1. యేసు ప్రభువా! నీకు పరలోకమందు సర్వాధికారమియ్యబడెను. అందుచేత నీకు అనేక వందనములు.
2. యేసు ప్రభువా! నీకు భూమి మీద సర్వాధికారమియ్యబడెను. అందుచేత నీకు అనేక స్తోత్రములు.
3. యేసుప్రభువా! నీవు పరలోకమునకు వెళ్ళకముందు ఒక వాగ్ధాన మిచ్చినావు. అది ఏమంటే ‘ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను ‘. ఈ మాట నిమిత్తమై నీకు అనేక స్తుతులు. సమర్పించుచున్నాను.
4. ప్రభువా! నీవు పునరుత్థానమైన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడినావని వ్రాయబడియున్నది. కాబట్టి నీకు సంస్తుతులు.
5. యేసు ప్రభువా! నీవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నావని వ్రాయబడియున్నది. గనుక నీకు అనేక నమస్కారములు.
6. యేసుప్రభువా! నీవు పరలోకమునకు వెళ్ళినప్పటికిని, భూలోకములోనున్న నీ శిష్యులకు సహకారుడవై యున్నావని వ్రాయబడియున్నది. గనుక నీకు అనేక గౌరవ స్తోత్రములు.
7. ప్రభువా! భూమి మీద నీ శిష్యుల ద్వారా జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును నీవు స్థిరపర్చు చున్నావు అని వ్రాయబడియున్నది గనుక నీకు అనేక స్తోత్రములు.
8. ప్రభువా! నీవు ఆరోహణ సమయమందు, నీ శిష్యుల మీద చేతులెత్తి ఆశీర్వదించినావని వ్రాయబడియున్నది. కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు.
9. యేసు ప్రభువా! నీవు పరలోకమునకు ఆరోహణుడవైనావని వ్రాయబడియున్నది గనుక నీకు చాలా వందనములు.
10. యేసు ప్రభువా! నీవు నీ శిష్యులను ఆశీర్వదించుచుండగా, ఆరోహణుడవైనావని వ్రాయబడియున్నది గనుక నీకు అనేక వందనములు.
11. యేసు ప్రభువా! ఆరోహణ సమయమందు నీ శిష్యులు నీకు నమస్కారము చేసిరి. అంత్యదినమువరకు ఉండే నీ శిష్యులవల్ల నీకు నమస్కారములు కలుగుచుండును గాక.
12. యేసు ప్రభువా! నీవు వెళ్ళినందుకు వారు దుఃఖించక, మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి గనుక నీకు వందనములు.
13. యేసు ప్రభువా! నీవు వెళ్ళిన తరువాత వారు దేవాలయమునకు వెళ్ళి, ఎడతెగక దేవునికి స్తోత్రము చేయుచుండిరి గనుక నీకు వందనములు.