దైవ రాజ్య స్థాపనకై నూతన నిబంధన నిర్మాణం కొరకు ప్రభువైన యేసు క్రీస్తు పడిన మహా శ్రమలు

Day 2 => వాక్య భాగము: Mat 21:18 19; Mark 11:12-14;

యేసు క్రీస్తు ప్రభువు ఆ అంజూరపు చెట్టును ఎందుకు ఎండిపోనిచ్చెను?

ధ్యాన సారాంశము:

సత్యము: దైవ లక్షణములైన ఆత్మ ఫలములను అందించని మతాచారములను వేళ్ళతో సహా ఎండగట్టిన యేసు క్రీస్తు ప్రభువు
కృప: ఫలింపని, అభివృద్ధిపొందని, సృష్టిని ఏలని ప్రతీ ఆచారమును అంతమొందించుటకు ప్రభువు సంఘమునకు అధికారమిచ్చెను.
Fig Tree

యేసు ప్రభువు చెప్పిన ఉపమానములు వట్టి నీతి కథలు కావు. అవన్ని నూతన నిబంధనలో దైనందికజీవితంలో జరగబోయే లేఖనములు. ఆయన చెప్పిన లేఖనములలో (ఉపమానములలో) ఎక్కువగా త్వరలో జరుగనైయున్న ఆయన సిలువ కార్యమును గూర్చి మరియు రెండవ రాకడను గూర్చి గలవు.

యేసు ప్రభువు "గాడిదపై యెరూషలేము ప్రవేశము" పాతనిబంధన నెరవేర్పు. ఫలింపని అంజూరపు చెట్టును ఎండిపోనిచ్చుట క్రొత్తనిబంధన లేఖన నెరవేర్పు.
యేసుప్రభువు ఖరా ఖండిగా స్పష్టం చేసిన విషయం యేదనగా

యేసు ప్రభువునకు ఆకలి వేస్తే వెంటనే ఆ అంజూరపు చెట్టు ఫలించు గాక అని అంటే ఆయన ఆకలి తీరేది కదా! ఆయన మాటకు తక్ష్తణమే ఎండిపోయిన చెట్టు ఫలించమంటే ఫలించదా?

తన క్రొత్త నిబంధనను స్థాపించి స్థిరపరచడానికి ఏర్పాటు చేసుకొన్న తన శిష్యుల యెదుట మాత్రమే ఆయన కొన్ని సూచక క్రియలు చేసారు.
  1. వాటిలో మొదటిది, నీళ్ళను ద్రాక్షారసముగా మార్చుట. అక్కడ వారు "ఆయన మీతో చెప్పునది చేయుడి" అనే మిషనును ప్రారంభించారు. మీరు దేనినైనా సృజించి, సృష్టించి, నిర్మించగలరు అనే విశ్వాస అధికారమును అక్కడ మొదటగా ఇస్తే,
  2. ప్రభువు శరీర ధారియై ఈ భూమి మీద తన సేవ ముగించు సమయంలో, చివరగా "ఫలింపని, వేషధారణ ప్రదర్శించిన అంజూరపు చెట్టును ఎండిపోనిచ్చుట" అనే సూచక క్రియను ఆయన శిష్యుల యెదుట చేసారు. దీని ద్వార ప్రభువు తన శిష్యులకు నిర్మించడానికే అధికారం ఇవ్వడం లేదు కాని, దైవం లేని మతాచారములను తొలగించుటకు కూడ విశ్వాస అధికారమును ఇచ్చెను.

అవసరమైనది నిర్మించడానికి ఎంత విశ్వాస సామర్ధ్యము కావాలో, అనవసరమైనది తొలగించడానికి కూడా అంతే విశ్వాస సామర్ధ్యము కావాలి. అందుకే మన ప్రభువు ఈ రెండు సామర్ధ్యాలను దయచేసారు.


అందుకే తన అనాది సంకల్పములో ఫలించని చెట్టును ఇక్కడ ఉంచారు. యేసు ప్రభువు ఆ దారిలో వెళ్తున్న కాలానికి అంజూరపు చెట్లు ఆకు రాల్చి కాండం పిందెలతో ఉండాలి, తర్వాత కొన్ని రోజులకి కాయలు పండే సమయానికి ఆకులు దట్టంగా ఉంటాయి. కాని ఈ చెట్టు కాలం కాని కాలంలో ఆకులు కలిగి(దేవుడు మాకు శ్రమలే ఇవ్వడు, ఎల్లప్పుడు ఆశీర్వాదమే అనే హంగు, ఆర్బాటము) ప్రభువును ఆశ్చర్యపరిచింది. చివరికి ప్రభువు ఆగ్రహానికి గురి అయ్యింది.


రూపాంతరము: ఒక్కసారి మనమేం చేస్తున్నమో అలోచన చేద్దాం. దైవం పేరుతో ద్వేషం, అసూయ, పగ పెంచుకుంటున్నామా? దేవుడు మనకొరకు శ్రమిస్తున్నపుడు మనమాయనతో ఏకీభవించకుండ మన ఆచార, సాంప్రదాయాలతో ఆయన ఆకలిని తీర్చలేకపోతున్నామా?
పరలోకమందున్న మన ప్రభువును, మనకు ఇంత గొప్ప సదుపాయములనిచ్చుటకు సిలువలో శ్రమ అనుభవించిన యేసు ప్రభువు ఆజ్ఞను గుర్తుచేసుకుంటున్నామా? మన పొరుగు వారిని, కనీసం మన తలిదండ్రులను సరిగా ప్రేమించగలుగుతున్నామా? దైవం పేరుతో మన వారిని మనం బాధిస్తున్నామా? ఆయన అంత శ్ర మననుభవించి కోరుకున్నదొక్కటె. ప్రేమతో జీవించండి. వేషధారణను తొలగించి సత్యమును స్థాపించుటకు కావలసిన విశ్వాస సామర్ధ్యమును సంపాదించుటకు ప్రభువు శ్రమను తేరి చూచుదము.

ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మనకు కలుగును గాక! ఆమెన్.

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +