Old
New
న్యాయాధిపతులు Judges न्यायियों - 19
- ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చు కొనగా
- అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచ రించి యూదా బేత్లెహేములోని తన తండ్రి యింటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను.
- ఆమెతో ప్రియ ముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసికొని ఆమెయొద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి యింట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను.
- ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడు దినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చు కొనుచు అక్కడ నిలిచిరి.
- నాలుగవ నాడు వారు వేకు వను వెళ్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రినీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్లవచ్చునని
- తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రిదయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మను ష్యునితో చెప్పి
- అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను.
- అయిదవ దినమున అతడు వెళ్లవలెనని ఉదయ మున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రినీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడవుచేసి యిద్దరు కూడి భోజనము చేసిరి.
- ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను
- అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్ట బడిన రెండు గాడిదలును
- అతని ఉపపత్నియు అతనితో కూడ ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలావ్రాలెను గనుక అతని దాసుడుమనము యెబూసీయులదైన యీ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా
- అతని యజమానుడుఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. గిబియావరకు ప్రయా ణము చేయుదమనెను.
- మరియు అతడునీవు రమ్ము,ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని యీ రాత్రి బస చేసెదమనెను.
- అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను.
- కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి; అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను, బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువ లేదు.
- ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాల మున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.
- అతడు కన్ను లెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచినీ వెక్కడికి వెళ్లుచున్నావు? నీ వెక్కడనుండి వచ్చితివి? అని అడిగెను.
- అందు కతడుమేము యూదా బేత్లెహేమునుండి ఎఫ్రాయిమీ యుల మన్యము అవతలకు వెళ్లుచున్నాము. నేను అక్కడివాడను; నేను యూదా బేత్లెహేమునకు పోయి యుంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్లుచున్నాను, ఎవడును తన యింట నన్ను చేర్చుకొనలేదు.
- అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడ నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా
- ఆ ముసలివాడునీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైన యెడల వాటిభారము నామీద ఉంచుము.
- మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, తన యింట అతని చేర్చుకొని వారి గాడిదలకొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్న పానములు పుచ్చు కొనిరి.
- వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపుకొట్టినీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా
- యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి.
- ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉప పత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని
- అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట నున్నవారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.
- ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మను ష్యుని యింటి ద్వారమున పడియుండెను.
- ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్ద పడి చేతులు గడపమీద చాపి యుండెను.
- అతడులెమ్ము వెళ్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిదమీద ఆమెను ఉంచి లేచి తనచోటికి ప్రయాణము చేయ సాగెను.
- అతడు తన యింటికి వచ్చినప్పుడు కత్తి పట్టు కొని తన ఉపపత్నిని తీసికొని, ఆమెను ఆమె కీళ్ల ప్రకా రము పండ్రెండు ముక్కలుగా కోసి, ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపెను.
- అప్పుడు దాని చూచినవారందరు, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఈలాటిపని జరుగుటయైనను వినబడుటయైనను లేదు; మీరు ఇది మన స్సుకు తెచ్చుకొని దీనినిబట్టి ఆలోచనచేసి దీనినిగూర్చి మాటలాడుడని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.
- In those days, when there was no king in Israel, a certain Levite was sojourning in the remote parts of the hill country of Ephraim, who took to himself a concubine from Bethlehem in Judah.
- And his concubine was unfaithful to him, and she went away from him to her father's house at Bethlehem in Judah, and was there some four months.
- Then her husband arose and went after her, to speak kindly to her and bring her back. He had with him his servant and a couple of donkeys. And she brought him into her father's house. And when the girl's father saw him, he came with joy to meet him.
- And his father-in-law, the girl's father, made him stay, and he remained with him three days. So they ate and drank and spent the night there.
- And on the fourth day they arose early in the morning, and he prepared to go, but the girl's father said to his son-in-law, "Strengthen your heart with a morsel of bread, and after that you may go."
- So the two of them sat and ate and drank together. And the girl's father said to the man, "Be pleased to spend the night, and let your heart be merry."
- And when the man rose up to go, his father-in-law pressed him, till he spent the night there again.
- And on the fifth day he arose early in the morning to depart. And the girl's father said, "Strengthen your heart and wait until the day declines." So they ate, both of them.
- And when the man and his concubine and his servant rose up to depart, his father-in-law, the girl's father, said to him, "Behold, now the day has waned toward evening. Please, spend the night. Behold, the day draws to its close. Lodge here and let your heart be merry, and tomorrow you shall arise early in the morning for your journey, and go home."
- But the man would not spend the night. He rose up and departed and arrived opposite Jebus (that is, Jerusalem). He had with him a couple of saddled donkeys, and his concubine was with him.
- When they were near Jebus, the day was nearly over, and the servant said to his master, "Come now, let us turn aside to this city of the Jebusites and spend the night in it."
- And his master said to him, "We will not turn aside into the city of foreigners, who do not belong to the people of Israel, but we will pass on to Gibeah."
- And he said to his young man, "Come and let us draw near to one of these places and spend the night at Gibeah or at Ramah."
- So they passed on and went their way. And the sun went down on them near Gibeah, which belongs to Benjamin,
- and they turned aside there, to go in and spend the night at Gibeah. And he went in and sat down in the open square of the city, for no one took them into his house to spend the night.
- And behold, an old man was coming from his work in the field at evening. The man was from the hill country of Ephraim, and he was sojourning in Gibeah. The men of the place were Benjaminites.
- And he lifted up his eyes and saw the traveler in the open square of the city. And the old man said, "Where are you going? and where do you come from?"
- And he said to him, "We are passing from Bethlehem in Judah to the remote parts of the hill country of Ephraim, from which I come. I went to Bethlehem in Judah, and I am going to the house of the Lord, but no one has taken me into his house.
- We have straw and feed for our donkeys, with bread and wine for me and your female servant and the young man with your servants. There is no lack of anything."
- And the old man said, "Peace be to you; I will care for all your wants. Only, do not spend the night in the square."
- So he brought him into his house and gave the donkeys feed. And they washed their feet, and ate and drank.
- As they were making their hearts merry, behold, the men of the city, worthless fellows, surrounded the house, beating on the door. And they said to the old man, the master of the house, "Bring out the man who came into your house, that we may know him."
- And the man, the master of the house, went out to them and said to them, "No, my brothers, do not act so wickedly; since this man has come into my house, do not do this vile thing.
- Behold, here are my virgin daughter and his concubine. Let me bring them out now. Violate them and do with them what seems good to you, but against this man do not do this outrageous thing."
- But the men would not listen to him. So the man seized his concubine and made her go out to them. And they knew her and abused her all night until the morning. And as the dawn began to break, they let her go.
- And as morning appeared, the woman came and fell down at the door of the man's house where her master was, until it was light.
- And her master rose up in the morning, and when he opened the doors of the house and went out to go on his way, behold, there was his concubine lying at the door of the house, with her hands on the threshold.
- He said to her, "Get up, let us be going." But there was no answer. Then he put her on the donkey, and the man rose up and went away to his home.
- And when he entered his house, he took a knife, and taking hold of his concubine he divided her, limb by limb, into twelve pieces, and sent her throughout all the territory of Israel.
- And all who saw it said, "Such a thing has never happened or been seen from the day that the people of Israel came up out of the land of Egypt until this day; consider it, take counsel, and speak."
- उन दिनों में जब इस्राएलियों का कोई राजा न था, तब एक लेवीय पुरूष एप्रैम के पहाड़ी देश की परली ओर परदेशी होकर रहता था, जिस ने यहूदा के बेतलेहेम में की एक सुरैतिन रख ली थी।
- उसकी सुरैतिन व्यभिचार करके यहूदा के बेतलेहेम को अपने पिता के घर चली गई, और चार महीने वहीं रही।
- तब उसका पति अपने साथ एक सेवक और दो गदहे लेकर चला, और उसके यहां गया, कि उसे समझा बुझाकर ले आए। वह उसे अपने पिता के घर ले गई, और उस जवान स्त्री का पिता उसे देखकर उसकी भेंट से आनन्दित हुआ।
- तब उसके ससुर अर्थात् उस स्त्री के पिता ने बिनती करके उसे रोक लिया, और वह तीन दिन तक उसके पास रहा; सो वे वहां खाते पिते टिके रहे।
- चौथे दिन जब वे भोर को सबेरे उठे, और वह चलने को हुआ; तब स्त्री के पिता ने अपने दामाद से कहा, एक टुकड़ा रोटी खाकर अपना जी ठण्डा कर, तब तुम लोग चले जाना।
- तब उन दोनों ने बैठकर संग संग खाया पिया; फिर स्त्री के पिता ने उस पुरूष से कहा, और एक रात टिके रहने को प्रसन्न हो और आनन्द कर।
- वह पुरूष विदा होने को उठा, परन्तु उसके सुसर ने बिनती करके उसे दबाया, इसलिये उस ने फिर उसके यहां रात बिताई।
- पांचवें दिन भोर को वह तो विदा होने को सवेरे उठा; परन्तु स्त्री के पिता ने कहा, अपना जी ठण्डा कर, और तुम दोनों दिन ढलने तक रूके रहो। तब उन दोनों ने रोटी खाई।
- जब वह पुरूष अपनी सुरैतिन और सेवक समेत विदा होने को उठा, तब उसके ससुर अर्थात् स्त्री के पिता ने उस से कहा, देख दिन तो ढला चला है, और सांझ होने पर है; इसलिये तुम लोग रात भर टिके रहो। देख, दिन तो डूबने पर है; सो यहीं आनन्द करता हुआ रात बिता, और बिहान को सवेरे उठकर अपना मार्ग लेना, और अपने डेरे को चले जाना।
- परन्तु उस पुरूष ने उस रात को टिकना न चाहा, इसलिये वह उठकर विदा हुआ, और काठी बान्धे हुए दो गदहे और अपनी सुरैतिन संग लिए हुए यबूस के साम्हने तक (जो यरूशलेम कहलाता है) पहुंचा।
- वे यबूस के पास थे, और दिन बहुत ढल गया था, कि सेवक ने अपने स्वामी से कहा, आ, हम यबूसियों के इस नगर में मुड़कर टिकें।
- उसके स्वामी ने उस से कहा, हम पराए नगर में जहां कोई इस्राएली नहीं रहता, न उतरेंगे; गिबा तक बढ़ जाएंगे।
- फिर उस ने अपने सेवक से कहा, आ, हम उधर के स्थानों में से किसी के पास जाएं, हम गिबा वा रामा में रात बिताएं।
- और वे आगे की ओर चले; और उनके बिन्यामीन के गिबा के निकट पहुंचते पहुंचते सूर्य अस्त हो गया,
- इसलिये वे गिबा में टिकने के लिये उसकी ओर मुड़ गए। और वह भीतर जाकर उस नगर के चौक में बैठ गया, क्योंकि किसी ने उनको अपने घर में न टिकाया।
- तब एक बूढ़ा अपने खेत के काम को निपटाकर सांझ को चला आया; वह तो एप्रैम के पहाड़ी देश का था, और गिबा में परदेशी होकर रहता था; परन्तु उस स्थान के लोग बिन्यामीनी थे।
- उस ने आंखें उठाकर उस यात्री को नगर के चौक में बैठे देखा; और उस बूढ़े ने पूछा, तू किधर जाता, और कहां से आता है?
- उस ने उस से कहा, हम लोग तो यहूदा के बेतलेहम से आकर एप्रैम के पहाड़ी देश की परली ओर जाते हैं, मैं तो वहीं का हूं; और यहूदा के बेतलेहेम तक गया था, और यहोवा के भवन को जाता हूं, परन्तु कोई मुझे अपने घर में नहीं टिकाता।
- हमारे पास तो गदहों के लिये पुआल और चारा भी है, और मेरे और तेरी इस दासी और इस जवान के लिये भी जो तेरे दासों के संग है रोटी और दाखमधु भी है; हमें किसी वस्तु की घटी नहीं है।
- बूढ़े ने कहा, तेरा कल्याण हो; तेरे प्रयोजन की सब वस्तुएं मेरे सिर हों; परन्तु रात को चौक में न बिता।
- तब वह उसको अपने घर ले चला, और गदहों को चारा दिया; तब वे पांव धोकर खाने पीने लगे।
- वे आनन्द कर रहे थे, कि नगर के लुच्चों ने घर को घेर लिया, और द्वार को खटखटा- खटखटाकर घर के उस बूढ़े स्वामी से कहने लगे, जो पुरूष तेरे घर में आया, उसे बाहर ले आ, कि हम उस से भोग करें।
- घर का स्वामी उनके पास बाहर जाकर उन से कहने लगा, नहीं, नहीं, हे मेरे भाइयों, ऐसी बुराई न करो; यह पुरूष जो मेरे घर पर आया है, इस से ऐसी मूढ़ता का काम मत करो।
- देखा, यहां मेरी कुंवारी बेटी है, और इस पुरूष की सुरैतिन भी है; उनको मैं बाहर ले आऊंगा। और उनका पत- पानी लो तो लो, और उन से तो जो चाहो सो करो; परन्तु इस पुरूष से ऐसी मूढ़ता का काम मत करो।
- परन्तु उन मनुष्यों ने उसकी न मानी। तब उस पुरूष ने अपनी सुरैतिन को पकड़कर उनके पास बाहर कर दिया; और उन्हों ने उस से कुकर्म किया, और रात भर क्या भोर तक उस से लीला क्रीड़ा करते रहे। और पह फटते ही उसे छोड़ दिया।
- तब वह स्त्री पह फटते हुए जाके उस मनुष्य के घर के द्वार पर जिस में उसका पति था गिर गई, और उजियाले के होने तक वहीं पड़ी रही।
- सवेरे जब उसका पति उठ, घर का द्वार खोल, अपना मार्ग लेने को बाहर गया, तो क्या देखा, कि मेरी सुरैतिन घर के द्वार के पास डेवढ़ी पर हाथ फैलाए हुए पड़ी है।
- उस ने उस से कहा, उठ हम चलें। जब कोई न बोला, तब वह उसको गदहे पर लादकर अपने स्थान को गया।
- जब वह अपने घर पहुंचा, तब छूरी ले सुरैतिन को अंग अंग करके काटा; और उसे बारह टुकड़े करके इस्राएल के देश में भेज दिया।
- जितनों ने उसे देखा, वे सब आपस में कहने लगे, इस्राएलियों के मि देश मे चले आने के समय से लेकर आज के दिन तक ऐसा कुछ कभी नहीं हुआ, और न देखा गया; सो इसको सोचकर सम्मति करो, और बताओ।।