క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఆరోహణ పండుగ...
  5. ఆరోహణ పండుగ

ఆరోహణ పండుగ

వాక్య పఠన: తండై: ఆది 5:21-24′ కుమార: లూకా. 24:50-51; పరిశుద్ధాత్మ: అ.కార్య. 1:6-11.

ఈవేళ ఆరోహణ పండుగ సమయము. ఈ దినమునకు సంబంధించిన వర్తమానము, fare well (ఫేర్ వెల్) మీటింగునకు సంబంధించినది. ఈfare well అనునది ఇంగ్లీషు మాట. దీని అర్ధము ఏమనగా ఎవరైన ఒకరు ఒకచోట కొంతకాలము పనిచేసి, తిరిగి స్వదేశము వెళ్ళు సమయములో వారిని గూర్చిచేసే మీటింగు.

అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయములో యేసు ప్రభువుయొక్క ఫేరెవెల్ ఉన్నది. పరలోకమునుండి భూలోకమునకు వచ్చి, క్కమునకు వెళ్ళిపోవు దినము. అపోస్తలుల కార్యముల గ్రంధములో ఒకమాట ఉన్నది. అది “వారు కూడివచ్చినారు”. ఇక్కడ వారు అనగా శిష్యులు. ఈ శిష్యులే గెత్సెమనే తోటలో చెదిరిపోయినారు. అక్కడక్కడ వారు కలసికొన్నారు గాని, ఇంకా స్థిరపడలేదు. ప్రభువు బ్రతికి వచ్చినారనే సంగతి వారికి ఇంకా నిశ్చయము లేదు. నిశ్చయము కలుగుటకు ప్రభువు 40 దినములు గడువిచ్చినారు. అప్పటికి వారికి నిశ్చయము తెలిసినది. అందుచే ఇదివరకు చెదరిపోయిన వారిప్పుడు ఆఖరు పర్యాయము కూడుకొన్నారు.

అప్పుడు యేసుప్రభువు వారి దగ్గరనుండి సెలవు తీసికొనుటయు, వారు వారు సంతోషించుటయు కలిగెను. ఇట్టి సంతోషము ఆయన బ్రతికి ఉన్నప్పుడు గాని లేచినప్పుడు గాని, వారికి లేదుగాని ఈ దినమున్నది. ఆ సంతోషము వారికి కలిగేవరకు యేసుప్రభువు పనిచేసినారు. ఎప్పుడైతే ఆ సంతోషము కలిగినదో అప్పుడు పరలోకము వెళ్ళుటకు ఫేర్ వెల్ మీటింగునకు వీలైనది. ఆ సంతోషము వారికి లేనియెడల, వారికి నిశ్చయము లేదన్నమాట. అప్పుడు ప్రభువు భూమి మీద ఇంకా కొన్నాళ్ళుండవలసి వచ్చును గాని ఉండలేదు. గనుక వీరి సంతోషస్థితి, ప్రభువు పరలోకమునకు వెళ్ళుటకు సందు. పాత నిబంధనలో ఆరోహణ కథలు మూడు కలవు. ప్రభువు పుట్టుకకు ముందు ఆరోహణమైనవారు ముగ్గురు.

1. మొదటగా, పాత నిబంధనలోని ఆదికాండము 5వ అధ్యాయములో హనోకు ఆరోహణమైనాడు. ఇది వరకు ఆ విషయము చాలా సార్లు విన్నాము.

2. రెండవదిగా, రాజులు రెండవ గ్రంధములో ఏలీయా ఆరోహణమైనాడు. ఈ రెండు ఆరోహణముల మధ్య చాలా కాలము గడిచినది. ఈ రెండు కథలు మనకు బాగా తెలిసినవే.

3. మూడవ ఆయన ఎవరు?

ఆయన యేసుప్రభువే. మూడవ ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినట్లు ఆదికాండము 17వ అధ్యాయములో ఉన్నది. అక్కడ సున్నతి ఆచారమున్నది. దాని ద్వారా దేవుడు తన ప్రజలను స్థిరపరచెను. అది గొప్ప నిబంధన దినము. అప్పుడు దేవుడు భూమి మీదికి వచ్చి, చాలా సంభాషణ చేసెను.

ఆ తరువాత ఆరోహణమైనారని ఉన్నది. దేవుడు దేవుడు మాట్లాడవలసినపని అయిపోగానే, ఆరోహణమైనట్లుగా ఉన్నది. యేసుప్రభువు భూమి మీద చేయవలసిన, మాట్లాడవలసిన పనులన్నియు ముగింపుకాగానే ఆరోహణమైరి. ఫేర్ వెల్ కు సంబంధించిన విషయము, ముఖ్య విషయములు అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము చూడగలము.

1వ అంశము:- వారు కూడి వచ్చినప్పుడు శిష్యులు, ప్రభువు మీద ఒక ప్రశ్న వేసిరి. అది- పూర్వకాలమందు ఇశ్రాయేలీయులు ఈ శిష్యులవలె, దేవుని విడిచి విగ్రహారాధనచేసి, ఇతర దేశాలకు చెదరిపోవలసి వచ్చినది. 12 గోత్రాల ఇశ్రాయేలీయులంతా అనగా యూదులంతా చెదిరిపోయిరి.

ఈ 11మంది శిష్యులు ఆ యూదులకు సంబంధించినవారే. వారి రాజ్యము పోయింది. అప్పుడు రాజ్యం మహా ప్రబలంగా ఉంది 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు మొదలగు గ్రంధాలలో యూదుల రాజ్యం మహాప్రబలంగా ఉన్నది. 1వ దిన.వృ. 2వ దిన. వృత్థాంతముల గ్రంధములలోను అట్లే ప్రబలంగా ఉన్నది. వారి రాజ్యం ప్రబలంగాఉన్నప్పు డు ప్రవక్తల గ్రంధాలలో వివరించిరి. ఇందునుబట్టి ఇశ్రాఏలీయులు చాలా విచారంగా ఉండి ప్రభువా! ఆ రాజ్యాలు మరలా ఇస్తావా? అని అపోస్తలుల కార్యముల మొదటి అధ్యాయములో అడిగిరి. అప్పుడు ప్రభువు ఇవ్వను లేదా, ఇస్తాను అని కూడా అనలేదు. ఇప్పటికి రెండు వేల సంవత్సరములు అయినది. అది వెయ్యేండ్లలో ఇస్తారు. ఈ ప్రశ్న వేసినవారికి ఇవ్వరు. ప్రభువునందు విశ్వాసముంచిన యూదులకును; విశ్వసించిన అన్యులును యూదుల లెక్కలోనివారే గనుక వారికిని; అప్పుడు ఇస్తాను ఇప్పుడివ్వనని చెప్పలేదు. బైబిలు క్రమముగా చదివిన, ప్రకటనలో వివరముగా ఉన్నది. ఇది ఫేర్ వెల్ లోని మొదటి సంగతి.

1వ అంశము:- నేను పరలోకము నుండి పరిశుద్ధాత్మను పంపేవరకు, మీరు యెరూషలేములో ఉండుడి అనెను.

2వ అంశము:- మీరు ఆత్మను పొందిన తరువాత భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. ఫేర్ వెల్ మీటింగు అయినది.

Welcome Meeting (వెల్ కం మీటింగు):- ఇది భూమి మీద కాదు. పరలోకములో జరుగును. ఈ మీటింగు ద్వారా యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు చేర్చుకొనబడెనని అపోస్తలుల కార్యములలో రెండు సార్లున్నది. పరిశుద్ధులు, దేవదూతలు, పరిశుద్ధాత్మ తండ్రి, మొదలైన వారి యొక్క సమక్షంలో జరుగునదే ఈ వెల్ కం మీటింగు.

తెల్లవారు మన దేశములో పనిచేసి వారి దేశము వెళ్ళగానే,వీరు కష్టపడి ఇండియాలో పనిచేసి వచ్చిరని దీవించి చేర్చుకుంటారు.ఇదే వెల్ కం. సత్కరించు మీటింగు. అలాగే ప్రభువునుకూడా చేర్చుకొనిరి.

ఈ రెంటికి మధ్య విచిత్ర సంగతి జరిగింది. దానిలో రెండు విషయములు తెలియజేసెదను. గుంటూరునుండి మిషనెరీలు పనిచేసి వెళ్ళగానే, ఊరిలోనికి కొందరు ఎదురువచ్చి తీసుకు వెళ్ళినట్లు, పరలోకము నుండి ఇద్దరు తెల్లని వస్త్రధారులైన మనుష్యులు, మధ్యాకాశములోనికి వచ్చి ప్రభువును ఎదుర్కొని వెళ్ళిరి. ఆ సమయమందు శిష్యులు, రెప్పవేయకుండ ప్రభువు తట్టు చూస్తుండగా, ఈ ఇద్దరు – ‘ఎందుకు మీరింకా ప్రభువు తట్టు చూస్తున్నారు? ఈ వెళ్ళిపోయిన ఆయన తిరిగి దిగి వస్తారని చెప్పిరి ‘.

పునరుత్థానమప్పుడు సమాధి దగ్గరకు స్త్రీలు వెళ్ళగా, ఇద్దరు దేవదూతలు వారితో ‘సజీవుడై వెళ్ళిన ఆయనను మృతులలో ఎందుకు వెదుకుచున్నారనిరి ‘

అలాగే అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయములో, వెళ్ళిన ఆయన తిరిగి వస్తారని శిష్యులకు 1) ఆదరణ 2) ధైర్యము చెప్పిరి.

ప్రభువును శ్రమపర్చి పట్టుకున్నప్పుడు, సిలువకు కొట్టబడి చనిపోయి సమాధి చేయబడినప్పుడు, శిష్యులు బహువిచారముగా ఉన్నారుగాని ఇప్పుడావిచారములోనున్న వారిని, సమాధి దగ్గర కంటినీరు తుడిచి దేవదూతలు ఆదరించిరి. ఆరోహణములో దైర్యపరచి, వారి సంతోషమును స్థిరపరచిరి.

ఆరోహణమైన తరువాత జరిగేవన్నీ ఆనందకరమైన విషయాలే ప్రభువు పరలోకానికివెళ్ళేటప్పుడు ఆ చిన్న సంఘము, ఆయన వద్దనున్న సంఘమే, అప్పుడు అక్కడే ఉన్నది. తరువాత అనేక సంఘములు వచ్చినవి. 11మంది సంఘము తరువాత అనేక సంఘములతో, గుంటూరు సంఘము వచ్చినది.

ఫేర్ వెల్ అయిన తరువాత చెప్పవలసిన మాటలైపోయినవి గాని ఒక్క క్రియ మిగిలినది. అది చేస్తేనేగాని ఆయన పరలోకానికి వెళ్ళుటకు వీలులేదు. ఆ చివరి క్రియ ఏమనగా ‘వారి మీద చేతులు చాపి ఆ చిన్న సంఘాన్ని దీవించుట ‘.

బైబిలులో:- 1) చేతులెత్తును. 2) ఆశీర్వదించెనని ఉన్నది. గుడిలో అయితే ఆశీర్వదించి చేతులు దించుదురు గాని, ప్రభువు తన చేతులెత్తి ఆశీర్వదించి చేతులు దించుదురు గాని, ప్రభువు తన చేతులెత్తి ఆశీర్వదించుచూ పరమునకు వెళ్ళెను. ఆ ఎత్తిన ఎత్తడము సిం హాసనము మీదనుండి, నేటికిని దీవించుచునే ఉన్నారు. సంఘములో బలహీనతలు ఉన్నను, సంఘము అలాగే ఉన్నది. కారణము ఆయన ఇంకనూ చేతులు దించక దీవించుచునే ఉన్నాడుగాన సంఘము నిలిచి ఉన్నది. 1) ఆశీర్వదించుట ఆగలేదు. 2) చేతులు దించలేదు. 3) ఇక దించడు. ఆయన చేతులు అట్లే ఉండును గాన సంఘమును నిత్యము ఉండును: మోషే చేతులు పైకి ఎత్తి జయము పొందిన రీతిగా ఇక్కడ జరిగెను.

యాకోబు, మామ దగ్గరనుండి వస్తుండగా, ఆ సరిహద్దులలోకి ఆయనను ఎదుర్కొనుటకు ఇద్దరు దేవదూతలు వచ్చినట్లు, ప్రభువును ఇద్దరు మనుష్యులు ఎదుర్కొనిరి. యాకోబును ఎదుర్కొన్న స్థలానికి ‘మహనయీము ‘ అను పేరు వచ్చింది. అది పెద్ద పట్టణమైనది.

ఫేర్ వెల్ అయిపోగానే మధ్యదారిలో ఒకటి, పరలోకములో రెండవది, వెల్కంలు జరిగినవి. మధ్యలో ఇద్దరి ద్వారా, పరలోకములో అనేకులద్వారా వెల్కం లు జరిగెను.

గనుక ఇప్పుడును శ్రమలలో చిక్కులలో, వ్యాధులలో ఆదరణ లేక ఉన్నవారిని ఆయన దీవించుచు ఆదరించుచున్నాడు. (ఎత్తబడిన చేతులద్వారానే) ఆ లాగే సంఘ నాయకుడు ఆరోహణమై తావుకు, సంఘముకూడా ఆరోహణమగును. గాన మనము, మన ఆరోహణమునకు ఇప్పటినుండియే సిద్ధపడవలెను. అట్టి ధన్యత మనకందరకు కలుగును గాక! ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply