of turtledoves, or two young pigeons."
- Now there was a man in Jerusalem, whose name was Simeon, and this man was righteous and devout, waiting for the consolation of Israel, and the Holy Spirit was upon him.
- And it had been revealed to him by the Holy Spirit that he would not see death before he had seen the Lord's Christ.
- And he came in the Spirit into the temple, and when the parents brought in the child Jesus, to do for him according to the custom of the Law,
- he took him up in his arms and blessed God and said,
- "Lord, now you are letting your servant depart in peace, according to your word;
- for my eyes have seen your salvation
- that you have prepared in the presence of all peoples,
- a light for revelation to the Gentiles, and for glory to your people Israel."
- And his father and his mother marveled at what was said about him.
- And Simeon blessed them and said to Mary his mother, "Behold, this child is appointed for the fall and rising of many in Israel, and for a sign that is opposed
- (and a sword will pierce through your own soul also), so that thoughts from many hearts may be revealed."
- And there was a prophetess, Anna, the daughter of Phanuel, of the tribe of Asher. She was advanced in years, having lived with her husband seven years from when she was a virgin,
- and then as a widow until she was eighty-four. She did not depart from the temple, worshiping with fasting and prayer night and day.
- And coming up at that very hour she began to give thanks to God and to speak of him to all who were waiting for the redemption of Jerusalem.
- And when they had performed everything according to the Law of the Lord, they returned into Galilee, to their own town of Nazareth.
- And the child grew and became strong, filled with wisdom. And the favor of God was upon him.
- Now his parents went to Jerusalem every year at the Feast of the Passover.
- And when he was twelve years old, they went up according to custom.
- And when the feast was ended, as they were returning, the boy Jesus stayed behind in Jerusalem. His parents did not know it,
- but supposing him to be in the group they went a day's journey, but then they began to search for him among their relatives and acquaintances,
- and when they did not find him, they returned to Jerusalem, searching for him.
- After three days they found him in the temple, sitting among the teachers, listening to them and asking them questions.
- And all who heard him were amazed at his understanding and his answers.
- And when his parents saw him, they were astonished. And his mother said to him, "Son, why have you treated us so? Behold, your father and I have been searching for you in great distress."
- And he said to them, "Why were you looking for me? Did you not know that I must be in my Father's house?"
- And they did not understand the saying that he spoke to them.
- And he went down with them and came to Nazareth and was submissive to them. And his mother treasured up all these things in her heart.
- And Jesus increased in wisdom and in stature and in favor with God and man.
- उन दिनों में औगूस्तुस कैसर की ओर से आज्ञा निकली, कि सारे जगत के लोगों के नाम लिखे जाएं।
- यह पहिली नाम लिखाई उस समय हुई, जब क्विरिनियुस सूरिया का हाकिम था।
- और सब लोग नाम लिखवाने के लिये अपने अपने नगर को गए।
- सो यूसुफ भी इसलिये कि वह दाऊद के घराने और वंश का था, गलील के नासरत नगर से यहूदिया में दाऊद के नगर बैतलहम को गया।
- कि अपनी मंगेतर मरियम के साथ जो गर्भवती थी नाम लिखवाए।
- उस के वहां रहते हुए उसके जनने के दिन पूरे हुए।
- और वह अपना पहिलौठा पुत्रा जनी और उसे कपड़े में लपेटकर चरनी में रखा: क्योंकि उन के लिये सराय में जगह न थी।
- और उस देश में कितने गड़ेरिये थे, जो रात को मैदान में रहकर अपने झुण्ड का पहरा देते थे।
- और प्रभु का एक दूत उन के पास आ खड़ा हुआ; और प्रभु का तेज उन के चारों ओर चमका, और वे बहुत डर गए।
- तब स्वर्गदूत ने उन से कहा, मत डरो; क्योंकि देखो मैं तुम्हें बड़े आनन्द का सुसमाचार सुनाता हूं जो सब लोगों के लिये होगा।
- कि आज दाऊद के नगर में तुम्हारे लिये एक उद्धारकर्ता जन्मा है, और यही मसीह प्रभु है।
- और इस का तुम्हारे लिये यह पता है, कि तुम एक बालक को कपड़े मे लिपटा हुआ और चरनी में पड़ा पाओगे।
- तब एकाएक उस स्वर्गदूत के साथ स्वर्गदूतों का दल परमेश्वर की स्तुति करते हुए और यह कहते दिखाई दिया।
- कि आकाश में परमेश्वर की महिमा और पृथ्वी पर उन मनुष्यों में जिनसे वह प्रसन्न है शान्ति हो।।
- जब स्वर्गदूत उन के पास से स्वर्ग को चले गए, तो गड़ेरियों ने आपस में कहा, आओ, हम बैतलहम जाकर यह बात जो हुई है, और जिसे प्रभु ने हमें बताया है, देखें।
- और उन्हों ने तुरन्त जाकर मरियम और यूसुफ को और चरनी में उस बालक को पड़ा देखा।
- इन्हें देखकर उन्हों ने वह बात जो इस बालक के विषय में उन से कही गई थी, प्रगट की।
- और सब सुननेवालों ने उन बातों से जो गड़रियों ने उन से कहीं आश्चर्य किया।
- परन्तु मरियम ये सब बातें अपने मन में रखकर सोचती रही।
- और गडरिये जैसा उन से कहा गया था, वैसा ही सब सुनकर और देखकर परमेश्वर की महिमा और स्तुति करते हुए लौट गए।।
- जब आठ दिन पूरे हुए, और उसके खतने का समय आया, तो उसका नाम यीशु रखा गया, जो स्वर्गदूत ने उसके पेट में आने से पहिले कहा था।
- और जब मूसा को व्यवस्था के अनुसार उन के शुद्ध होने के दिन पूरे हुए तो वे उसे यरूशलेम में ले गए, कि प्रभु के सामने लाएं।
- (जैसा कि प्रभु की व्यवस्था में लिखा है कि हर एक पहिलौठा प्रभु के लिये पवित्रा ठहरेगा)।
- और प्रभु की व्यवस्था के वचन के अनुसार पंडुकों का एक जोड़ा, या कबूतर के दो बच्चे ला कर बलिदान करें।
- और देखो, यरूशलेम में शमौन नाम एक मनुष्य था, और वह मनुष्य धर्मी और भक्त था; और इस्राएल की शान्ति की बाट जोह रहा था, और पवित्रा आत्मा उस पर था।
- और पवित्रा आत्मा से उस को चितावनी हुई थी, कि जब तक तू प्रभु के मसीह को देख ने लेगा, तक तक मृत्यु को न देखेगा।
- और वह आत्मा के सिखाने से मन्दिर में आया; और जब माता- पिता उस बालक यीशु को भीतर लाए, कि उसके लिये व्यवस्था की रीति के अनुसार करें।
- तो उस ने उसे अपनी गोद में लिया और परमेश्वर का धन्यवाद करके कहा,
- हे स्वामी, अब तू अपने दास को अपने वचन के अनुसार शान्ति से विदा करता है।
- क्योंकि मेरी आंखो ने तेरे उद्धार को देख लिया है।
- जिसे तू ने सब देशों के लोगों के साम्हने तैयार किया है।
- कि वह अन्य जतियों को प्रकाश देने के लिये ज्योति, और तेरे निज लोग इस्राएल की महिमा हो।
- और उसका पिता और उस की माता इन बातों से जो उसके विषय में कही जाती थीं, आश्चर्य करते थे।
- तब शमौन ने उन को आशीष देकर, उस की माता मरियम से कहा; देख, वह तो इस्राएल में बहुतों के गिरने, और उठने के लिये, और एक ऐसा चिन्ह होने के लिये ठहराया गया है, जिस के विरोध में बातें की जाएगीं --
- वरन तेरा प्राण भी तलवार से वार पार छिद जाएगा-- इस से बहुत हृदयों के विचार प्रगट होंगे।
- और अशेर के गोत्रा में से हन्नाह नाम फनूएल की बेटी एक भविष्यद्वक्तिन थी: वह बहुत बूढ़ी थी, और ब्याह होने के बाद सात वर्ष अपने पति के साथ रह पाई थी।
- वह चौरासी वर्ष से विधवा थी: और मन्दिर को नहीं छोड़ती थी पर उपवास और प्रार्थना कर करके रात- दिन उपासना किया करती थी।
- और वह उस घड़ी वहां आकर प्रभु का धन्यवाद करने लगी, और उन सभों से, जो यरूशलेम के छुटकारे की बाट जोहते थे, उसके विषय में बातें करने लगी।
- और जब वे प्रभु की व्यवस्था के अनुसार सब कुछ निपटा चुके तो गलील में अपने नगर नासरत को फिर चले गए।।
- और बालक बढ़ता, और बलवन्त होता, और बुद्धि से परिपूर्ण होता गया; और परमेश्वर का अनुग्रह उस पर था।
- उसके माता- पिता प्रति वर्ष फसह के पर्ब्ब में यरूशलेम को जाया करते थे।
- जब वह बारह वर्ष का हुआ, तो वे पर्ब्ब की रीति के अनुसार यरूशलेम को गए।
- और जब वे उन दिनों को पूरा करके लौटने लगे, तो वह लड़का यीशु यरूशलेम में रह गया; और यह उसके माता- पिता नहीं जानते थे।
- वे यह समझकर, कि वह और यात्रियों के साथ होगा, एक दिन का पड़ाव निकल गए: और उसे अपने कुटुम्बियों और जानपहचानों में ढूंढ़ने लगे।
- पर जब नहीं मिला, तो ढूंढ़ते- ढूंढ़ते यरूशलेम को फिर लौट गए।
- और तीन दिन के बाद उन्हों ने उसे मन्दिर में उपदेशकों के बीच में बैठे, उन की सुनते और उन से प्रश्न करते हुए पाया।
- और जितने उस की सुन रहे थे, वे सब उस की समझ और उसके उत्तरों से चकित थे।
- तब वे उसे देखकर चकित हुए और उस की माता ने उस से कहा; हे पुत्रा, तू ने हम से क्यों ऐसा व्यवहार किया? देख, तेरा पिता और मैं कुढ़ते हुए तुझे ढूंढ़ते थे।
- उस ने उन से कहा; तुम मुझे क्यों ढूंढ़ते थे? क्या नहीं जानते थे, कि मुझे अपने पिता के भवन में होना अवश्य है?
- परन्तु जो बात उस ने उन से कही, उन्हों ने उसे नहीं समझा।
- तब वह उन के साथ गया, और नासरत में आया, और उन के वश में रहा; और उस की माता ने ये सब बातें अपने मन में रखीं।।
- और यीशु बुद्धि और डील- डौल में और परमेश्वर और मनुष्यों के अनुग्रह में बढ़ता गया।।